ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళలు వారి స్ఫూర్తిదాయక జీవన విశేషాలను పంచుకోవాలి: ప్రధానమంత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8న తన తన సోషల్ మీడియా ఖాతాలను ఎంపిక చేసిన కొంతమంది మహిళలకు అప్పగించనున్న ప్రధానమంత్రి
Posted On:
03 MAR 2025 7:54PM by PIB Hyderabad
నమో యాప్ ఓపెన్ ఫోరం ద్వారా ఈరోజు ఎంతోమంది మహిళల స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాలను తెలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చ్ 8న తన డిజిటల్ సోషల్ మీడియా ఖాతాలను ఎంపిక చేసిన కొంతమంది మహిళలకు అప్పగించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయక జీవితాలను గురించి మహిళలు ఆ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకోవాలని ఆయన కోరారు.
X వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
"నమో యాప్ ఓపెన్ ఫోరం ద్వారా చాలామంది ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాలను పంచుకోవడం నేను చూస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8వ తేదీన నా డిజిటల్ సోషల్ మీడియా ఖాతాలను వీరిలో నుంచి కొంతమంది మహిళలకు అప్పగిస్తాను. వారు ఇలాంటి మరింత మంది మహిళల జీవితాల్లోని స్ఫూర్తిదాయక విషయాలను ఈ సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరితో పంచుకోవాలని నేను కోరుతున్నాను."
***
MJPS/SR
(Release ID: 2107920)
Visitor Counter : 19