ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


న్యూస్ఎక్స్ వరల్డ్ ఛానల్‌ను ప్రారంభించిన పీఎమ్

21వ శతాబ్దపు భారత్‌ను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది: పీఎమ్

నేడు భారత నిర్వహణ నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రపంచ దేశాలు చూస్తున్నాయి: పీఎమ్

నేను దేశానికి అందించిన ‘వోకల్ ఫర్ లోకల్’, ‘లోకల్ ఫర్ గ్లోబల్’ దార్శనికత, ఇప్పుడు సాకారమవడం మనం చూస్తున్నాం: పీఎమ్

నేడు భారత్ ప్రపంచ కర్మాగారంగా రూపొందుతోంది; భారత్ శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా ఎదిగింది! : పీఎమ్

‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’... సమర్థమైన, ప్రభావవంతమైన పాలనకు తారక మంత్రం : పీఎమ్

అనంతమైన ఆవిష్కణలకు వేదికగా మారుతున్న భారత్: పీఎమ్

భారత యువతే మా తొలి ప్రాధాన్యం: పీఎమ్

విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు మించి ఆలోచించే అవకాశం కల్పించింది జాతీయ విద్యా విధానం: పీఎమ్

Posted On: 01 MAR 2025 12:36PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనిప్రసంగించారు. న్యూస్ఎక్స్ వరల్డ్ ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారుహిందీఇంగ్లీష్‌లతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఛానల్‌లను కలిగి ఉన్న ఈ నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారుపలు ఫెలోషిప్‌లుఉపకారవేతనాల ప్రారంభాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

గతంలో ఇలాంటి మీడియా కార్యక్రమాలకు తాను హాజరయ్యానని గుర్తుచేసుకున్న ప్రధానమంత్రిఈ రంగంలో నేడు కొత్త ఒరవడిని సృష్టించిన న్యూస్ఎక్స్ వరల్డ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారుఈ తరహా మీడియా కార్యక్రమాలు దేశంలో ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీన్యూస్ఎక్స్ వరల్డ్ దీనికి కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆయన పేర్కొన్నారుతమ శిఖరాగ్ర సదస్సు రాజకీయాల కంటే విధానాలను గురించిన చర్చలకే ప్రాధాన్యమిచ్చినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారువివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల చర్చలుఆలోచనలకు ఈ సదస్సు గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారువారు ఒక వినూత్న నమూనాపై పనిచేశారని తెలిపిన ప్రధానమంత్రి ఇతర మీడియా సంస్థలు సైతం వారి సొంత ఆలోచనలకు అనుగుణంగా ఈ ధోరణిని మరింత మెరుగ్గా కొనసాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ప్రపంచం 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఆసక్తిగా గమనిస్తోందిఅని ప్రధానమంత్రి ఉద్ఘాటించారుప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారత్‌ను సందర్శించిమన విధానాలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారుభారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్నాయనిప్రతిరోజూ కొత్త రికార్డులు ఇక్కడ నమోదవుతున్నాయనిప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంఘటన మన దేశంలో చోటుచేసుకుంటున్నదని ఆయన ప్రధానంగా ప్రస్తావించారుప్రయాగ్‌రాజ్‌లో ఈనెల 26తో మహా కుంభమేళా ముగిసిన విషయాన్ని ప్రస్తావిస్తూఆ పవిత్ర సంగమ తీరంలో కోట్లాది మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు"భారత నిర్వహణ నైపుణ్యాలుఆవిష్కరణలను ప్రపంచం చూస్తోందిఅని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుసెమీకండక్టర్ల నుంచి విమాన వాహక నౌకల వరకు ప్రతీది భారత్‌లో తయారవుతున్నాయన్న ప్రధానమంత్రి... ఈ విషయంలో భారత్ ఘనత గురించి ప్రపంచం వివరంగా తెలుసుకోవాలనుకుంటుందని తెలిపారున్యూస్‌ఎక్స్ వరల్డ్‌ కు ఇది ఒక గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.

కొన్ని నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ, 60 ఏళ్లలో తొలిసారిగా దేశంలో ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారుగత 11 ఏళ్లలో దేశం సాధించిన అనేక విజయాలతోనే ప్రజల్లో ఈ విశ్వాసం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారుఈ కొత్త ఛానల్ వాస్తవ ఘటనలను గురించి పక్షపాతం లేకుండా ప్రపంచానికి యదార్థాన్ని చూపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

"కొన్ని సంవత్సరాల క్రితంనేను 'వోకల్ ఫర్ లోకల్', 'లోకల్ ఫర్ గ్లోబల్అనే దార్శనికతను దేశానికి అందించానునేడుఈ దార్శనికత వాస్తవ రూపం దాల్చడం మనం చూస్తున్నాంఅని ప్రధానమంత్రి ఉద్ఘాటించారుభారత ఆయుష్ ఉత్పత్తులుయోగాను నేడు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారన్న ప్రధానమంత్రిమన సూపర్ ఫుడ్ అయిన మఖానాఅలాగే "శ్రీ అన్నా"గా పిలిచే చిరుధాన్యాలకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించడం గొప్ప విజయమని వ్యాఖ్యానించారుతన మిత్రులైన ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ ఢిల్లీ హాత్‌లో మన చిరుధాన్యాలతో చేసిన వంటకాలను స్వయంగా రుచి చూసి ఆనందం వ్యక్తం చేయడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

చిరు ధాన్యాలతో పాటుమన దేశ పసుపు కూడా ప్రపంచస్థాయిని చేరుకుందనీప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పసుపులో 60 శాతానికి పైగా మన దేశమే అందిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. భారత కాఫీ సైతం ప్రపంచ దేశాల ఆదరణ పొందడమే గాకప్రపంచంలోని కాఫీ ఎగుమతిదారుల్లో ఏడో స్థానంలో భారత్ నిలిచిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మన దేశ మొబైల్ ఫోన్లుఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మందులు ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయని ఆయన స్పష్టం చేశారుఅనేక ప్రపంచస్థాయి కార్యక్రమాలకు భారత్ నాయకత్వం వహిస్తోందని తెలిపారుఫ్రాన్స్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమిట్‌కు సహ-ఆతిథ్య దేశంగా హాజరైన భారత్ ఇటీవలే ఆ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం పొందినట్లు తెలిపారుభారత్ అధ్యక్షతన జీ-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించామన్న ఆయనఆ సదస్సులోనే కొత్త ఆర్థిక మార్గంగా భారత్-మధ్యతూర్పు-యూరప్ కారిడార్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారుగ్లోబల్ సౌత్‌కు ప్రధాన గొంతుకగా భారత్ ద్వీప దేశాల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చినట్లు ఆయన పేర్కొన్నారువాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికిమిషన్ లైఫ్ దార్శనికతను ప్రపంచానికి అందించిన ఘనత భారత్ సొంతమని ఆయన ఉద్ఘాటించారుఅంతర్జాతీయ సౌరశక్తి కూటమివిపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి వంటి కార్యక్రమాల్లో భారత్ నాయకత్వాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారుఅనేక భారతీయ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న క్రమంలోభారత మీడియా సైతం ఈ ప్రపంచస్థాయి అవకాశాలను అర్థం చేసుకునిస్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.

దశాబ్దాలుగా ప్రపంచం భారత్ ను వెనకుండి పనిచేసిపెట్టే కార్యాలయం మాదిరిగా చూశారనీనేడు భారత్ ప్రపంచ కర్మాగారంగా రూపుదిద్దుకుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుభారత్ నేడు శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా ఎదిగిందని ఆయన స్పష్టం చేశారుఒకప్పుడు అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న మన దేశం ఇప్పుడు ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారుగతంలో స్థానిక మార్కెట్లకే పరిమితమైన రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారుపుల్వామా స్నో పీస్మహారాష్ట్ర పురందర్ అంజీర పండ్లుకాశ్మీర్ క్రికెట్ బ్యాట్‌లకు ప్రపంచస్థాయిలో డిమాండు పెరుగుతోందని శ్రీ మోదీ ప్రస్తావించారుభారత రక్షణ ఉత్పత్తులు ప్రపంచానికి మన ఇంజనీరింగ్సాంకేతికత బలాన్ని ప్రదర్శించాయని ఆయన వ్యాఖ్యానించారుఎలక్ట్రానిక్స్ నుంచి ఆటోమొబైల్ రంగం వరకుభారత స్థాయినిసామర్థ్యాన్ని ప్రపంచం చూసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. “భారత్ ప్రపంచానికి ఉత్పత్తులను అందించడమే కాకుండా ప్రపంచ సరఫరా రంగంలో విశ్వసనీయనమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోంది” అని ఆయన అన్నారు.

"ఏళ్ల తరబడి కృషిప్రణాళికబద్ధమైన విధాన నిర్ణయాల ఫలితంగానే వివిధ రంగాల్లో భారత్ నాయకత్వం సాధ్యపడిందిఅని శ్రీ మోదీ తెలిపారుగత పదేళ్లలో సాధించిన పురోగతిని ప్రధానంగా ప్రస్తావించారు. గతంలోని అసంపూర్ణ వంతెనలుసగంలో నిలిచిపోయిన రహదారుల స్థానంలో ఇప్పుడు మంచి రహదారులుఅద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వేలు అందుబాటులోకి వచ్చి వేగంగా ముందుకు సాగే మార్గాలుగా రూపాంతరం చెందాయన్నారుతగ్గిన ప్రయాణ సమయంఖర్చులు సరుకు రవాణా సమయాన్ని తగ్గించే అవకాశాన్ని పరిశ్రమలకు కల్పించాయనిఇది ఆటోమొబైల్ రంగానికి గణనీయ ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారువాహనాలకు పెరిగిన డిమాండ్ఈవీ ఉత్పత్తులకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రస్తావించిన ఆయననేడు భారత్ ఒక ప్రధాన ఆటోమొబైల్ ఉత్పత్తిదారుఎగుమతిదారుగా రూపుదిద్దుకుందని వ్యాఖ్యానించారు.

ఎలక్ట్రానిక్స్ తయారీలో సైతం గణనీయమైన పురోగతి సాధ్యమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుగత దశాబ్దంలో2.5 కోట్లకు పైగా కుటుంబాలకు తొలిసారిగా విద్యుత్ సదుపాయం దక్కింది. దీని వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల డిమాండ్ఉత్పత్తి పెరిగిందని ఆయన అన్నారుసరసమైన డేటాతో మొబైల్ ఫోన్ల డిమాండ్‌ పెరిగిందనీమొబైల్ ఫోన్లలో సేవల లభ్యత పెరగడంతో డిజిటల్ పరికరాల వినియోగం అనూహ్యంగా పెరిగిందని ఆయన వివరించారుపిఎల్ఐ వంటి పథకాలు ఈ డిమాండ్‌ను అవకాశంగా మార్చాయనిదీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ ప్రధాన ఎగుమతిదారుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారుఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునివిజయవంతంగా వాటిని సాధించగల భారత సామర్థ్యానికి "మినిమమ్ గవర్నమెంట్మాగ్జిమమ్ గవర్నెన్స్తారకమంత్రమని శ్రీ మోదీ పేర్కొన్నారుదీని కారణంగానే ప్రభుత్వ జోక్యం లేదా ఒత్తిడి లేకుండా సమర్థంగాప్రభావవంతమైన పాలనను అందించగలుగుతున్నట్లు తెలిపారు. బ్రిటిష్ పాలనలో అమలైనవాడుకలో లేని సుమారు 1,500 చట్టాలను గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వం రద్దు చేసిందని శ్రీ మోదీ ఉదహరించారుఅటువంటి చట్టంలో ఒకటి నాటిక ప్రదర్శన చట్టం. ఇది బహిరంగ ప్రదేశాల్లో నృత్యం చేసే వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుమతించే చట్టంఈ చట్టం స్వాతంత్ర్యం తర్వాత 70 సంవత్సరాల వరకు అమలులో ఉందనీప్రస్తుత ప్రభుత్వం దీనిని రద్దు చేసిందని తెలిపారుగిరిజన ప్రాంతాలుఈశాన్య ప్రాంతాల జీవనాధారమైన వెదురుకు సంబంధించిన పాత చట్టాలను సైతం ప్రధానమంత్రి ఉదహరించారుగతంలోవెదురును నరికిన వారిని అరెస్టు చేసేలా చట్టం ఉందిఎందుకంటే వెదురును వృక్షాల వర్గంలో చేర్చారుఅయితే వెదురును గడ్డిమొక్కగా గుర్తిస్తూ దశాబ్దాల నాటి పనికిరాని ఆ చట్టాన్ని మా ప్రభుత్వం మార్చిందిఅటువంటి కాలం చెల్లిన చట్టాలపై మునుపటి నాయకులుఉన్నత వర్గాలు నిర్లక్ష్యం వహించారని విమర్శించిన శ్రీ మోదీవాటి రద్దు కోసం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.

పదేళ్ల కిందట ఐటీఆర్ దాఖలు చేయడం ఒక సాధారణ వ్యక్తికి చాలా కష్టమైన పనిగా ఉండేదనీకానీ నేడు అది కొన్ని క్షణాల్లోనే పూర్తవుతోందనిఅలాగే కొద్ది రోజుల్లోనే వారి ఖాతాలకు రిఫండ్స్ జమ అవుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఆదాయపు పన్ను చట్టాలను మరింత సరళీకృతం చేసే ప్రక్రియ పార్లమెంటులో కొనసాగుతోందని ఆయన తెలిపారు. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపునిచ్చామనీఇది వేతనదారులకు గణనీయ ప్రయోజనం చేకూరుస్తుందన్నారుయువ నిపుణులు వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికిఅలాగే వారి పొదుపును పెంచుకోవడానికి బడ్జెట్ సహాయపడిందని ఆయన స్పష్టం చేశారుజీవన సౌలభ్యంవ్యాపార నిర్వహణ సౌలభ్యం కల్పించడం అలాగే దేశ ప్రజలకువారి ఆకాంక్షల కోసం అంతులేని అవకాశాలను అందించే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని శ్రీ మోదీ పేర్కొన్నారుఅనేక అంకుర సంస్థలు జియోస్పేషియల్ డేటా నుంచి ప్రయోజనం పొందుతున్నాయన్నారు. గతంలో మ్యాప్‌లను రూపొందించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం ఉండేదనిప్రస్తుత ప్రభుత్వం దీనిని మార్చడం ద్వారా అంకుర సంస్థలుప్రైవేట్ కంపెనీలు ఈ డేటాను అద్భుతంగా ఉపయోగించుకునేందుకు వీలు కల్పించామని ఆయన తెలిపారు.

ప్రపంచానికి సున్నా అనే భావనను అందించిన భారత్ ఇప్పుడు అనంతమైన ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ ఆవిష్కర్తగానే కాకుండా "ఇండోవేటింగ్అంటే భారతీయ విధానాన్ని ఆవిష్కరిస్తూ రాణిస్తోందని పేర్కొన్నారుభారతదేశం సరసమైనఅందుబాటులో ఉండేఅనుసరణీయమైన పరిష్కారాలను ఆవిష్కరిస్తూఎలాంటి నియంత్రణ లేకుండా ప్రపంచానికి వాటిని అందిస్తోందని ఆయన స్పష్టం చేశారుప్రపంచానికి సురక్షితమైనఖర్చు లేని డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అవసరమైనప్పుడుభారత్ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్వ్యవస్థను అభివృద్ధి చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారుప్రొఫెసర్ కార్లోస్ మోంటెస్ యూపీఐ టెక్నాలజీ ప్రజా-హిత స్వభావాన్ని చూసి ముగ్ధులయ్యారనినేడు ఫ్రాన్స్యూఏఈ, సింగపూర్ వంటి దేశాలు యూపీఐని తమ ఆర్థికరంగ వ్యవస్థల్లో అనుసంధానిస్తున్నాయని శ్రీ మోదీ గుర్తుచేశారుభారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలైన ఇండియా స్టాక్‌తో అనుసంధానం కోసం అనేక దేశాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారుకోవిడ్-19 మహమ్మారి సమయంలోప్రపంచానికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను భారత టీకా అందించిందన్నారుప్రపంచ శ్రేయస్సు కోసం ఆరోగ్య సేతు యాప్‌ను ఓపెన్ సోర్స్‌గా మార్చిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారుఅంతరిక్ష రంగంలోనూ భారత్ ప్రధాన శక్తిగా అవతరించిందనిఇతర దేశాల అంతరిక్ష ఆకాంక్షల సాధనకు భారత్ సహాయం చేస్తోందని ఆయన తెలిపారుప్రజా శ్రేయస్సు కోసం ఏఐ రంగంలో భారత్ కృషిచేస్తూతన అనుభవాలునైపుణ్యాలను ప్రపంచంతో పంచుకుంటోందని ప్రధానమంత్రి వివరించారు.

ఈ రోజు అనేక ఫెలోషిప్‌లను ప్రారంభించిన ఐటీవీ నెట్‌వర్క్‌ను ప్రశంసిస్తూభారత యువత అభివృద్ధి చెందిన భారతదేశంలో అతిపెద్ద లబ్ధిదారులువాటాదారులుగా ఉంటారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం పిల్లలకు పాఠ్యపుస్తకాలకు మించి ఆలోచించే అవకాశాన్ని కల్పించిందని ఆయన పేర్కొన్నారుమిడిల్ స్కూల్ నుంచే పిల్లలు కోడింగ్ నేర్చుకుంటున్నారనీఏఐడేటా సైన్స్ వంటి రంగాలకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారుఅభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో పిల్లలకు ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల గురించి మాట్లాడుతూఈ సంవత్సరం బడ్జెట్‌లో 50 వేల కొత్త అటల్ టింకరింగ్ ల్యాబుల ఏర్పాటును ప్రకటించామని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

