ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్ తో ఫోన్ లో సంభాషించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


ద్వైపాక్షిక సహకారంపై సమీక్ష.. భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై నిబద్ధతను

పునరుద్ఘాటించిన ఇరువురు నేతలు

ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ

Posted On: 16 APR 2025 5:45PM by PIB Hyderabad

ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్‌లో మాట్లాడారు.

డిజిటలీకరణసుస్థిరతమొబిలిటీ సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై నేతలిద్దరూ సమీక్షించారుక్వాంటం, 5జీ-6జీఏఐసైబర్ భద్రత రంగాలు సహా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తమ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు.

ఉక్రెయిన్ పరిస్థితి సహా ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై కూడా వారిద్దరూ చర్చించారుభారత్ – ఈయూ మధ్య మరింత సన్నిహిత సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనాలున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై వీలైనంత త్వరగా అనిశ్చితిని తొలగించడానికి ఫిన్లాండ్ సహకరిస్తుందని అధ్యక్షుడు స్టబ్ వెల్లడించారు.

సంప్రదింపులను కొనసాగించడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు


(Release ID: 2122273) Visitor Counter : 26