ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వన్యప్రాణులను సంరక్షించే, వాటిని ప్రమాదాల నుంచి రక్షించే, పునరాశ్రయాన్ని కల్పించే కేంద్రం ‘వన్‌తారా’ను ప్రారంభించిన ప్రధానమంత్రి

Posted On: 04 MAR 2025 4:05PM by PIB Hyderabad

వన్యప్రాణులను సంరక్షించడం, వాటిని ప్రమాదాల బారి నుంచి కాపాడడం, వన్యప్రాణులకు పునరాశ్రయాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ‘వన్‌తారా’ కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని జాంనగర్‌లో ఈ రోజు ప్రారంభించారు. శ్రీ అనంత్ అంబానీతోపాటు ఆయన బృందం దయాభరిత ప్రయత్నాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. వన్‌తారా వన్యప్రాణుల సంక్షేమాన్ని, పర్యావరణ సుస్థిరత్వాన్ని ప్రోత్సహిస్తూనే వన్యప్రాణులకు ఒక సంరక్షణ కేంద్రంగా పనిచేస్తుందని ఆయన అభివర్ణించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన కొన్ని సందేశాలను పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఒక విశిష్ట వన్యప్రాణి సంరక్షణ, సహాయక, పునరావాస కేంద్రం ‘వన్‌తారా’ను ప్రారంభించాను.. ఇది వన్యప్రాణుల సంక్షేమాన్ని, పర్యావరణ సుస్థిరత్వాన్ని ప్రోత్సహిస్తూనే వన్యప్రాణులకు ఒక సంరక్షణ కేంద్రంగా పనిచేస్తుంది. ఎంతో దయాభరితమైన ఈ తరహా కృషికిగాను అనంత్ అంబానీని, ఆయన పూర్తి జట్టును నేను అభినందిస్తున్నాను.’’

‘‘వన్‌తారా వంటి ప్రయత్నాన్ని సాకారం చేయడం నిజంగా ప్రశంసనీయం.. మనం మన భూగ్రహాన్ని కలసి పంచుకొంటున్న ఇతర వర్గాలను కూడా పరిరక్షించాలని బోధిస్తున్న శతాబ్దాల నాటి సభ్యతకు ఇదొక చైతన్యభరిత తార్కాణం. ఇవిగో కొన్ని దృశ్యాలు..’’   

 

***


(Release ID: 2108098) Visitor Counter : 20