వార్తా ప్రపంచంలోవివిధ ఏజెన్సీల సబ్‌స్క్రిప్షన్లు మెరుగైన వార్తల కవరేజీకి సహాయపడతాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఅదేవిధంగాపరిశోధన రంగంలోని విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ సమాచార వనరులను వినియోగించుకోవాలని సూచించారుగతంలోవారు అధిక ధరలు చెల్లించి వేర్వేరు జర్నల్స్‌ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి వచ్చేదనీఅయితే తమ ప్రభుత్వం "ఒక దేశంఒకే చందాకార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పరిశోధకులకు ఈ సమస్య నుంచి ముక్తి కలిగించిందన్నారు. దేశంలోని ప్రతి పరిశోధకుడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత జర్నల్స్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారుఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 6వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుందని ఆయన పేర్కొన్నారుఅంతరిక్ష అన్వేషణబయోటెక్ పరిశోధన లేదా ఏఐ రంగం అయినాప్రతి విద్యార్థికీ ఉత్తమ పరిశోధన సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపిన ప్రధానమంత్రిభారత చిన్నారులు భవిష్యత్ నాయకులుగా ఎదుగుతున్నారని వ్యాఖ్యానించారుఐఐటీ విద్యార్థులతో డాక్టర్ బ్రియాన్ గ్రీన్ సమావేశంసెంట్రల్ స్కూల్ విద్యార్థులతో వ్యోమగామి మైక్ మాసిమినో సమావేశం వంటి అద్భుతమైన అనుభవాలను ప్రస్తావిస్తూదేశంలోని చిన్న పాఠశాలల నుంచి భవిష్యత్తులో ప్రభావవంతమైన ఆవిష్కరణలు రావడం ఖాయమని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రతి ప్రపంచ వేదికపై భారత జెండా రెపరెపలాడేలా చేయడమే భారత్ ఆకాంక్ష అని పేర్కొన్న ప్రధానమంత్రి... నామమాత్రపు ఆలోచనలుచర్యలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారుఒక మీడియా సంస్థగాన్యూస్ఎక్స్ వరల్డ్ ఈ భావాన్ని అర్థం చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారుపదేళ్ల క్రితందేశంలోని వివిధ రాష్ట్రాలను చేరుకోవడంపై దృష్టి పెట్టిన మనం నేడు మన నెట్‌వర్క్‌ను ప్రపంచమంతటికీ చేర్చే సాహసోపేతమైన అడుగు వేశామన్నారుఈ ప్రేరణసంకల్పం ప్రతి పౌరుడువ్యవస్థాపకుల్లో ఉండాలని శ్రీ మోదీ పేర్కొన్నారుప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మార్కెట్డ్రాయింగ్ రూమ్డైనింగ్ టేబుల్‌పై భారతీయ బ్రాండ్‌ను చూడాలనే తన దార్శనికతను ఆయన పంచుకున్నారు. "మేడ్ ఇన్ ఇండియాప్రపంచ మంత్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారుప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు "హీల్ ఇన్ ఇండియా"పెళ్లికి ప్లాన్ చేసేటప్పుడు "వెడ్ ఇన్ ఇండియాగురించి ఆలోచించాలనిపర్యటనలుసమావేశాలుప్రదర్శనలుకచేరీల కోసం భారత్‌కు రావడానికి ప్రపంచమంతా ప్రాధాన్యం ఇవ్వాలనే తన కలను ప్రధానమంత్రి వ్యక్తం చేశారుమనలో ఈ సానుకూల దృక్పథాన్నిబలాన్ని పెంపొందించాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ఆయనఈ ప్రయత్నంలో నెట్‌వర్క్ఛానల్‌ల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారుఅవకాశాలు అంతులేనివనిధైర్యందృఢ సంకల్పంతో వాటిని వాస్తవంలోకి మార్చుకోవడం ఇప్పుడు మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

 

"రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోందిఅని శ్రీ మోదీ స్పష్టం చేశారుఐటీవీ నెట్‌వర్క్ కూడా ప్రపంచ వేదికపై తనదైన గుర్తింపు సాధించడానికి ఇదేవిధమైన సంకల్పంతో కృషి చేయాలని సూచించిన ఆయనవారి విజయం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఐటీవీ మీడియా నెట్‌వర్క్ వ్యవస్థాపకులురాజ్యసభ ఎంపీ శ్రీ కార్తికేయ శర్మఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి శ్రీ టోనీ అబాట్శ్రీలంక మాజీ అధ్యక్షులుప్రధానమంత్రి శ్రీ రణిల్ విక్రమసింఘే తదితరులు పాల్గొన్నారు.

 

 

***

MJPS/SR


(Release ID: 2107378) Visitor Counter : 7