ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ముస్లిమ్ వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ భేటీ
प्रविष्टि तिथि:
23 APR 2025 2:23AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముస్లిమ్ వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ శ్రీ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌కరీం అల్-ఇసా ఈ రోజు జెడ్డాలో సమావేశమయ్యారు. ఆయన జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి 2023 జులైలో న్యూఢిల్లీలో తాను సెక్రటరీ జనరల్‌తో సమావేశమైన సంగతిని గుర్తు తెచ్చుకొన్నారు. ముస్లిం వరల్డ్ సహనశీల విలువలను ప్రోత్సహిస్తూ, సంయమనాన్ని సమర్థిస్తూ, సామాజిక ఐకమత్యాన్ని పెంపొందించడంలో పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. భారత్ ఎప్పటి నుంచో ‘వసుధైవ కుటుంబకమ్’ను అనుసరించాలని చెబుతూ వస్తోందని ప్రధాని పునరుద్ఘాటిస్తూ భారత్ బహుళ సంస్కృతుల, బహుళ జాతీయ, బహుళ భాషల, బహు ధార్మిక సమాజంగా మనుగడ సాగిస్తూ వైవిధ్యంలో ఏకత్వానికి పెద్దపీట వేసిందన్నారు. ఒక పట్టాన నమ్మశక్యం కానంత వైవిధ్యమే భారత్‌కు అమూల్య శక్తిగా ఉంటూ చైతన్య భరిత సమాజంతో పాటు ప్రభుత్వ విధానాన్ని సాకారం చేస్తోందని ఆయన అన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, హింస... వీటిని వ్యతిరేకిస్తూ ముస్లిం వరల్డ్ లీగ్ దృఢ వైఖరి అవలంబించడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు.
సౌదీ అరేబియాతో తన సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యాన్నిస్తోందని, ఈ కారణంగానే అనేక రంగాల్లో పది కాలాల పాటు నిలిచి ఉండే భాగస్వామ్యాలు ఏర్పడ్డాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సామాజికంగా, సాంస్కృతికంగా నెలకొన్న సన్నిహిత సంబంధాలు కూడా ఈ భాగస్వామ్యంలో మరో కోణమేనంటూ ఆయన అభివర్ణించారు.
***
(रिलीज़ आईडी: 2123810)
आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada