ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఆంధోనీ అల్బనీజ్ రెండోసారి ఎన్నికైనందుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
• భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచాలంటూ నిబద్ధతను ప్రకటించిన ఇద్దరు నేతలు
• సమాలోచనల కొనసాగింపునకు నేతల సమ్మతి...తరువాతి సమావేశం కోసం నిరీక్షణ
प्रविष्टि तिथि:
06 MAY 2025 2:07PM by PIB Hyderabad
మాన్య శ్రీ ఆంధోనీ అల్బానీజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్‌లో ఈ రోజు మాట్లాడారు. ఆస్ట్రేలియాకు 32వ ప్రధానిగా తిరిగి ఎన్నికై చరిత్ర సృష్టించినందుకు ఆయనను శ్రీ మోదీ అభినందించారు.
ఉభయ దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (సీఎస్పీ) పటిష్ఠపరచుకోవాలన్న తమ నిబద్ధతను ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. సీఎస్పీ అమలులోకి వచ్చిన గత అయిదు సంవత్సరాలలోనూ, వివిధ రంగాల్లో బలమైన సహకారం సుసాధ్యం అయిందని వారు వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలను దృఢతరం చేయడంలో స్థానిక భారతి సంతతి ప్రజలు పోషించిన పాత్రను నేతలిరువురూ గుర్తు చేసుకున్నారు.
పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాలపై, ప్రపంచ వ్యవహారాలపై నేతలిద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకున్నారు. స్వతంత్ర, పారదర్శక, స్థిర, నియమాల ఆధారిత, సమృద్ధ ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించే దిశగా కలిసి పనిచేయాలన్న తమ నిబద్ధతను కూడా వారు పునరుద్ఘాటించారు.
భారత్‌లో ఈ సంవత్సరంలోనే ఏర్పాటు చేయనున్న వార్షిక శిఖరాగ్ర సదస్సు, క్వాడ్ సమ్మిట్‌లలో పాల్గొనడానికి రావాల్సిందంటూ శ్రీ అల్బనీజ్‌ను ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు. తరచూ మాట్లాడుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
***
(रिलीज़ आईडी: 2127240)
आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam