ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జర్మనీ చాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్‌కు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 20 MAY 2025 6:14PM by PIB Hyderabad

జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలిపారు. భారత్, జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘ఛాన్సలర్ @_FriedrichMerz తో మాట్లాడి, పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అభినందనలు తెలిపాను. భారత్, జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మేం కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాను. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించాం. ఉగ్రవాదంపై పోరాటంలో ఐక్యంగా నిలబడతాం.” 


(रिलीज़ आईडी: 2130086) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam