ప్రధాన మంత్రి కార్యాలయం
సర్ శివూసాగర్ రాం గులామ్, సర్ అనిరుద్ధ్ జగన్నాథ్ సమాధుల వద్ద ప్రధానమంత్రి పుష్పాంజలి
प्रविष्टि तिथि:
11 MAR 2025 3:04PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పేంప్లేముసెస్‌లోని సర్ శివూసాగర్ రాంగులామ్ బొటానిక్ గార్డెన్స్‌లో సర్ శివూసాగర్ రాంగులామ్, సర్ అనిరుద్ధ్ జగన్నాథ్‌ల సమాధులను సందర్శించి శ్రద్ధాంజలి సమర్పించారు. పుష్పాంజలి కార్యక్రమంలో ప్రధానిని... మారిషస్ ప్రధానమంత్రి శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్ అనుసరించారు. మారిషస్ ప్రగతిలోనూ, భారత్-మారిషస్ సంబంధాలకు బలమైన పునాదిని వేయడంలోనూ ఈ ఇద్దరు నేతల సుదీర్ఘ వారసత్వాన్ని ప్రధాని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొన్నారు.
పుష్పాంజలి కార్యక్రమం ముగిసిన తరువాత, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతోపాటు మారిషస్ ప్రధానమంత్రి శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్ చారిత్రక ఉద్యానవనంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు.
(रिलीज़ आईडी: 2110308)
आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam