ప్రధాన మంత్రి కార్యాలయం
మారిషస్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్‌ను కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్
Posted On:
12 MAR 2025 3:13PM by PIB Hyderabad
మారిషస్‌లోని రెడుయిట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్‌ను మారిషస్ ప్రధాని శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్‌తోపాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. భారత్-మారిషస్ అభివృద్ధి భాగస్వామ్యంలో ఓ భాగమైన ఈ ముఖ్య ప్రాజెక్టు మారిషస్‌లో సామర్థ్యాలను పెంచే కార్యక్రమాల పట్ల భారత్ ఎంత నిబద్ధతతో ఉందీ చెప్పకనే చెబుతోంది.
ఈ అత్యాధునిక సంస్థకు 2017లో 4.74 మిలియన్ అమెరికన్ డాలర్ల గ్రాంటు లభించింది. ఈ సంస్థ మారిషస్‌లో మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారాస్టేటల్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలలోని ప్రభుత్వోద్యోగులకు అవసరమైన శిక్షణను అందించనుంది. శిక్షణకు తోడు, ప్రభుత్వ పాలనలో శ్రేష్ఠత్వ కేంద్రంగా కూడా ఇది పనిచేస్తుంది. పరిశోధనను, పాలన సంబంధిత అధ్యయనాలను, భారత్‌తో సంస్థాగత సంబంధాలను కూడా ఈ ఇనిస్టిట్యూట్ ప్రోత్సహిస్తుంది.
ఈ సందర్భంగా ఐటీఈసీ, భారత ప్రభుత్వ ఉపకార వేతనాలను అందుకొని భారత్‌లో విద్యాభ్యాసాన్ని, శిక్షణను పూర్తి చేసిన పూర్వ విద్యార్థులతో ప్రధానమంత్రి మాట్లాడారు. సామర్థ్యాన్ని పెంపొందించే ఈ కార్యక్రమాలు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను విస్తరించడంతోపాటు ఆ సంబంధాలను బలోపేతం చేశాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల భారత్ చాటుకొంటున్న నిబద్ధతకు అనుగుణంగా, ఈ ఇనిస్టిట్యూట్ హిందూమహాసముద్ర ప్రాంతంలో ఒక విశ్వసనీయ భాగస్వామ్య దేశంగా భారత్ పోషిస్తున్న పాత్రతోపాటు భారత్-మారిషస్ సమగ్ర భాగస్వామ్యాన్ని బలపరిచే విషయంలో దృఢమైన నిబద్ధతకు కూడా అద్దంపడుతోంది.
***
(Release ID: 2111144)
Visitor Counter : 36
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada