ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఈఈటీ పరీక్షకు ముఖ గుర్తింపు ప్రయోగాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యూఐడీఏఐ‌

Posted On: 05 MAY 2025 2:53PM by PIB Hyderabad

జాతీయ అర్హతప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్.. ఎన్ఈఈటీ యూజీ) 2025’ను నిర్వహించే కాలంలో అభ్యర్థుల ముఖ గుర్తింపు పద్ధతిని ఉపయోగించే అంశంపై నిర్ధారణ కసరత్తును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐవిజయవంతంగా పూర్తి చేసింది.
ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ల సహకారంతో చేపట్టారుఇది ఆధునిక బయోమెట్రిక్ టెక్నాలజీని ఉపయోగించి పరీక్ష నిర్వహణ పరంగా తీసుకోవాల్సిన భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతోపాటుఅభ్యర్థి ధ్రువీకరణనూ విజయవంతంగా పరీక్షించారు.
మన దేశంలో అన్నింటి కన్నా పెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల గుర్తింపును సరిచూసే సాధనంగా ఆధార్-ఆధారిత ముఖ ప్రమాణీకరణ ఎంతవరకు సాధ్యంఎంత ప్రభావశీలంగా ఉంటుందన్న అంశాల్ని మదింపు చేయడమే ఈ కసరత్తు ఉద్దేశం.
ఈ నిర్ధారణ కసరత్తు క్రమంలో.. ఢిల్లీలో ఎంపిక చేసిన ‘నీట్’ కేంద్రాల్లో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపును ఉపయోగించారుదీనిని ఎన్ఐసీకి చెందిన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ఎన్‌టీఏకు చెందిన పరీక్ష ప్రోటోకాల్స్‌తో కలిపి ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పరీక్షించారు.
ఆధార్‌తో ముడిపెట్టిన బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించుకొంటూముఖ ప్రమాణీకరణను వాస్తవిక సమయంలో (రియల్టైమ్పూర్తి చేశారుదీంతో ప్రక్రియ సంపర్క రహితంగానూ (కాంటాక్ట్‌లెస్), మరింత సువ్యవస్థితంగానూ మారిందిఅభ్యర్థుల గుర్తింపును సరిచూడటంలో వచ్చిన ఫలితాలు ఉన్నత స్థాయి కచ్చితత్వాన్నీప్రభావశీలత్వాన్నీ కలిగి ఉన్నాయి.
పెద్ద ఎత్తున నిర్వహించే పరీక్షల్లో గుర్తింపును సరిచూడడానికి ఒక సురక్షితవిస్తృతవిద్యార్థి అనుకూల పరిష్కార మార్గంగా ఆధార్ ముఖ గుర్తింపునకు గల సమర్ధతను కూడా ఈ కార్యక్రమం తెలియజెప్పిందిరాబోయే కాలంలో దీనిని ఉపయోగించడానికి ఉన్న అవకాశాలను సైతం ఇది చాటి చెప్పిందిఇది...ప్రవేశ పరీక్షల వేళ మోసాలకు పాల్పడే వారిని దీటుగా అడ్డుకోవడంలో ఇది కీలక భూమికను  పోషించగలదన్నది తెలిసింది.
ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో... పారదర్శకత్వాన్నీభద్రతను మెరుగుపరచడానికి డిజిటల్ నవకల్సనను ఉపయోగించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ సహకారపూర్వక ప్రయత్నం అద్దం పడుతోంది.‌‌

 

**‌*


(Release ID: 2127053) Visitor Counter : 16