ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మే 22న రాజస్థాన్‌‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి


• బికనేర్... పలానాలో రూ.26,000 కోట్ల ఖర్చుతో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్న ప్రధాని

• వీటిలో రైల్వేలు, రహదారులు, విద్యుత్తు, నీళ్లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు చెందిన ప్రాజెక్టులు

• దేశంలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో

పునరభివృద్ధి పనులు పూర్తి చేసిన అమృత్ స్టేషన్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 20 MAY 2025 1:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 22న రాజస్థాన్‌లో పర్యటించనున్నారుఆయన ఉదయం సుమారు 11 గంటలకు బీకానేర్‌కు వెళ్తారుదేశ్‌నోక్‌లో కరణీ మాత ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు.

పదకొండున్నర గంటలకు ప్రధాని.. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరభివృద్ధి పనులు పూర్తి చేసిన దేశ్‌నోక్ స్టేషనును ప్రారంభించడంతో పాటు బికనేర్-ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారుఆ తరువాతరూ.26,000 కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టే అనేక అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపనప్రారంభోత్సవాలు చేయడంతోపాటు కొన్నింటిని దేశ ప్రజలకు అంకితమివ్వనున్నారుదేశ్‌నోక్‌లో ఒక బహిరంగసభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

దేశంలో రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరచాలన్న నిబద్ధతకు అనుగుణంగా ప్రధాని 18 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో రూ.1,100 కోట్లకు పైచిలుకు ఖర్చుతో పునరభివృద్ధి పనులు పూర్తి అయిన 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించనున్నారుఅమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 1,300కు పైగా స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతోఅభివృద్ధి చేస్తున్నారుప్రాంతీయ వాస్తుకళలకు అద్దంపడుతూనేప్రయాణికుల సౌకర్యాలను పెంచే దృష్టితో వీటిని తీర్చిదిద్దారుకరణీ మాత ఆలయానికి వచ్చే తీర్థయాత్రికులుపర్యటకులకు సేవలు అందించే దేశ్‌నోక్ రైల్వే స్టేషన్ పనుల్లో కరణీ మాత ఆలయ వాస్తుకళతోరణం-స్తంభం ఇతివృత్తాలను స్ఫూర్తిగా తీసుకున్నారుతెలంగాణాలోని బేగంపేట రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనుల్లో కాకతీయ సామ్రాజ్య వాస్తుకళను స్ఫూర్తిగా  తీసుకున్నారుబీహార్‌లో థావే స్టేషన్‌లో 52 శక్తి పీఠాలలో ఒకటైన మాత థావేవాలీకి ప్రాతినిధ్యం వహించే విభిన్న కుడ్య చిత్రాలు సహా కళాకృతులను అమర్చారుఅంతేకాకమధుబనీ పెయింటింగులను కూడా ఇక్కడ అలంకరించారుగుజరాత్‌లోని డాకోర్ స్టేషన్‌‌కు రణ్‌ఛోడ్‌రాయ్ జీ మహరాజ్ ప్రేరణగా నిలిచారుదేశవ్యాప్తంగా పునరభివృద్ధిపరచిన అమృత్ స్టేషన్లలో సాంస్కృతిక వారసత్వంతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలుదివ్యాంగ జనులు సహా ప్రయాణికులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మరీ తీర్చిదిద్దిన సౌకర్యాలకు తోడు మేలైన యాత్రానుభూతిని పంచడానికి  దీర్ఘకాలం నిలిచి ఉండే హంగూ ఆర్భాటాలను ఏర్పాటు చేశారు.

భారతీయ రైల్వేలు తన నెట్‌వర్క్‌ను 100 శాతం విద్యుదీకరించే దిశగా వేగంగా పయనిస్తోందిదీనితో రైల్వే కార్యకలాపాలు మరింత సమర్ధంగానుపర్యావరణానికి అనుకూలమైనవిగాను మారనున్నాయిదీనికి అనుగుణంగానేప్రధాని చురూ-సాదుల్‌పుర్ రైల్వే లైను (58 కిలోమీటర్ల)తో పాటు సూరత్‌గఢ్-ఫలోదీ (336 కి.మీ.)కి శంకుస్థాపన చేస్తారువిద్యుదీకరణ పూర్తయిన ఫులేరా-డెగానా (109 కి.మీ.), ఉదయ్‌పుర్-హిమ్మత్‌నగర్ (210 కి.మీ.), ఫలోదీ-జైసల్‌మేర్ (157 కి.మీ.)తో పాటు సమ్‌దడీ-బాడ్‌మేర్ (129 కి.మీరైలు మార్గాలను ప్రధాని దేశ ప్రజలకు అంకితం చేస్తారు.

రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహాన్ని అందించడానికిప్రధాని వాహన అండర్‌పాసుల నిర్మాణంనేషనల్ హైవేల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారుఆయన రాజస్థాన్‌లో ఏడు రహదారి ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేస్తారురూ.4,850 కోట్లకు పైగా వ్యయంతో ఈ రహదారి ప్రాజెక్టులు పూర్తి అయితే సరకు రవాణాతోపాటు ప్రజల రాకపోకలు సౌకర్యవంతంగా మారతాయిఈ హైవేలు భారత్-పాకిస్తాన్ సరిహద్దు వరకు విస్తరించిన కారణంగాభద్రతా దళాల రాకపోకలు పెరగడంతోపాటు భారత రక్షణ సంబంధి మౌలిక సదుపాయాలు బలోపేతమవుతాయి.

అందరికీ విద్యుత్తుహరిత ఇంధనంస్వచ్ఛ ఇంధనం.. వీటిని అందుబాటులోకి తీసుకుపోవాలన్న దార్శనికతను ముందుకు తీసుకు పోవడంలో భాగంగా ప్రధాని బికనేర్ నావాదీడ్‌వానాకుచామన్ లో  విద్యుత్తు ప్రాజెక్టులతో పాటు పార్ట్ బి పవర్‌గ్రిడ్ సిరోహీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్పార్ట్ ఇ పవర్‌గ్రిడ్ మేవాడ్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌ల విద్యుత్తు సరఫరాకు ఉద్దేశించిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలకు శంకుస్థాపన చేయనున్నారుఆయన బికనేర్‌లో సౌర ప్రాజెక్టుపవర్‌గ్రిడ్ నీమచ్బికనేర్ కాంప్లెక్స్ నుంచి తరలింపునకు ఉద్దేశించిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థఫతేహ్‌గఢ్-II పవర్ స్టేషన్‌లో సరఫరా సామర్థ్యం విస్తరణ సహా విద్యుత్తు ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారుఇవి స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించనున్నాయి

ప్రధానమంత్రి రాజస్థాన్‌లో మౌలిక సదుపాయాలనుసంధానాన్నివిద్యుత్తు సరఫరానుఆరోగ్య సంరక్షణ సేవలనునీటి లభ్యతను పెంచడానికి 25 ముఖ్య ప్రాజక్టులకు శంకుస్థాపన-ప్రారంభోత్సవం చేసి దేశ ప్రజలకు సమర్పించనున్నారువీటిలో రూ.3,240 కోట్లకన్నా ఎక్కువ ఖర్చుతో 750 కి.మీకి పైగా పొడవైన 12 స్టేట్ హైవేల ఉన్నతీకరణ పనులునిర్వహణ పనులకు శంకుస్థాపనలువాటిని దేశ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాలు భాగంగా ఉన్నాయి.  వీటిలో మరో 900 కి.మీకొత్త హైవేలు కూడా కలిసి ఉన్నాయిప్రధానమంత్రి బికనేర్ఉదయ్‌పుర్‌లలో విద్యుత్తు ప్రాజెక్టులను ప్రారంభిస్తారుఆయన రాజ్‌సమంద్భీల్‌వాడాధౌల్‌పుర్‌లలో నర్సింగ్ కళాశాలలను కూడా ప్రారంభించనున్నారుఇవి రాష్ట్రంలో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను పెంచడంలో ముఖ్యపాత్రను పోషించనున్నాయిప్రధాని ఝంఝును జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా ఫ్లోరోసిస్ తగ్గింపు ప్రాజెక్టు ‘అమృత్ 2.0’లో భాగంగా పాలీ జిల్లాలోని పట్టణాల్లో ‘పట్టణ నీటి సరఫరా పథకాల’ పునర్‌వ్యవస్థీకరణ సహా వివిధ జల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసివాటిని దేశ ప్రజలకు అంకితం చేస్తారు.‌‌‌

 

***


(Release ID: 2129887) Visitor Counter : 2