సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పాప్ సంస్కృతి, సృజనాత్మకతను ప్రోత్సహించే భారత్ అతిపెద్ద కాస్ప్లే ఛాంపియన్షిప్ కు ఆతిథ్యమివ్వనున్న వేవ్స్-2025
Posted On:
30 MAR 2025 11:13AM by PIB Hyderabad
క్రియేటర్స్ స్ట్రీట్, తెలంగాణ ప్రభుత్వ ఎపికో కాన్ భాగస్వామ్యంతో, ఐసీఏ ఇండియన్ కామిక్స్ అసోసియేషన్, ఫోర్బిడెన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఇఎఐ), తెలంగాణ వీఎఫ్ఎక్స్ అనిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ), భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్స్ కోస్ప్లే ఛాంపియన్‌షిప్‌ను సగర్వంగా ప్రకటించాయి. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కోస్ప్లే పోటీగా నిలవనుంది. 2025 మే 1 నుంచి 4 వరకు ముంబయిలో జరుగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్)- 2025 లో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దేశంలోని అత్యంత ప్రతిభావంతులయిన కోస్ప్లేయర్లను ఈ కార్యక్రమం ఒక్కచోట చేర్చి, పాప్ సంస్కృతి ప్రపంచంలో వారి కళాత్మకత, అంకితభావం, నైపుణ్యాన్ని ఘనంగా ఆవిష్కరించనుంది.
వేవ్స్ కోస్ప్లే ఛాంపియన్‌షిప్ గురించి
వేవ్స్ కోస్ప్లే ఛాంపియన్‌షిప్ దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్ప్లే సముదాయాన్ని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి వేదికను అందిస్తూ, పాల్గొనేవారికి తమ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను, పాప్ సంస్కృతి పట్ల ఉన్న అభిరుచిని ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఛాంపియన్‌షిప్, దేశంలో విస్తరిస్తున్న వినోద, ఏవీజీసీ - ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) రంగాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది కాస్ట్యూమ్ డిజైన్, ప్రదర్శన, పాత్ర అభినయంలో స్వీయ వ్యక్తీకరణ, కొత్తదనాన్ని ప్రోత్సహిస్తుంది.
పోటీ ప్రత్యేకాంశాలు
గ్రాండ్ ఫినాలే: 80-100 మంది ఫైనలిస్టులు వేవ్స్ 2025 వేదికపై తమ కాస్ప్లేలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు.
జ్యూరీ: పరిశ్రమ నిపుణులు, అంతర్జాతీయ అతిథులు, కాస్ప్లే ప్రొఫెషనల్స్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
విభిన్న కేటగిరీలు: భారతీయ పురాణాలు, పాప్ కల్చర్, యానిమే, మంగ, డీసీ, మార్వెల్ ఇంకా మరెన్నో విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తాయి.
గ్లోబల్ ఎక్స్‌పోజర్: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం.
ప్రైజ్ మనీ: రూ.1,50,000 కంటే ఎక్కువ ప్రైజ్ మనీ
పోటీ స్వరూపం-ఎంపిక ప్రమాణాలు
1.ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, జ్యూరీ రివ్యూ - కాస్ప్లేయర్లు తమ ఎంట్రీలను ఆన్ లైన్ లో సమర్పించాలి,
2.ఫైనలిస్ట్ ఎంపిక - టాప్ 80-100 కాస్ప్లేయర్లను ఎంపిక చేసి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.
3.వేవ్స్ 2025 లో లైవ్ ఛాంపియన్షిప్ - ఫైనలిస్టులు పూర్తి కాస్ప్లేలో ర్యాంప్ పై నడుస్తూ ఉత్తమ భంగిమలు ప ప్రదర్శిస్తారు.
4.జ్యూరీ పరిశీలన-విజేతల ప్రకటన - కీలక తీర్పు ప్రామాణికాల ఆధారంగా, వివిధ కేటగిరీలలో విజేతలను ప్రకటిస్తారు.
ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 28, 2025
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 7
వేవ్స్ కాస్ప్లే ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే: మే 1 - 4, 2025
మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ సమాచారం కోసం, https://creatorsstreet.in/ సందర్శించండి. రిజిస్ట్రేషన్ లింక్- https://forms.office.com/r/xpeg7sDASm
వేవ్స్ గురించి
ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) మొదటి సదస్సును మీడియా, వినోద రంగాలకు ఒక మైలురాయిగా భారత ప్రభుత్వం 2025 మే 1 నుంచి 4 వరకు మహారాష్ట్రలోని ముంబయిలో నిర్వహించనుంది.
మీరు పరిశ్రమ నిపుణుడు, పెట్టుబడిదారు, సృష్టికర్త లేదా ఆవిష్కర్త అయితే ఈ సదస్సు మీరు మీడియా, వినోద రంగాలకు అనుసంధానం కావడానికి, భాగస్వామ్యంతో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు, అందించేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను అందిస్తుంది.
భారత యువత సృజనాత్మక శక్తిని మరింత పెంచి, కంటెంట్ క్రియేషన్, మేధో సంపత్తి సాంకేతిక నవీకరణల కేంద్రంగా దేశ స్థితిని బలపరచేందుకు వేవ్స్ సిద్ధంగా ఉంది. ప్రధానంగా దృష్టి సారించే రంగాలలో బ్రాడ్ కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్ టెండెడ్ రియాలిటీ (ఎక్స్ ఆర్) ఉన్నాయి.
ఏవైనా ప్రశ్నలున్నాయా? సమాధానాలు ఇక్కడ
PIB టీమ్ - వేవ్స్ నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోండి.
వేవ్స్ కు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి
***
(Release ID: 2116852)
Visitor Counter : 30
Read this release in:
Punjabi
,
Odia
,
English
,
Assamese
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Malayalam