రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

చైత్ర శుక్లాది, ఉగాది, గుడి పడ్వా, చేటి చాంద్, నవ్రే, సాజిబు చెయిరవోబా పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

Posted On: 29 MAR 2025 4:01PM by PIB Hyderabad

చైత్ర శుక్లాదిఉగాదిగుడి పడ్వాచేతి చాంద్నవ్రేసాజిబు చెయిరవోబా పర్వదిన సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ఒక సందేశంలో చైత్ర శుక్లాదిఉగాదిగుడి పడ్వాచేతి చాంద్నవ్రేసాజిబు చెయిరవోబా పర్వదిన సందర్భంగా భారత పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

వసంత రుతువు ప్రారంభంలో జరుపుకునే ఈ పండుగలు భారతీయ నూతన సంవత్సర ప్రారంభానికి ప్రతీకఈ పండుగలు మన సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూసామాజిక ఐక్యతను పెంపొందిస్తాయిఈ పండుగల సమయంలోమనం కొత్త పంటలను ఇంటికి తెచ్చుకుని ఆనందంగా పండుగ జరుపుకుంటూప్రకృతికి మన కృతజ్ఞతను తెలియజేస్తాం.

ఈ పవిత్ర సందర్భాల్లోసామరస్యంఐక్యతల స్ఫూర్తిని బలోపేతం చేస్తూ మన దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడానికి మనమంతా కొత్త శక్తితో పనిచేద్దాం”.

రాష్ట్రపతి సందేశాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి -

 

***


(Release ID: 2116817) Visitor Counter : 9