ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ జయంత్ నార్లికర్ మృతిపట్ల ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
20 MAY 2025 1:49PM by PIB Hyderabad
ఖగోళ భౌతిక శాస్త్ర రంగ నిష్ణాతుడు డాక్టర్ జయంత్ నార్లికర్ మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“డాక్టర్ జయంత్ నార్లికర్ మృతి వైజ్ఞానిక సమాజానికి తీరని లోటు. ఆయన నిష్ణాతుడు, ముఖ్యంగా ఖగోళ భౌతికశాస్త్ర రంగంలో విశేష ప్రతిభావంతుడు. ఆయన విస్తృత కృషి, ముఖ్యంగా ఆయన ఏర్పరచిన కీలకమైన సైద్ధాంతిక ప్రాతిపదికలు పరిశోధకులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. సంస్థాగత నిర్మాతగా, అలాగే యువత కోసం అభ్యసన, ఆవిష్కరణ కేంద్రాలను తీర్చిదిద్దడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. విజ్ఞానశాస్త్రాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడంలో ఆయన రచనలూ కీలక పాత్ర పోషించాయి. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు సంతాపం తెలుపుతున్నాను. ఓం శాంతి.
(रिलीज़ आईडी: 2129881)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam