సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ బజార్
పరిశీలన, అనుసంధానం, ప్రపంచ స్థాయి వాణిజ్యం
Posted On:
01 APR 2025 6:44PM by PIB Hyderabad
గ్లోబల్ స్థాయి అవకాశాల పరిశీలన, అనుసంధానం, వాణిజ్యం సుసాధ్యం
పరిచయం
ప్రపంచ వినోద పరిశ్రమ నిపుణులని, వ్యాపారులను, సృజనకారులను ఒకచోటికి చేర్చే వేదిక వేవ్స్ బజార్. 2025, జనవరి 27న న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో కేంద్ర సమాచార, ప్రసారశాఖ, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్... కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించారు.
ప్రపంచ దృశ్య-శ్రవణ, వినోదరంగ సదస్సు-వేవ్స్ లో వేవ్స్ బజార్ కీలక అంతర్భాగం. ఈ పరిశ్రమలోని వృత్తి నిపుణులు ఒకచోటికి చేరి అనుసంధానమయ్యేందుకు, వ్యాపారపరమైన కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వేవ్స్ బజార్ ఉపయుక్తమైన వేదిక. ప్రపంచ వినోదరంగంలో పరస్పర అనుసంధానాన్ని పెంపొందించే లక్ష్యంతో ముంబయి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్ లో మే 1-4 తేదీల మధ్య వేవ్స్ సదస్సు జరుగుతుంది.
వేవ్స్ బజార్: గ్లోబల్ వ్యాపార కేంద్రం
మీడియా వినోదరంగాల్లోని అనేక శాఖలకు చెందిన వారిని ఒక్కచోటకు చేర్చే విలక్షణమైన అంతర్జాల వ్యాపార కేంద్రం వేవ్స్ బజార్. సినిమాలు, టెలివిజన్, యానిమేషన్, గేమింగ్, అడ్వర్టైజింగ్, ఎక్స్ ఆర్, సంగీతం, ధ్వని ముద్రణ, రేడియో వంటి అన్ని విభాగాలకూ ఈ ఇ-బజార్ చోటు కల్పిస్తుంది.
భాగస్వాముల కోసం ప్రయత్నం చేస్తున్న కంటెంట్ సృష్టికర్తలు, సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్న వ్యాపారులు, పెట్టుబడిదార్లను అన్వేషిస్తున్న ఆవిష్కర్తలు, ప్రపంచానికి తమ నైపుణ్యాన్ని పరిచయం చేయాలన్న ఆసక్తి గల కళాకారులు... వీరందరికీ వేవ్స్ బజార్ సరైన వేదిక కాగలదు. పరిశ్రమల వారు ఒకరితో ఒకరు అనుసంధానమై సహకరించుకునేందుకు, వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు వేవ్స్ బజార్ చక్కని అవకాశాలను కల్పిస్తుంది. ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మీడియా, వినోద రంగాలకు చెందిన దాదాపు 5500 కొనుగోలుదార్లు, 2000 పైన అమ్మకందార్లు సహా 1000 ప్రాజెక్టులు ఈ పోర్టల్ లో నమోదయ్యాయి.
· పరిశ్రమల సమగ్ర అనుసంధానం: సినిమాలు, టెలివిజన్, సంగీతం, గేమింగ్, యానిమేషన్, ఎక్స్ ఆర్, ఏఆర్, వీఆర్ వంటి నూతన సాంకేతికతలకు ఏకీకృత వేదిక
· అంతర్జాతీయ గుర్తింపు, రీచ్: వ్యాపారాన్ని సరిహద్దుల పరిమితులను దాటించి, వినోదరంగంలో అంతర్జాతీయ భాగస్వాములతో అనుసంధానమవ్వండి.
· సులభమైన నెట్వర్కింగ్, సహకార అవకాశాలు: మీ ఆశయాలకు తగిన నిపుణులు, సేవల వారు, కొనుగోలుదార్లు, పెట్టుబడిదార్లని కలుసుకుని వారితో మీ వృత్తిపరమైన అవసరాలను చర్చించి, సహకార అవకాశాలను పరిశీలించండి.
· క్రమబద్ధీకరించిన క్రయ-విక్రయాలు: సేవలను అందించే వారికి, భవిష్య వినియోగదార్లకు మధ్య సులభ వ్యాపారం జరిగేందుకు అనువుగా తీర్చిదిద్దిన వేదిక
· పరిశ్రమల ప్రత్యేక కార్యక్రమాలు, వ్యాపార కేంద్రాలు అందుబాటులో: పరిశ్రమల కోసం ప్రత్యేకించి రూపొందించిన కార్యక్రమాలు, పెట్టుబడిదార్ల సమావేశాలు, ప్రత్యేక వ్యాపార కేంద్రాలు వేవ్స్ వేదిక ద్వారా అందుబాటులోకి వస్తాయి.
· విభిన్న విభాగాల కింద ప్రాజెక్టు ప్రదర్శన అవకాశం: విక్రేతలు వారి ఉత్పత్తులను ఫిలిం నిర్మాణ సేవలు, వీఎఫ్ఎక్స్, అడ్వర్టైజింగ్, ధ్వని ముద్రణ, సంగీతం, గేమింగ్, యానిమేషన్ వంటి విభాగాల కింద ప్రదర్శించవచ్చు. Bazaa
వేవ్స్ బజార్ విభాగాలు
మీడియా వినోద రంగాల్లోని ప్రత్యేక విభాగాల అవసరాలకు అనువుగా వేవ్స్ బజార్ ను వివిధ శాఖల కింద విభజించారు:
· సినిమా, టీవీ, వెబ్ సీరీస్ : మీ కంటెంట్ గురించి తెలియజెప్పేందుకు గ్లోబల్ పంపిణీదార్లు, ఓటీటీ వేదికలు, ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులతో అనుసంధానమవ్వండి.
· గేమింగ్, ఇ-స్పోర్ట్స్: మీ గేమింగ్ ఇతివృత్తాలు, ఐపీలు, వనరులను పెట్టుబడిదార్లు, కొనుగోలుదార్లు, ప్రచురణకర్తల ఎదుట ప్రదర్శించండి.
· యానిమేషన్, వీఎఫ్ఎక్స్ : వివిధ సృజనాత్మక ప్రాజెక్టులకు ఉన్నత శ్రేణి యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సేవలను అందించగలమని ప్రతిపాదించండి.
· కామిక్స్, ఇ-బుక్స్: స్టోరీ బోర్డులు, ప్రచురణ, కంటెంట్ మరింత మందిని చేరేందుకు తగిన ప్రచారం చేపట్టండి.
· రేడియో, పాడ్ కాస్టులు: స్వతంత్ర ఆడియో సృజనకారులకు స్పాన్సర్ షిప్ దన్ను లభించి వారు సాధికారులు అయ్యేందుకు, మరింత మందికి చేరువయ్యేందుకు మీ సహకారం అందించండి.
· సంగీతం, ధ్వని విభాగం: లైసెన్సుల అవకాశాలని అందిపుచ్చుకుని, సంగీత సృష్టి, ధ్వని డిజైన్ల వంటి రంగాల్లో సహకార అవకాశాలను పరిశీలించండి.
· లైవ్ కార్యక్రమాలు,ఇన్ఫ్లూయెన్సర్ల మార్కెటింగ్: లైవ్ కార్యక్రమాల ద్వారా స్పాన్సరషిప్పులు, బ్రాండింగ్ భాగస్వామ్యాలు, ప్రేక్షకుల ఆసక్తిని మీ సొంతం చేసుకోండి.
వేవ్స్ బజార్ పనితీరు
వేవ్స్ బజార్ వెబ్సైట్ ను సందర్శించండి: wavesbazaar.com ను సందర్శించి అవగాహన పెంపొందించుకోండి.
మీ పేరు నమోదు చేసుకుని, ప్రొఫైల్ సృష్టించుకోండి: అమ్మకందారు, కొనుగోలుదారు లేదా పెట్టుబడిదారుగా నమోదు చేసుకుని వేదిక అందించే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోండి.
మీరు అందించగల సేవలు, లేదా మీ ప్రాజెక్ట్ అవసరాలను పేర్కొనండి: మీ నైపుణ్యాలను ప్రదర్శించండి లేదా మీ వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఉత్పత్తులను పరిశీలించండి.
అనుసంధానమవ్వండి, సహకరించుకోండి: పరిశ్రమ ప్రముఖులతో అనుసంధానమవ్వండి, సమావేశాలను ఏర్పాటు చేయండి, విజయవంతమైన భాగస్వామ్యాలకు శ్రీకారం చూట్టండి.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోండి: మీ వ్యాపారాన్ని విస్తరించండి, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించండి, దీర్ఘకాల భాగస్వామ్యాలకు తెర తీయండి.
అర్హత: వేవ్స్ బజార్ లో నమోదు చేసుకుని సేవలను అందుకునేందుకు మీరు 18 సంవత్సరాలకు పైబడిన వారై ఉండాలి.
వివిధ రంగాల నిపుణులకు వేవ్స్ బజార్
· అమ్మకందార్లు ప్రొఫైల్ పిక్చర్ కోసం ఫోటోను, ప్రాజెక్ట్ ప్రివ్యూ లింక్ ను అప్లోడ్ చేయాలి. ప్రాజెక్టు గురించి 50 పదాలకు మించని చిరు పరిచయం, ప్రాజెక్ట్ ఏ భాషకు చెందిందో తెలియజేయాలి.
· వెబ్ సైటు పైన ఉంచే కంటెంట్ లో చట్ట వ్యతిరేక, పరువునష్టం కలిగించే అసభ్య పదజాలాన్ని ఉపపయోగించరాదు.
· అమ్మకందారు అప్లోడ్ చేసే కంటెంట్ మేధో హక్కులకు భంగం కలిగించేది కాకూడదు.
· ఈ నిబంధనలకు భంగం కలిగించే కంటెంట్ ను తీసివేసే లేదా మార్చే హక్కు వేవ్స్ బజార్ కలిగి ఉంటుంది.
సృజనాత్మక పరిశ్రమలకు సంబంధించిన విక్రేతలు, కొనుగోలుదార్లకు వేవ్స్ బజార్ అందుబాటులో ఉంటుంది. విభిన్నమైన కంటెంట్, సేవల కోసం ఎదురుచూసే వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఇక్కడ కొనుగోలుదార్లుగా నమోదై నేరుగా సృజనకర్తలతో అనుసంధానమవవచ్చు. వేవ్స్ బజార్ లో నమోదు చేసుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించనక్కరలేదు.
విక్రేతలకు మార్గదర్శకాలు
కొనుగోళ్ళ నిమిత్తం వేవ్స్ బజార్ ను సందర్శించండి
కొనుగోలుదారుగా నమోదు చేసుకునేందుకు వేవ్స్ బజార్ వెబ్సైట్ లోని Wave Buyer Signup పేజీని సందర్శించండి. అవసరమైన వివరాలను ఇచ్చి మీ పేర్లను నమోదు చేసుకోండి. నమోదు ప్రక్రియ ముగిశాక అనేక సృజనాత్మక ప్రాజెక్టులు,సేవలు మీకు అందుబాటులోకి వస్తాయి- ఇక మీరు నేరుగా అమ్మకందార్లతో అనుసంధానమవవచ్చు.
వ్యూయింగ్ రూమ్, చిత్ర ప్రదర్శన సౌలభ్యాలు
. ఎంపిక చేసిన కంటెంట్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అనువుగా వేవ్స్ బజార్ లో అత్యాధునికమైన వ్యూయింగ్ రూం, మార్కెట్ స్క్రీనింగ్ సౌలభ్యాలు.
· ది వ్యూయింగ్ రూం: సినిమాలు, యానిమేషన్ చిత్రాలు, గేమింగ్ ఐపీల కొనుగోలు, భాగస్వామ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఆయా ఉత్పత్తులను నేరుగా వీక్షించే వీలు కల్పించే సురక్షితమైన డిజిటల్ సౌకర్యం.
· వ్యాపార చిత్ర ప్రదర్శనలు: పెట్టుబడిదార్లు, పంపిణీదార్లకు భారీ ప్రాజెక్టుల గురించి అవగాహన కల్పించి, ఆకర్షించేందుకు సంబంధిత చిత్రాల ప్రత్యేక ప్రత్యక్ష లేదా ఆన్ లైన్ ప్రదర్శనలు.
ముగింపు
ప్రపంచ మీడియా, వినోదరంగాల్లో వేవ్స్ బజార్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ రంగంలోని నిపుణులు, వ్యాపార సంస్థలు, సృజనకారులు కలుకునే వేదికగా రూపొందిన వేవ్స్ బజార్, అనేక అనుసంధాన, వృద్ధి అవకాశాలను కల్పించే అద్భుత వ్యాపార వేదిక. సినిమాలు, గేమింగ్, సంగీతం, అడ్వర్టైజింగ్ వంటి వేర్వేరు రంగాల్లో అవకాశాలను అందించే వేవ్స్ బజార్, పుష్కలమైన నెట్వర్కింగ్, వ్యాపారావకాశాలను కల్పిస్తుంది. అటు విక్రేతలకు, ఇటు కొనుగోలుదార్లకు అవకాశాలనందించే వేవ్స్ బజార్ ప్రపంచ వినోద రంగంలో పరస్పర వినిమయ అవకాశాలు, సృజనాత్మక సహకారానికి అనువైన వేదికగా ఆవిర్భవిస్తోంది.
మరింత సమాచారం:
· https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2107781
· https://www.wavesbazaar.com/
· https://x.com/WAVESummitIndia/status/1899452396822041044
వేవ్స్ బజార్
***
(Release ID: 2118097)
Visitor Counter : 6