ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ విజ్ఞ‌ానశాస్త్ర దినోత్సవం ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 FEB 2025 10:00AM by PIB Hyderabad

ఈ రోజు జాతీయ విజ్ఞ‌ానశాస్త్ర దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ అభినందనలు తెలిపారు. ఆయన ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో:

‘‘
జాతీయ విజ్ఞ‌ానశాస్త్ర దినోత్సవం సందర్భంగా విజ్ఞ‌ానశాస్త్రం విషయంలో మక్కువను కలిగి ఉన్న వారందరికీ, ముఖ్యంగా మన యువ ఆవిష్కర్తలకు ఇవే అభినందనలు. రండి, సైన్సుకూ, నవకల్పనలకూ మరింత మంది ఆదరణ లభించేటట్లుగాను, సైన్సును ‘వికసిత్ భారత్‌’ను సాధించడానికి వినియోగించుకొనేందుకుగాను మనం కృషిచేద్దాం.

‘
మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమ పరంపరలో భాగంగా ఈ నెల నిర్వహించిన ఎపిసోడ్‌లో ‘వన్ డే యాజ్ ఎ సైంటిస్ట్’ను గురించి నేను ప్రస్తావించాను.. యువతీయువకులు వీలు చేసుకొని, ఒక రోజున విజ్ఞ‌ానశాస్త్రానికి సంబంధించిన ఏదైనా ఒక కార్యకలాపాన్ని చేపట్టాలన్నది దీని ఉద్దేశం’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2106881) సందర్శకుల సూచీ సంఖ్య : : 66