సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
చారిత్రాత్మక కేన్స్ 2025 కు ఎంపికైన ఎస్ఆర్ఎఫ్‌టీఐ చిత్రం "ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లే"
సీమాంతర సహకారం, ప్రపంచ స్థాయి కథనంలో ఉన్నత స్థాయిని ప్రధానంగా తెలియజేస్తోన్న ఈ 23 నిమిషాల ప్రయోగాత్మక చిత్రం
Posted On:
26 APR 2025 6:24PM by PIB Hyderabad
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్‌టీఐ) విద్యార్థి తీసిన చిత్రం "ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లే" 2025కు సంబంధించిన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ప్రతిష్టాత్మక లా సినీఫ్ విభాగంలో అధికారికంగా ఎంపికైంది. ఈ విభాగంలో ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే. ఈ సంఘటన భారత సినిమా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
చిత్రం వివరాలు:
భారత్‌లో వృత్తిపరంగా ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు ఓ యువ నైజీరియన్ అథ్లెట్ తన తండ్రి భూమిని అమ్మేస్తాడు. అయితే ఆతనికి అయిన గాయం ఆటకు వీడ్కోలు పలికేలా చేస్తుంది. దీనితో నిరాశ చెందుతాడు. అంతేకాకుండా తనకు తెలియని దేశంలో చిక్కుకుపోయి ఉంటాడు. శారీరకంగా బాధ పడుతున్న అతను మానసికంగా కూడా గాయం వల్ల తీవ్ర భావోద్వేగంలో ఉంటాడు. గుర్తింపు పరంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అతను.. తన పూర్వీకుల ఆధ్యాత్మిక సంప్రదాయాలతో తిరిగి సంబంధం ఏర్పరచుకుంటాడు. భావోద్వేగం నుంచి విమోచన పొంది, జీవిత అర్థాన్ని కనుగొంటాడు. ప్రాంతాలు మారటం, నష్టం, సాంస్కృతిక ధృడత్వాన్ని గురించి తెలియజేసే చిత్రమే ‘ఎ డాల్ మేడ్ ఆఫ్ క్లే’.
ఎస్ఆర్ఎఫ్‌టీఐకు చెందిన పీఎఫ్‌టీ (ప్రొడ్యూసింగ్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్) విభాగం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ 23 నిమిషాల ప్రయోగాత్మక చిత్రం వివిధ దేశాల మధ్య సహకారాన్ని తెలియజేస్తోంది. ఐసీసీఆర్ ఆఫ్రికన్ ఉపకారం వేతనం కింద ఇథియోపియా విద్యార్థి కోకోబ్ గెబ్రెహే టెస్ఫే దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీఎఫ్‌టీ విద్యార్థి సాహిల్ మనోజ్ ఇంగ్లే నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ సినిమా సృజనాత్మకత విషయంలో ఎస్ఆర్ఎఫ్‌టీఐ అంకితభావాన్ని ప్రధానంగా వ్యక్త పరుస్తోంది.
కేన్స్‌లోని లా సినీఫ్‌లో పోటీ పడటానికి ఆహ్వానం అందుకున్న ఈ చిత్రం ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్కూల్‌లోని వర్ధమాన ప్రతిభను తెలియజేస్తోంది. ఈ చిత్రోత్సవం మే నెలలో ఫ్రాన్స్‌లో జరుగనుంది.
కలలు, ధృడత్వం, ప్రపంచ గుర్తింపు:
ఎస్ఆర్ఎఫ్టీఐ డీన్ ప్రొఫెసర్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ "మా విద్యార్థుల ఏదైనా సిని కళను ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తించినప్పుడు అది మాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మాకు చాలా గర్వకారణం. మా విద్యార్థులను చూసి మేం చాలా గర్విస్తున్నాం. పోటీలో వారు రాణించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
"ఖండాంతరాలకు అతీతంగా భాగస్వామ్యం కలిగిన ప్రాజెక్టు ఇది. సరిహద్దులను దాటిన కథ ఇది. కేన్స్ ఎంపిక అనేది కలను సాధించటం. ఇది ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలో జరుగుతోన్న ప్రపంచ స్థాయి ఆలోచనలకు నిదర్శనం'' అని నిర్మాత సాహిల్ మనోజ్ ఇంగ్లే అన్నారు.
దర్శకుడు కోకోబ్ గెబ్రెహే టెస్ఫే మాట్లాడుతూ, "ఈ లోతైన భావంతో కూడిన వ్యక్తిగత కథ కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ తమను తాము పునర్నిర్మించుకునే మంచి లక్ష్యాలు గల వారి ప్రయాణం గురించి మాట్లాడుతోంది. కేన్స్ తట్టుకొని నిలబడే శక్తిని, ఇంత వరకు బయటకి రాని కథలను వేడుక చేస్తుంది" అని వ్యాఖ్యానించారు.
ప్రపంచ స్థాయి భాగస్వామ్యం:
ఈ చిత్రం తారాగణం, పనిచేసిన వాళ్లని చూస్తే ఒక అసాధారణమైన అంతర్జాతీయ భాగస్వామ్యం కనిపిస్తోంది
నిర్మాత: సాహిల్ మనోజ్ ఇంగ్లే
రచన, దర్శకత్వం: కోకోబ్ గెబ్రెహవేరియా టెస్ఫే (ఇథియోపియా)
డీవోపీ: వినోద్ కుమార్
ఎడిటర్: హారూ - మహమూద్ అబూ నసీర్ (బంగ్లాదేశ్)
సౌండ్ డిజైన్: సోహమ్ పాల్
సంగీతం: హిమాంగ్షు సైకిహ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమా కుమారి, రోహిత్ కోడెల
లైన్ ప్రొడ్యూసర్: అవినాష్ శంకర్ రుర్వే
నటీనటులు : ఇబ్రహీం అహ్మద్ (నైజీరియా)
తారాగణం: గీతా దోషి, ఇబ్రహీం అహ్మద్, రిత్బన్ ఆచార్య
ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ:
ఎస్ఆర్ఎఫ్‌టీఐని ప్రముఖ డైరెక్టర్ సత్యజిత్ రే పేరు మీద 1995లో ఏర్పాటు చేశారు. చలనచిత్రాలకు సంబంధించిన విద్యలో నైపుణ్యం ద్వారా కొత్త తరం కథకులకు సాధికారత కల్పించే ఘన వారసత్వాన్ని ఇది కొనసాగిస్తోంది.
***
(Release ID: 2124773)
Visitor Counter : 13