ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్‌లో టిబి నిర్మూలన మిషన్‌పై ప్రధానమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం
प्रविष्टि तिथि:
13 MAY 2025 7:56PM by PIB Hyderabad
భారత్‌లో క్షయ వ్యాధి (టిబి) నిర్మూలన మిషన్‌పై ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. “ప్రజల క్రియాశీలక భాగస్వామ్యంతో టిబి నిర్మూలన ఉద్యమం గత కొన్ని సంవత్సరాలలో గణనీయమైన వేగాన్ని సాధించింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
“భారతదేశంలో క్షయ నిర్మూలన మిషన్‌పై సమీక్ష నిర్వహించాను. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో ఈ ఉద్యమం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయమైన వేగాన్ని సాధించింది. క్షయ వ్యాధి రహిత భారతదేశ లక్ష్యాన్ని సాధించేందుకు భాగస్వాములందరితో సమష్టిగా పనిచేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2128542)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Assamese
,
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada