సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

థీమ్ మ్యూజిక్ పోటీ

Posted On: 13 MAR 2025 11:46AM by PIB Hyderabad

 సంగీతాభిరుచికి మేల్కొలుపు  

పరిచయం


థీమ్ మ్యూజిక్ పోటీ (టీఎంసీ), దేశ సంగీత ఆత్మని ప్రతిబింబించే కార్యక్రమంగా రూపొందింది. భారతీయ శాస్త్రీయ సంగీతం... లేదా శాస్త్రీయ, సమకాలీన రీతుల మేళవింపుగా ఉండే సంగీత రచనతో ముందుకు రావాలని ఈ పోటీ రచయితలను, గాయకులను, ప్రదర్శనకారులను, సంగీతజ్ఞులను ఆహ్వానించింది. ప్రపంచ ఆడియో-విజువల్, వినోద రంగ సదస్సు – వేవ్స్ కార్యక్రమాల్లో భాగంగా, భారతీయ సంగీత రంగ సహకారంతో, సమాచార, ప్రసార శాఖ క్రియేట్ ఇన్ ఇండియా పోటీల  కింద టీఎంసీని నిర్వహించింది.

మొత్తం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను ఒక చోటికి చేర్చే ఉత్తమ నైపుణ్యాల వేదికగా అవతరించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆడియో విజువల్, వినోదరంగ సదస్సు – వేవ్స్ తొలి సదస్సు జరగనుంది. ప్రపంచ మీడియా, వినోద రంగాల దృష్టిని ఆకర్షించడం ద్వారా భారత్ మీడియా, వినోద రంగాలను, ఆయా రంగాల్లో పనిచేసేవారిని వివిధ దేశాల మీడియా రంగంతో అనుసంధించాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటవుతోంది.

మే 1 నుంచి 4వ తేదీ వరకూ, ముంబయి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అండ్ జియో వరల్డ్ గార్డెన్స్ లో ఈ సదస్సు జరుగుతుంది. బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫోటెయిన్మెంట్, ఏవీసీజీ-ఎక్స్ ఆర్, డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్, ఫిలిమ్స్ అనే నాలుగు కీలక రంగాలపై దృష్టి సారించే వేవ్స్, భారత వినోద రంగ పరిశ్రమల భవిష్యత్తును నిర్దేశించే నాయకులు, సృజనకారులు, సాంకేతిక నిపుణులను ఒక చోటకు చేర్చనుంది.  

 “సాంగ్ ఆఫ్ ఇండియా” అనే ఇతివృత్తం గల టీఎంసీ పోటీ, భారతీయ సంగీతం  ఘనతని, ప్రభావాన్ని తెలియజేసింది. వేవ్స్ మొదటి మూలస్తంభం - బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫోటెయిన్మెంట్  లో భాగంగా పోటీ ఏర్పాటయ్యింది. ఇందులో భాగమయ్యేందుకు  178 మంది దరఖాస్తు చేసుకున్నారు.  

మార్గదర్శకాలు, నమోదు ప్రక్రియ

పోటీలో పాల్గొనే అర్హత కేవలం భారతీయులకే కల్పించగా, వీరంతా ప్రత్యేకమైన ప్రక్రియను ఎదుర్కొని, పలు నియమ నిబంధనలను పాటించారు.

·         దాఖలు విధానం: సాహిత్య సంబంధిత, సంగీత సంబంధిత, రూపక, నాటక రచనలు సహా వివిధ కళాత్మక రూపాల్లోని అనుసృజనలను అందజేశారు. కాగా, ఇవన్నీ 1-2 నిమిషాల ఎంపీ3, వేవ్ ఆడియో ఫైళ్ళ రూపంలో అందించారు. అత్యధిక ఆడియోలు మంచి నాణ్యతతో అందటం విశేషం.


·         నూతన సృజన: పోటీకి పంపే సృజనలు వేటికీ అనుసరణలు కారాదు. ఇంతకు ముందు ఎక్కడా ప్రచురించినవీ  ఉపయోగించినవీ కారాదు.

 

రన్నర్ అప్ బహుమతులు ( అయిదుగురు విజేతలు ):

·          

o  నగదు బహుమతి లేదా తత్సమానమైన ఇతర బహుమతి

o  సదస్సు వెబ్సైట్, సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు

o  వేవ్స్ సదస్సుకు ఆహ్వానం

 

సారాంశం

వేవ్స్ కార్యక్రమాల పరంపరలో భాగమైన థీమ్ మ్యూజిక్ పోటీ, భారతీయ సంగీత ఘన వారసత్వాన్ని చాటే పోటీగా నిలిచింది. శాస్త్రీయ సంగీతం స్ఫూర్తితో సరికొత్త సంగీత రచనతో ముందుకు రావాలని పోటీ అభ్యర్థులను కోరింది. నైపుణ్యం మెండుగా గల అభ్యర్థులు, సమగ్రమైన ఎంపిక ప్రక్రియలతో కూడిన పోటీ, విలక్షణమైన నైపుణ్యాల ప్రదర్శన వేదికగా నిలచి, భారతీయ సంగీత ప్రపంచపు లోతునూ విస్తృతినీ పరిచయం చేసింది. విజేతలకు చక్కటి బహుమతులు, మెంటార్షిప్ అవకాశాలు, ప్రపంచ స్థాయి గుర్తింపు వంటి అంశాలతో కూడిన ఈ పోటీ, దేశ వినోద రంగం భవిష్యత్తులో విజేతలు తమ సత్తా ఏ మేరకు చాటగలరో సూచించే కార్యక్రమంగా నిలిచింది.

 

 

మరింత సమాచారం

·      https://wavesindia.org/challenges-2025

·      https://indianmi.org/tmc/

థీమ్ మ్యూజిక్ పోటీ

 

***


(Release ID: 2111250) Visitor Counter : 17