ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ సాంకేతికత దినోత్సవం.. ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
11 MAY 2025 2:32PM by PIB Hyderabad
జాతీయ సాంకేతికత దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన శాస్త్రవేత్తలను చూస్తే గర్వంగా ఉందంటూ వారికి ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేయడంతోపాటు 1998లో పోఖ్రాన్ పరీక్షలను గుర్తుచేశారు. సైన్సు, పరిశోధనల అండదండలతో భావి తరాలకు సాధికారతను కల్పించడానికి కట్టుబడి ఉన్నట్లు కూడా ఆయన పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:
‘‘జాతీయ సాంకేతికత దినోత్సవం సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. ఈ రోజు మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడడమే కాక, వారికి కృతజ్ఞతలు వ్యక్తం చేయాల్సిన రోజు. అంతేకాక, ఇది 1998 పోఖ్రాన్ పరీక్షలను స్మరించుకోవాల్సిన రోజు కూడా. ఆ పరీక్షలు మన దేశాన్ని అభివృద్ధి పథంలో, ప్రత్యేకించి స్వయంసమృద్ధి దిశగా మన అన్వేషణలో ఓ ప్రతిష్ఠాత్మక ఘటనగా నిలిచాయి.
మన ప్రజల దన్నుతో, సాంకేతికతకు సంబంధించిన వివిధ పార్శ్వాలలో... అది అంతరిక్షం కావచ్చు, లేదా కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ నవకల్పనలు గాని, హరిత సాంకేతికత గాని లేదా మరిన్ని పార్శ్వాలలో, ప్రపంచ నేతగా భారత్ ఎదుగుతోంది. సైన్సు, పరిశోధన... వీటి అందడండలతో భావి తరాల వారికి సాధికారతను కల్పించడానికి మేం కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. మానవజాతి అభ్యున్నతికి సాంకేతికత తోడ్పడుతూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతుందని, రాబోయే కాలంలో వృద్ధికి చోదకశక్తిగా నిలుస్తుందని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2128206)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam