ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ్‌కార్ మహామంత్ర దివస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


నవ్‌కార్ మహామంత్రం కేవలం ఒక మంత్రం కాదు, మన విశ్వాసాలకి అది కేంద్ర బిందువు: ప్రధానమంత్రి

నవ్‌కార్ మహామంత్రం నమ్రత, శాంతి, సార్వత్రిక సమభావన అంశాలను కలిగిన దివ్య సందేశం: ప్రధాని

పంచ పరమేష్టి ఆరాధన సహా... నవ్‌కార్ మహామంత్రం సవ్యమైన జ్ఞానం, దృక్పథం, ప్రవర్తన, ముక్తి మార్గాలను సూచించే మార్గదర్శి: శ్రీ మోదీ

భారతదేశ మేధో వైభవానికి జైన సాహిత్యం వెన్నెముక: ప్రధాని

విపరీత వాతావరణ పరిస్థితులు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాలు – పర్యావరణ అనుకూల జీవనమే సమస్యకి సరైన సమాధానం.. జైన సమాజం ఈ విధానాన్ని కొన్ని శతాబ్దాలుగా పాటిస్తోంది.. ప్రభుత్వం చేపట్టిన మిషన్ లైఫ్ కి ఈ విధానం అత్యంత అనుకూలం: ప్రధానమంత్రి

నవ్ కర్ మహామంత్ర దివస్ సందర్భంగా 9 సంకల్పాలను సూచించిన ప్రధాని

Posted On: 09 APR 2025 11:06AM by PIB Hyderabad

న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఈరోజు ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ కర్ మహామంత్ర దివస్ ను ప్రారంభించారుఈ సందర్భంగా మాట్లాడుతూమానసిక శాంతినిస్థిరచిత్తాన్ని అందించే సామర్థ్యం గల నవ్ కర్ మంత్రం.. దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుందని అన్నారుమంత్ర పఠనం వల్ల సిద్ధించే నిర్వికార స్థితి మాటలకుఆలోచనలకు అతీతమైనదనిచేతనలోఅంతరాత్మలో ఆ భావన స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని అన్నారుపవిత్రమైన నవ్‌కార్ మంత్రంలోని పంక్తులను చదివి వినిపించిన శ్రీ మోదీ- సంయమనంస్థితప్రజ్ఞతమనసు­­-అంతరాత్మల మధ్య సమన్వయం సాధించే నిరంతరాయ శక్తిప్రవాహంగా మంత్రశక్తిని అభివర్ణించారుతన సొంత ఆధ్యాత్మిక అనుభూతిని గురించి చెబుతూనవ్ కర్ మంత్రం ఇప్పటికీ తన అంతరాళాల్లో ప్రభావాన్ని చూపుతూనే ఉందన్నారుకొన్నేళ్ళ కిందట బెంగుళూరులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన సామూహిక మంత్ర పఠన ప్రభావం ఇప్పటికీ తనని వీడి పోలేదన్నారుదేశ విదేశాల్లోని పవిత్ర హృదయాలు ఒకే చైతన్యంతో ఒక సామూహిక అనుభవంలో భాగమవడం తిరుగులేని అనుభూతి అని సంతోషం వెలిబుచ్చారుఈ సామూహిక చర్య ద్వారా ఒకే లయలో ఒదిగే పంక్తుల పఠనం అసాధారమైన శక్తిని వెలువరించి మాటల్లో చెప్పలేని దివ్యానుభూతిని కలిగిస్తుందని శ్రీ మోదీ చెప్పారు.

జైన మాట పరివ్యాప్తి ప్రతి వీధికీ చేరిన గుజరాత్ రాష్ట్రంలో తన మూలాలు ఉన్నాయన్న ప్రధానిఈ కారణం చేతనే చిన్నప్పటి నుంచి జైన ఆచార్యుల సాంగత్యం తనకు లభించిందని చెప్పారు. “నవ్‌కార్ మంత్రాన్ని ఒక మంత్రంగా మాత్రమే చూడలేంఅది మన విశ్వాసాలకి కేంద్ర బిందువుజీవన సారం...” అని చెప్పారుమంత్ర ప్రాముఖ్యం ఆధ్యాత్మిక పార్శ్వానికి మించినదనిసమాజానికివ్యక్తులకీ పథ నిర్దేశనం చేస్తుందని చెప్పారునవ్‌కార్ మంత్రంలోని ప్రతి పాదంప్రతి పదం అనంతమైన అర్ధాన్ని కలిగి ఉందన్నారుమంత్రాన్ని పఠించే సమయంలో మనసులో పంచ పరమేష్టిని ప్రతిష్ఠాపించుకుంటామంటూ ఆ వివరాలను తెలియజేశారు. “కేవల జ్ఞానాన్ని” పొందిన అరిహంత్ లు భవ్య జీవులకు మార్గం చూపుతారనివీరు 12 దివ్య లక్షణాలను కలిగి ఉంటారనిఇక అష్టకర్మలను రూపుమాపి మోక్ష ప్రాప్తి పొందిన సిద్ధులు ఎనిమిది పరిశుద్ధమైన లక్షణాలను కలిగి ఉంటారని విశదీకరించారుమహావ్రతుణ్ణి అనుసరించే ఆచార్యులు 36 సుగుణాలను కలిగి ఉంటారనివీరు పథగాములనిఇక మోక్ష మార్గాన్ని గురించి ఎరుక కలిగించే ఉపాధ్యాయులు 25 సుగుణాలను కలిగి ఉంటారని చెప్పారుఆ మహాత్ముల ఆధ్యాత్మిక సాంద్రతవారికి అనుబంధంగా ఉన్న దివ్యమైన లక్షణాలను గురించి ప్రధాని తెలియజేశారు.

నవ్‌కార్ మంత్రాన్ని పఠించే సమయంలో 108 దివ్య గుణాలకి నమస్కరించిసర్వ మానవాళి సంక్షేమం కోసం ప్రార్థిస్తాం” అని శ్రీ మోదీ గుర్తు చేశారుజ్ఞానంకర్మఈ రెండు మాత్రమే జీవితంలో నిజమైన దిశలనిమన హృదయంలో సాక్షాత్కరించే బాట గురువు కృపమార్గదర్శనం వల్ల ఏర్పడుతుందన్న విషయాలు మంత్రాన్ని పఠించేటప్పుడు మనకు అవగతమవుతాయని అన్నారునవ్‌కార్ మంత్ర ప్రబోధాలు ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి సొంత బాటపై పయనాన్ని ప్రారంభించేందుకు ప్రోద్బలాన్ని కలిగిస్తాయన్నారుప్రతికూల ఆలోచనలుఅపనమ్మకంవిరోధ భావనలుస్వార్థం వంటివి మన లోపల నివసించే అసలైన శత్రువులనివాటిపై గెలుపే సిసలైన విజయమని అన్నారుబాహ్య ప్రపంచంపై నియంత్రణ కన్నాఅంతర్ ప్రపంచాన్ని జయించాలని జైన మతం ప్రబోధిస్తుందని మోదీ చెప్పారు. “తమపై తాము గెలిచినవారు అరిహంత్ లుగా మారుతారు” అన్నారునవ్‌కార్ మంత్రం లౌకికపరమైన కోర్కెలు తీర్చే సాధనం కాదనిమనిషి అంతరాత్మను శుద్ధి చేసివారిని మైత్రిసమాభావనల వైపు నడిపించే సూత్రమని అన్నారు.

ధ్యానంఅభ్యాసంఆత్మశుద్ధికి అత్యంత అనువైన నవ్‌కార్ మంత్రం కాలానికిసరిహద్దులకు అతీతమైనదనిఇతర భారతీయ మౌఖికపుణ్య గ్రంథాల మాదిరిగానే తొలుత అనుశ్రుతంగాతరువాతి కాలంలో లిఖిత రూపంలో – శాసనాలుఅనతి కాలంలో ప్రాకృత తాళపత్ర గ్రంథాల రూపంలో -  ఒక తరం నుంచి మరో తరానికి అందిన సంపద అని చెప్పారునేటికీ ఈ మంత్రం మానవాళికి దారి చూపుతోందని వ్యాఖ్యానించారు. “పంచ పరమేష్టి ఆరాధన సహా నవ్‌కార్ మంత్రం సవ్యమైన జ్ఞానానికిదృక్కోణానికిప్రవర్తనకి ప్రతిరూపమై ముక్తి మార్గాన్ని సూచిస్తోంది” అన్నారుమానవ జీవితంలోని తొమ్మిది మూలకాలు సంపూర్ణత్వానికి దారితీస్తాయంటూఈ సందర్భంగా భారతీయ తత్వంలో తొమ్మిది సంఖ్యకు గల ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు.  జైన మతంలో ‘తొమ్మిది’ సంఖ్య ఎంతో ప్రత్యేకమైనదనినవ్‌కార్ మంత్రంనవ మూలకాలునవ సుగుణాలు వంటి అంశాలను ఉదాహరించారుఅదే విధంగా నవ సంపదలునవ ద్వారాలునవగ్రహాలునవదుర్గలునవివిధ భక్తి మార్గాలు వంటి ఇతివృత్తాలు ఇతర భారతీయ సంప్రదాయాల్లో అంతర్భాగమని గుర్తు చేశారుమంత్ర పారాయణ సమయంలో ఆచరించే తొమ్మిది సార్ల పఠనంతొమ్మిది గుణకాలైన 27, 54, 108 వంటి సంఖ్యలు ‘నవ’ సంఖ్య పరిపూర్ణతను ఆవిష్కరిస్తాయన్నారుతొమ్మిది సంఖ్య గణితశాస్త్రానికి పరిమితమైనది కాదనిపరిపూర్ణతను సూచించే సిద్ధాంతమని చెప్పారుపరిపూర్ణతను సాధించిన మనసుబుద్ధినిశ్చలతను సాధించికొత్త వస్తువులుఅనుభూతులువాంఛల చట్రం నుంచి  విముక్తి పొంది ఉన్నతమైన స్థితికి చేరుకోగలవని చెప్పారులౌకికపరమైన అభివృద్ధిని సాధించిన తరువాత కూడా ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకునే ప్రజ్ఞను మంత్రం కలిగిస్తుందనిఅదే నవ్‌కార్ మంత్ర మహిమ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.   

నవ్‌కార్ మంత్ర మూల సిద్ధాంతం భారత్ ను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణమైనదని శ్రీ మోదీ చెప్పారుఈ సందర్భంగా తన ఎర్రకోట ప్రసంగాన్ని గుర్తు చేస్తూఅభివృద్ధి చెందిన భారత్  ప్రగతి సాధించినప్పటికీ వారసత్వాన్ని మరువదనితొట్రుపాటు లేకుండా మున్ముందుకు దూసుకువెళుతుందనిఅభివృద్ధి పథంలో పైకి ఎగబాకినప్పటికీ సంప్రదాయ మూలాలను మరువదని చెప్పారుఅభివృద్ధి చెందిన భారత్ తన సంస్కృతిని చూసి గర్విస్తుందన్నారుఈ సందర్భంగా తీర్థంకరుల బోధనల పరిరక్షణ గురించి ప్రస్తావించారుమహావీర జైనుని 2550వ నిర్వాణ మహోత్సవాన్ని గుర్తు చేసుకుంటూవిదేశాల నుంచి తీర్థంకరుల ప్రతిమలు సహా అనేక ప్రాచీన శిల్పాలు తిరిగి భారత్ చేరుకున్నాయన్నారుఇటీవలి సంవత్సరాల్లో 20కి పైగా తీర్థంకరుల విగ్రహాలు దేశానికి తిరిగివచ్చాయని హర్షం వ్యక్తం చేశారుదేశ విలక్షణతను తీర్చిదిద్దడంలో జైన మత పాత్ర సాటిలేనిదనిఈ మహోన్నత ధర్మాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారుప్రజాస్వామ్య ఆలయమైన నూతన పార్లమెంటు భవన నిర్మాణ  శైలిని ప్రస్తావిస్తూజైన మత సంప్రదాయాల ప్రభావం సుస్పష్టమని వ్యాఖ్యానించారుశార్దూల్ ద్వారం వద్ద గల వాస్తుకళ మందిరంలోని సమ్మేద్ శిఖర్లోక్ సభ ద్వారం వద్ద ఆస్ట్రేలియా నుంచి తిరిగివచ్చిన తీర్థంకరుని ప్రతిమకాన్సిస్టిట్యూషన్ గ్యాలరీ పైకప్పు పై చిత్రీకరించిన అద్భుత మహావీరుని చిత్తరువుసౌత్ బిల్డింగ్ గోడపై గల 24 తీర్థంకరుల కుడ్య చిత్రాల గురించి ప్రధాని గుర్తు చేశారుభారత్ దేశ ప్రజాస్వామ్యానికి  జైనం వంటి ఆధ్యాత్మికతలు మార్గ నిర్దేశం చేస్తాయన్నారు. “వత్తు సహవో ధమ్మో”, “చరిత్తం ఖలు ధమ్మో”, “జీవన రక్ఖనం ధమ్మో” వంటి ఆగమాల్లో ఉల్లేఖించిన  జైన సిద్ధాంతాల లోతైన నిర్వచనాలని ఉటంకించారుఈ సూత్రాల స్ఫూర్తితో ‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్’ అనే ఆశయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

‘‘భారత మేధో వారసత్వానికి వెన్నెముకగా జైన సాహిత్యం నిలిచింది... ఈ జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం మన కర్తవ్యం’’ అని శ్రీ మోదీ అన్నారుప్రాకృత భాషకూపాలీ భాషకూ శాస్త్రీయ భాష హోదాను ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రధానంగా చెబుతూజైన సాహిత్యం గురించి మరింత పరిశోధన చేసే అవకాశం దీంతో లభిస్తుందన్నారుభాషను సంరక్షించుకొంటే జ్ఞానం మనగలుగుతుందనీభాషను విస్తరించినందువల్ల జ్ఞానం వృద్ధి చెందగలదన్నారుజైన చేతిరాత పుస్తకాలు వందల సంవత్సరాల నుంచి భారత్‌లో ఉన్నాయన్న సంగతిని ప్రధాని చెబుతూలోతైన జైన ధర్మ ప్రభోధాల్లోని ప్రతి పేజీ చరిత్రకు అద్దంపట్టడమేకాక జ్ఞాన సాగరం లాంటివని అభివర్ణించారుఅనేక మహత్తర గ్రంథాలు మెల్లమెల్లగా అంతరించిపోతుండడం పట్ల ఆయన ఆందోళనను వ్యక్తం చేశారుఈ సంవత్సరం బడ్జెటులో ప్రకటించిన ‘జ్ఞాన్ భారతం మిషన్’ను ప్రారంభించిన సంగతిని ప్రస్తావించారుదేశవ్యాప్తంగా లక్షలాది చేతిరాత పుస్తకాల సర్వేను చేపట్టిప్రాచీన వారసత్వాన్ని డిజిటలీకరించే ప్రణాళికలు కూడా ఉన్నాయని వెల్లడిస్తూఈ పనులతో ప్రాచీనతను ఆధునికతతో జోడించవచ్చన్నారుఈ కార్యక్రమం ఒక ‘‘అమృత సంకల్పం’’ అని ఆయన అభివర్ణించారు. ‘‘న్యూ ఇండియా ఆధ్యాత్మికతతో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూనే కృత్రిమ మేధ (ఏఐద్వారా అవకాశాలను అన్వేషిస్తూ ఉంటుంద’’ని ఆయన స్పష్టం చేశారు.

జైన ధర్మం శాస్త్రీయవిజ్ఞానంసూక్ష్మగ్రాహ్యత.. ఈ రెండిటినీ కలబోసుకొందని ప్రధాని అన్నారుజైన ధర్మం తన మూల సిద్దాంతాల ద్వారా యుద్ధంఉగ్రవాదంపర్యావరణ సంబంధిత అంశాల వంటి ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తోందని ఆయన చెప్పారుజైన సంప్రదాయ చిహ్నంలో ‘‘పరస్పరోపగ్రహో జీవనం’’ అనే మాటలున్నాయనీజీవులన్నీ పరస్పరం ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయన్నారుపర్యావరణ పరిరక్షణపరస్పర సద్భావనశాంతిల సందేశాన్నివ్వడం ద్వారా జైన ధర్మం అహింస పట్ల... అది ఎంత సూక్ష్మస్థాయిలో అయినా కావచ్చు...  నిబద్ధతతో ఉందని ప్రధాని అన్నారుజైన ధర్మంలోని అయిదు ప్రధాన సిద్ధాంతాలను ఆయన పేర్కొంటూప్రస్తుత యుగంలో అనేకాంతవాద తత్వానికి ఉన్న సందర్భశుద్ధిని వివరించారుఅనేకాంతవాదంలో నమ్మకాన్ని కలిగి ఉండడం వల్ల అది యుద్ధంతోపాటు సంఘర్షణ స్థితులను అడ్డుకొంటుందనిఇతరుల భావనలతోపాటు దృష్టికోణాలను అర్థం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుందన్నారుప్రపంచం అనేకాంతవాద తత్వాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.  

 

భారతదేశం పట్ల ప్రపంచానికి నమ్మకం అంతకంతకు పెరిగిపోతోందనిభారత్ ప్రయత్నాలుఫలితాలు ప్రేరణాత్మకంగా మారుతున్నాయని శ్రీ మోదీ చెబుతూభారత్ సాధిస్తున్న ప్రగతి ఇతరులకు మార్గాలను చూపుతున్న కారణంగా ప్రపంచ సంస్థలు ఇప్పుడు భారత్‌కేసి చూస్తున్నాయన్నారుఈ పరిణామాన్నిజీవనంపరస్పర సహకారంపైనే ఆధారపడి మునుముందుకు సాగుతుందని సూచిస్తున్న ‘‘పరస్పరోపగ్రహో జీవనం’’ అనే జైన దర్శనంతో ప్రధాని జోడించారు.ఈ దృష్టికోణం భారత్ పట్ల ప్రపంచం అంచనాలను పెంచిందనిదేశం తన ప్రయత్నాలను ముమ్మరం చేసేసిందని ఆయన అన్నారువాతావరణ మార్పు వంటి తక్షణ శ్రద్ధ అవసరమైన అంశాన్ని ఆయన ప్రస్తావించిసువ్యవస్థిత జీవనశైలులను ఒక సమాధానంగా పేర్కొంటూ ‘మిషన్ లైఫ్’ (Mission LiFE)ను భారత్ పరిచయం చేయడాన్ని గుర్తుకు తెచ్చారుజైన సముదాయం వందల సంవత్సరాలుగా సీదాసాదాతనంనియంత్రణస్థిరత్వ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని మనుగడ సాగిస్తూవస్తోందని ఆయన అన్నారుజైనులు పాటించే ‘అపరిగ్రహ’ సిద్ధాంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ విలువలను విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారుప్రతి ఒక్కరూవారు ఏ ప్రాంతంలో ఉన్నా, ‘మిషన్ లైఫ్‌’కు ప్రచారకులుగా మారాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతమున్న సమాచార ప్రపంచంలో తెలివి కావలసినంత ఉందనీకానీ జ్ఞానం లేనిదే దీనిలో గాఢత్వం లోపిస్తుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుసరైన దారిని వెతకడానికి జ్ఞానానికీబుద్ధికీ మధ్య సమతౌల్యాన్ని ఏర్పరచుకోవడం గురించి జైన ధర్మం బోధిస్తుందని ఆయన చెప్పారుయువతకు ఈ సమతౌల్య సాధనకు ప్రాధాన్యాన్నివ్వాలని ఆయన స్పష్టం చేస్తూటెక్నాలజీకి మానవీయ స్పర్శ పూరకంగా ఉండాలనీనైపుణ్యాలను ఆత్మతో సంధానించాలనీ ఉద్బోధించారునవ్‌కార్ మహామంత్రం కొత్త తరం వారికి జ్ఞానందిశ.. ఈ రెండిటి మూలంలా పనిచేయగలదని ఆయన అన్నారు.

 

నవకార్ మంత్రాన్ని సామూహికంగా జపించిన తరువాత ప్రతి ఒక్కరూ తొమ్మిది సంకల్పాలు చెప్పుకోవాలని శ్రీ మోదీ కోరారువీటిలో మొదటి సంకల్పం ‘జల సంరక్షణ’ అన్నారునీళ్లను దుకాణాల్లో అమ్ముతారని బుద్ధి సాగర్ మహారాజ్ జీ 100 సంవత్సరాల కిందటే చెప్పిన సంగతిని ప్రధాని గుర్తుచేశారుప్రతి ఒక్క నీటి చుక్క ఎంత విలువైందీ గ్రహించిదానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ‘తల్లి పేరిట ఒక మొక్కను నాటాల’నేది రెండో సంకల్పంగా ఉందిఇటీవల కొన్ని నెలల కాలంలో 100 కోట్లకు పైగా మొక్కలను నాటిన సంగతిన ఆయన ప్రస్తావిస్తూప్రతి ఒక్కరూ వారి అమ్మ పేరిట ఒక మొక్కను నాటడంతోపాటు ఆమె ఆశీస్సుల మాదిరిగానే ఆ మొక్కను పెంచి పోషించాలని విజ్ఞప్తి చేశారు. 24 మంది తీర్థంకరులకు సంబంధించిన 24 మొక్కలను నాటే విషయంలో గుజరాత్‌లో తాను చేసిన ప్రయత్నాల్లో కొన్ని మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయినట్లు కూడా ఆయన చెప్పారుప్రతి వీధిలోచుట్టుపక్కలానగరంలో స్వచ్ఛత పరిరక్షణ చాలా ముఖ్యమంటూఅందరూ ఈ మిషన్‌కు వారి వంతు తోడ్పాటును అందించాలని ప్రధాని కోరారుమూడో సంకల్పంగా ‘స్వచ్ఛతా మిషన్’ను శ్రీ మోదీ ప్రస్తావించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నాలుగో సంకల్పందేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించాలనివాటికి ప్రపంచ స్థాయిలో ఆదరణ లభించేటట్లు చూడాలనిభారతీయ మట్టిభారతీయ కార్మికుల కృషితో రూపుదిద్దుకొన్న సరుకులకు మద్దతివ్వాలని ఆయన అన్నారుఅయిదో సంకల్పం ‘భారత్‌ను దర్శించడం’దేశంలో ప్రతి మూల ప్రాంతానికి తనదైన విశిష్టతవిలువ ఉన్నాయిని ప్రధానమంత్రి అంటూవిదేశాల్లో పర్యటించే ముందు భారత్‌లోని వివిధ రాష్ట్రాలను చూసిఅక్కడి సంస్కృతులనుప్రాంతాలను తెలుసుకోవాల్సిందిగా ప్రజలను కోరారుఆరో సంకల్పమైన ‘ప్రకృతి సేద్యానికి మొగ్గుచూపడం’ అనే అంశాన్ని ప్రధాని ప్రస్తావిస్తూఒక ప్రాణి మరో ప్రాణికి నష్టం చేయకూడదన్న జైన సిద్దాంతాన్ని ఉదాహరించారుధరణి మాతను రసాయనాల బారి నుంచి విముక్తం చేయాలనిరైతులకు అండగా నిలవాలనిప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారుఏడో సంకల్పంగా ‘ఆరోగ్యకరమైన జీవనశైలి’ని ప్రధాని ప్రతిపాదించారుసిరిధాన్యాలు (శ్రీ అన్నసహా భారతీయ ఆహార సంప్రదాయాలకు మళ్లడంనూనె వినియోగాన్ని 10 శాతం మేర తగ్గించుకోవడంసంయమనాన్నినియంత్రణను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన చెప్పారు. ‘యోగాభ్యాసంక్రీడలను జీవనంలో ఓ భాగంగా చేర్చుకోవడాన్ని’ ఎనిమిదో సంకల్సంగా ఆయన ప్రతిపాదించారుశారీరక స్వస్థతనుమానసిక ప్రశాంతిని పొందడానికి యోగానుక్రీడలను ఇంట్లోగానిపనిచేసే చోట గానిబడిలోలేదా పార్కులలో ఎక్కడైనా సరే దైనందిన జీవనంలో ఓ భాగంగా చేసుకోవాలని ఆయన స్పష్టంచేశారుచేయిపట్టుకొని గానిలేదా కడుపు నింపిగాని అణగారిన వర్గాలకు సాయపడడం ముఖ్యమని చెబుతూసేవ చేయడానికి సిసలైన అర్థం ‘పేదలకు సహాయాన్ని అందించడం’.. దీనిని తొమ్మిదోచివరి సంకల్పంగా ఆయన ప్రతిపాదించారుఈ సంకల్పాలు జైన ధర్మ సిద్ధాంతాలతోపాటు ఒక స్థిరమైనసామరస్యపూర్వక భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్న దార్శనికతతో సరిపోయేవిగా ఉన్నాయన్నారుఈ తొమ్మిది సంకల్పాలు వ్యక్తులలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటు యువ తరానికి ఒక కొత్త దిశను చూపుతాయివీటిని కార్యరూపంలోకి తీసుకువస్తే సమాజంలో శాంతిసద్భావనకరుణ పెంపొందుతాయి’’ అని ఆయన అన్నారు.   

 

రత్నత్రయదస్‌లక్షణ్సోలహ్ కరణ్ వంటి జైన ధర్మ సిద్ధాంతాలుపర్యూషణ్ వంటి పండుగలు ఆత్మకల్యాణానికి బాటలువేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ... ప్రపంచ నవ్‌కార్ మంత్ర దినోత్సవం ప్రపంచంలో సుఖశాంతులుసమృద్ధి నిరంతరాయంగా వర్ధిల్లేటట్లు చేయగలదన్నారుఈ కార్యక్రమ నిర్వహణ కోసం నాలుగు సంప్రదాయాలు ఒక చోటుకు చేరినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూఇది ఏకతకు ప్రతీకగా నిలచిందని అభివర్ణించారుఐకమత్య సందేశాన్ని దేశమంతా విస్తరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘భారత్ మాతా కీ జై’’ అని ఎలుగెత్తే ఎవరినైనా హృదయానికి  హత్తుకొని వారితో అనుబంధాన్ని పెంచుకోవాలనిఎందుకంటే ఈ శక్తి వికసిత్ భారత్ పునాదిని బలపరుస్తుందని ప్రధాని అన్నారు.

దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి గురు భగవంతులు ఆశీర్వాదాలు అందిస్తున్నందుకు ప్రధాని కృత‌జ్ఞత‌లు తెలిపారుఈ ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు యావత్తు జైన్ సముదాయానికి ఆయన తన నమోవాకాలు సమర్పించారుఆచార్య భగవంతులకుముని శ్రేష్ఠులకుశ్రావక్-శ్రావికాలతోపాటు దేశ విదేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ఆయన వందనాలు తెలిపారుఈ చరిత్రాత్మక  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేఐటీఓ ప్రయత్నాలను ఆయన అభినందిస్తూగుజరాత్ హోం మంత్రి శ్రీ హర్ష్ సంఘవీజేఐటీఓ అపెక్స్ చైర్మన్ శ్రీ పృథ్వీరాజ్ కొఠారీప్రెసిడెంటు శ్రీ విజయ్ భండారీజేఐటీఓకు చెందిన ఇతర అధికారులుప్రపంచ వ్యాప్త  ప్రముఖులు హాజరుకావడాన్ని గమనించిఈ అసాధారణ కార్యక్రమం విజయవంతం కావాలని తన శుభాకాంక్షలు తెలియజేశారు.

 

నేపథ్యం

నవ్‌కార్ మహామంత్ర దినోత్సవం ఆధ్యాత్మిక సద్భావననైతిక చేతనల ఉత్సవంఇది జైన ధర్మంలో అత్యంత ఆరాధ్యసార్వజనిక మంత్రోచ్చారణ ‘నవ్‌కార్ మహామంత్ర’ను సామూహికంగా జపించే కార్యక్రమం ద్వారా ప్రజలను ఏకతాటి మీదకు తీసుకురాదలచే ఒక మహత్తర వేడుకఅహింసనమ్రతఆధ్యాత్మిక ఉన్నతి అనే సూత్రాలపై రూపుదిద్దుకొన్న ఈ మంత్రం విజ్ఞ‌ుల సుగుణాలకు ప్రశంస పలుకడంతోపాటు మనిషి లోలోపల మార్పును ప్రేరేపిస్తుందిఈ దినోత్సవం మానవులంతా ఆత్మశుద్ధీకరణసహనంసామూహిక అభ్యున్నతి వంటి విలువలను సంపాదించుకోవాలంటూ వారిని ఉత్సాహపరుస్తుంది.

 

శాంతినీసమష్టితత్వాన్నీ పెంపొందింపచేయడానికి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన జప కార్యక్రమంలో 108కి పైగా దేశాల ప్రజానీకం పాల్గొన్నారువారు శాంతినిఆధ్యాత్మిక జాగృతినిసార్వజనిక సద్భావనను పెంచడానికే పవిత్ర జైన జపంలో పాలుపంచుకొన్నారు.

 


(Release ID: 2120499) Visitor Counter : 37