రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

కొత్త రీతిలో నిర్వహించిన ‘చేంజ్ ఆఫ్ గార్డ్’ వేడుకను వీక్షించిన రాష్ట్రపతి


ప్రజలకోసం ఫిబ్రవరి 22 నుంచి

Posted On: 16 FEB 2025 12:04PM by PIB Hyderabad

‘చేంజ్ ఆఫ్ గార్డ్’‌కు కొత్త రూపాన్నిచ్చి ఈ రోజు ఉదయం అంటే 2025 ఫిబ్రవరి 16న రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దీనిని వీక్షించారు.

ఈ కార్యక్రమాన్ని వచ్చే శనివారం నుంచి.. అంటే ఈ నెల 22 నుంచి చూడడానికి ప్రజలను అనుమతిస్తారు. రాష్ట్రపతి భవన్ నేపథ్యంలో సాగే హుషారయిన దృశ్య, సంగీత ప్రదర్శన ఈ వేడుకలో భాగంగా ఉంటుంది.  రాష్ట్రపతి బాడీగార్డ్ విభాగానికి చెందిన రక్షకభటులు, గుర్రాలను అధిరోహించిన సైనికుల కవాతుతోపాటు వివిధ అభ్యాసాల్లో పాల్గొంటారు. సెరెమోనియల్ గార్డ్ బెటాలియన్‌కు చెందిన ట్రూపులు సెరెమోనియల్ మిలటరీ బ్రాస్ బ్యాండుతో కలిసి ఒక విశాలమైన చోటులో ప్రదర్శించే అభ్యాసాలు ఈ కొత్త రూపంలోని చేంజ్ ఆఫ్ గార్డ్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ వేడుకను చూడాలనుకొనే వారు సీట్లను రిజర్వు చేసుకోవడానికి ఈ కింది యూఆర్ఎల్‌ను సందర్శించగలరు..
https://visit.rashtrapatibhavan.gov.in/


(Release ID: 2103901) Visitor Counter : 28