WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ 2025లో భాగంగా రేపు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ‘స్టాటిస్టికల్ హ్యాండ్‌బుక్ ఆన్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ సెక్టార్ 2024-25’ ఆవిష్కరణ

 Posted On: 02 MAY 2025 2:29PM |   Location: PIB Hyderabad

వేవ్స్ 2025 కార్యక్రమంలో సమాచారప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ‘స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ ఆన్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ సెక్టార్ 2024-25’ను రేపు విడుదల చేస్తారుసేవారంగంలో ముఖ్యమైన భాగంగా ఉండిదేశ ఆర్థిక వృధ్ధికి సహకరించేందుకు విస్తృత అవకాశాలు ఉన్న ఎం అండ్ ఈ రంగానికి సంబంధించి కాలానుగుణంగావిశ్వసనీయమైనఅధికారికసమగ్ర సమాచారాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరిస్తున్నారుదేశంలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న మీడియావినోద రంగం 2027 నాటికి శాతం సీఏజీఆర్‌తో 3,067 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారుఈ రంగం అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగిన డేటా అవసరం.

మంత్రిత్వ శాఖతో పాటు ఈ రంగానికి సంబంధించిన వారికి ఉన్న డేటా అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ‘స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ ఆన్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ సెక్టార్ 2024-25’ను రేపు వేవ్స్ 2025లో ఆవిష్కరిస్తారుఈ హ్యాండ్ బుక్‌లో ఎం అండ్ ఈ రంగానికి చెందిన వివిధ విభాగాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని పొందుపరిచారు.

2024-25 ఏడాదికి గాను మీడియావినోద రంగానికి సంబంధించి గణాంకాల హ్యాండ్ బుక్‌లో పొందుపరిచిన కొన్ని అంశాలు:

  • 1957లో రిజిస్టరయిన ప్రింట్ పబ్లికేషన్ల సంఖ్య 5,932 కాగా 2024-25 నాటికి 4.99 శాతం సీఏజీఆర్‌తో 1,54,523 కు చేరుకున్నాయి.

  • 2024-25లో సమాచారప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగం130కి పైగా పుస్తకాలను ప్రచురించిందివాటిలో బాలల సాహిత్యంచరిత్ర-స్వాతంత్ర్యోద్యమంవ్యక్తులుజీవితచరిత్రలుఆధునిక భారత నిర్మాతలుసైన్స్టెక్నాలజీపర్యావరణం తదితర అంశాలపై ఈ పుస్తకాలను ప్రచురించారు.

  • 2025 మార్చి నాటికి డీటీహెచ్ ప్రసారాలు దేశంలో 100 శాతం అన్ని ప్రాంతాలకూ చేరుకున్నాయి.

  • దూరదర్శన్ ఉచితంగా ప్రసారం చేస్తున్న డిష్ ఛానళ్లు: 2004లో 33 ఉంటే 2025 నాటికి 381కి చేరుకున్నాయి

  • ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్ప్రసారాల విస్తరణ: 2025 మార్చి నాటికి దేశంలో 98 శాతం జనాభాకు రేడియో ప్రసారాలను అందిస్తోందిరేడియో స్టేషన్ల సంఖ్య 2000లో 198 నుంచి 2025 నాటికి 591కి పెరిగాయి.

  • ప్రైవేటు శాటిలైట్ ఛానళ్లు 2004-05లో 130 ఉంటే 2024-25 నాటికి 908కి పెరిగాయి.

  • ప్రైవేటు ఎఫ్ఎం కేంద్రాలు 2001లో నుంచి 2024 నాటికి 388కి పెరిగాయి.

  • 31.03.2025 నాటికి అందుబాటులో ఉన్న సమచారం ఆధారంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా సమాచారం.

  • కమ్యూనిటీ రేడియో స్టేషన్ (సీఆర్ఎస్)లు 2005లో 15 నుంచి 2025 నాటికి 531కి చేరుకున్నాయిరాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం/జిల్లా/ప్రాంతం వారీగా దేశంలో 31.03.2025 నాటికి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీఆర్ఎస్‌లకు సంబంధించిన సమాచారాన్ని కూడా దీనిలో పొందుపరిచారు.

  • 1983లో 741 చిత్రాలు ధ్రువీకరణ పొందితే.. 2024-25 నాటికి ఈ సంఖ్య 3,455కి పెరిగింది. 2024-25 వరకు ధ్రువీకరణ పొందిన చిత్రాల మొత్తం సంఖ్య 69,113.

గణాంకాలకు సంబంధించిన సమాచారంతో పాటుదిగువ పేర్కొన్న అంశాలు కూడా హ్యాండ్‌బుక్‌లో ఉన్నాయి:

  • అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు సహా చిత్రరంగంలో అందిస్తున్న పురస్కారాలుఎన్ఎఫ్‌డీసీ నిర్మించిన డాక్యుమెంటరీలకు సంబంధించిన సమాచారం హ్యాండ్‌బుక్‌లో ఉంది.

  • వేవ్స్ ఓటీటీ వేదికఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్‌తో సహా డిజిటల్ మీడియాసృజనాధారిత ఆర్ధిక వ్యవస్థపై వేవ్స్ 2025లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు.

  • ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌జీఐ), ఆకాశవాణిదూరదర్శన్ప్రైవేటు ఎఫ్ఎం రేడియో స్టేషన్లుటీవీ-ఇన్సాట్‌‌లో సమాచారప్రసార విభాగానికి సంబంధించిన చరిత్రాత్మక కార్యక్రమాల ప్రసారం

  • సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కోర్సులు.

ఆధునిక పోర్టళ్లతో సహా సమాచారప్రసార మంత్రిత్వ శాఖలో సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు

 

***


Release ID: (Release ID: 2126310)   |   Visitor Counter: 14