హోం మంత్రిత్వ శాఖ
రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 2025 సంవత్సరం పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి
4 పద్మ విభూషణ్, 10 పద్మ భూషణ్, 57 పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు అందజేసిన రాష్ట్రపతి
Posted On:
28 APR 2025 7:20PM by PIB Hyderabad
2025 సంవత్సరానికి పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి 4 పద్మ విభూషణ్, 10 పద్మ భూషణ్, 57 పద్మశ్రీ పురస్కారాలను గ్రహీతలకు అందజేసి గౌరవించారు.
భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పద్మ పురస్కార గ్రహీతలు రేపు ఉదయం జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని కూడా వారు సందర్శిస్తారు.
(Release ID: 2124995)
Visitor Counter : 14