సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ ఎక్స్ ప్లోరర్ ఛాలెంజ్
Posted On:
14 FEB 2025 3:37PM by PIB Hyderabad
ఆసక్తికర భారత గాధలను ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమం
పరిచయం
దేశాన్ని గురించి తమ దృష్టికోణాన్ని ‘యూట్యూబ్ షార్ట్స్’ వీడియోల ద్వారా తెలియజేసే అపురూపమైన అవకాశాన్ని ‘వేవ్స్ ఎక్స్ ప్లోరర్ ఛాలెంజ్’ సృజనకారులకు, కథకులకు కల్పిస్తోంది. సమాచార ప్రసారశాఖ సహకారం అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ నిర్వహిస్తోంది. కార్యక్రమంలో పాల్గొనేవారు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని గురించి, దేశంలోని ప్రముఖ ప్రాంతాలు, అందమైన ప్రదేశాలు, మరుగున ఉండిపోయిన అద్భుత ప్రాంతాలు గురించి తెలియజేయవలసిందిగా పోటీ ఆహ్వానిస్తోంది. “ఫర్ ది రికార్డ్, దిస్ ఈజ్ మై ఇండియా” (ఇది నా దేశం) అనే ఇతివృత్తంతో ఏర్పాటైన ఈ పోటీ, భారతదేశ వైవిధ్యాన్ని, ఆదర్శాన్ని, సృజనాత్మకతనూ ప్రతిబింబించే అంశాలతో కూడుకున్నదై ఉండాలని పోటీ తెలియజేస్తోంది.
ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సదస్సు- ‘వేవ్స్’ లో భాగమైన ప్రతిష్ఠాత్మక క్రియేట్ ఇన్ ఇండియా పోటీల కింద వేవ్స్ ఎక్స్ ప్లోరర్ ఛాలెంజ్ ను నిర్వహిస్తున్నారు. ఈ పోటీ మే 1 నుంచీ 4 వరకూ ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్ లో ఏర్పాటయ్యింది. కార్యక్రమంలో పాల్గొనే పరిశ్రమల నేతలు, సృజనకారులు, ఆవిష్కర్తలూ ఈ రంగంలోని అవకాశాలు, నూతన ధోరణులు, సవాళ్ళు తదితర అంశాల గురించి చర్చిస్తారు. కార్యక్రమం దేశ సృజనాత్మక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

వేవ్స్ కార్యక్రమంలో కీలకమైన క్రియేట్ ఇన్ ఇండియా పోటీలకు 70,000 కు పైగా దరఖాస్తులతో అద్భుతమైన స్పందన వస్తోంది . సృజనాత్మకతను, కొత్త ఆలోచనలనూ ప్రోత్సహించే ఈ పోటీ కథకులూ, రచయితలు తమ సృజనకు పదును పెట్టుకునే స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇప్పటివరకూ 31 పోటీలను ప్రకటించగా, 21 పోటీల్లో పలు ప్రపంచ దేశాలు పాల్గొంటున్నాయి. సమాచార, ప్రసారశాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు, మీడియా, వినోద రంగాల్లో భారత్ కు గల ముఖ్య స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.
నియమ నిబంధనలు

గుర్తింపు/ పురస్కారాలు
v. విజేతలకు 2025 యూట్యూబ్ లో నిర్వహించే కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం.
v. అన్ని ఖర్చులూ భరించి, వేవ్స్-2025 కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం.
v. కార్యక్రమంలో వేవ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లో విజయం సాధించిన ఎంట్రీల ప్రదర్శన.
మీ దరఖాస్తులను ఇక్కడ గల ఫారాన్ని నింపడం ద్వారా నమోదు చేయండి. form here.
References:
- https://wavesindia.org/challenges-2025
- https://eventsites.iamai.in/Waves/explorer/
Click here to download PDF
(Release ID: 2103432)
Visitor Counter : 30