ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతరిక్ష అన్వేషణపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని చేసిన ప్రసంగం

Posted On: 07 MAY 2025 12:46PM by PIB Hyderabad

విశిష్ట ప్రతినిధులుగౌరవనీయులైన శాస్త్రవేత్తలుఆవిష్కర్తలువ్యోమగాములుప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు,

నమస్కారం!

గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ కాన్ఫరెన్స్-2025లో మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉందిఅంతరిక్షం కేవలం ఓ గమ్యస్థానం కాదుఅది ఆసక్తిధైర్యంసమష్టి ప్రగతిని ప్రకటించే అంశంభారతీయ అంతరిక్ష ప్రయాణం ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 1963లో ఓ చిన్న రాకెట్ ప్రయోగం నుంచి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా ఎదిగేంత వరకు మా ప్రయాణం అత్యద్భుతంమా రాకెట్లు పేలోడ్లను మించిన బరువును మోస్తున్నాయి. 1.4 బిలియన్ల మంది భారతీయుల కలలను అవి మోస్తున్నాయిభారత్ సాధించిన విజయాలు శాస్త్ర రంగంలో గొప్ప మైలురాళ్లువీటన్నింటినీ మించిమానవ స్ఫూర్తి... గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుందనడానికి ఇది గొప్ప రుజువు. 2014లో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకొని భారత్ చరిత్ర సృష్టించిందిచంద్రుడిపై నీటి జాడను కనుగొనేందుకు చంద్రయాన్-1 తోడ్పడిందిచంద్రయాన్-2 అధిక స్పష్టత ఉన్న చంద్రుని ఛాయాచిత్రాలను మనకు పంపిందిచంద్రుని దక్షిణ ధ్రువంపై మన అవగాహనను చంద్రయాన్–పెంచిందిమేం రికార్డు సమయంలో క్రయోజనిక్ ఇంజిన్లను తయారుచేశాంఒకే ప్రయోగంలో 100 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాంమా వాహక నౌకల ద్వారా 34 దేశాలకు చెందిన 400 ఉపగ్రహాలను కక్ష్యంలో ప్రవేశపెట్టాంఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను పూర్తి చేశాంఇది పెద్ద విజయం.

స్నేహితులారా,

ఇతరులతో పోటీ పడటం భారత అంతరిక్ష ప్రయాణ ఉద్దేశం కాదుఅందరితో కలసి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నదే మా ఆశయంమానవాళి సంక్షేమం కోసం అంతరిక్ష అన్వేషణ సాగించడమే మన అందరి ఉమ్మడి లక్ష్యందక్షిణాసియా దేశాల కోసం మేం ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాంజీ20కి అధ్యక్షత వహించిన సమయంలో మేం ప్రకటించిన జీ20 ఉపగ్రహాన్ని అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్దేశాలకు బహుమతిగా ఇస్తాంశాస్త్రీయ అన్వేషణకు సంబంధించిన హద్దులను అధిగమిస్తూ.. నూతన ఆత్మవిశ్వాసంతో మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాంమా మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ విస్తరిస్తున్న మా ఆకాంక్షలను తెలియజేస్తుందిత్వరలోనేఇస్రో-నాసా సంయుక్త మిషన్లో భాగంగా భారతీయ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళతారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించాలన్న మా లక్ష్యం.. పరిశోధనఅంతర్జాతీయ సహకారంలో నూతన అవకాశాలను తీసుకొస్తుంది. 2040 నాటికి చంద్రునిపై భారతీయుని పాదముద్రలు ఉంటాయిఅంగారకుడుశుక్ర గ్రహాలపై సైతం మా మా దృష్టిని సారిస్తున్నాం.

స్నేహితులారా,

భారత్‌కు అంతరిక్షం అంటేఅన్వేషణతో పాటు సాధికారతకు సంబంధించినదిఇది పరిపాలనను శక్తిమంతం చేస్తుందిజీవనోపాధిని పెంచుతుందితరాల పాటు స్ఫూర్తినిస్తుందిమత్స్యకారులకు హెచ్చరికల నుంచి గతిశక్తి వేదిక వరకురైల్వే భద్రత నుంచి వాతావరణ అంచనాల వరకుమన ఉపగ్రహాలు ప్రతి భారతీయుని సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయిఅంకుర సంస్థలుఔత్సాహిక పారిశ్రామికవేత్తలుయువ మేధకు మా అంతరిక్ష రంగం తలుపులు తెరిచాంప్రస్తుతం భారత అంతరిక్ష రంగంలో 250కి పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయిఇవి ఉపగ్రహ సాంకేతికతలుప్రొపల్షన్ వ్యవస్థలుఇమేజింగ్తదితరమైన అంశాల్లో అత్యాధునిక పురోగతులకు తోడ్పడుతున్నాయిమా అంతరిక్ష మిషన్లకు మహిళా శాస్త్రవేత్తలు స్ఫూర్తిదాయక నాయకత్వం వహిస్తున్నారని మీ అందరికీ తెలుసు.  

స్నేహితులారా,

వసుధైవ కుటుంబకం’ – ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం.. అనే పురాతన జ్ఞానం ఆధారంగా భారత అంతరిక్ష లక్ష్యం రూపుదిద్దుకుందిమా అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా.. ప్రపంచ జ్ఞానాన్ని సుసంపన్నం చేయడానికిఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికిభవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేందుకు మేం కృషి చేస్తున్నాంఉమ్మడి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడంవాటిని సాకారం చేసుకోవడంకలసి నక్షత్రాలను చేరుకోవడం అనే భావనకు భారత్ కట్టుబడి ఉంటుందిమెరుగైన రేపటి కోసం సైన్స్ఉమ్మడి కలల మార్గనిర్దేశంలో అంతరిక్ష అన్వేషణలో ఓ కొత్త అధ్యాయాన్ని మనం అందరూ కలసి లిఖిద్దాంమీ అందరూ భారత్‌లో ఆహ్లాదకరమైనఉత్పాదక సమయాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు.

 

***


(Release ID: 2127493)