ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
प्रविष्टि तिथि:
23 MAR 2025 9:02AM by PIB Hyderabad
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఒక దార్శనికుడైన నేత, ఒక ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, సామాజిక న్యాయానికి ప్రతీక అని ప్రధాని ప్రశంసిస్తూ ఆయనను స్మరించుకొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ..
‘‘డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా ఆయనను నేను స్మరించుకొంటున్నాను. దూరదృష్టి కలిగిన నేత, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా.. సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాలవారికి సాధికారతను కల్పించడానికి, ఒక బలమైన భారత్‌ను నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు’’ అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2114221)
आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam