ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) అధిపతి భేటీ
प्रविष्टि तिथि:
13 FEB 2025 11:51PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) అధిపతి, టెస్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ ఎలాన్ మస్క్ ఈ రోజు సమావేశమయ్యారు.
నవకల్పన, అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధ, నిరంతర అభివృద్ధి.. ఈ అంశాల్లో భారత్ సంస్థలు, అమెరికా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి శ్రీ మస్క్, ప్రధానీ చర్చించారు. కొత్తగా తెర మీదకు వస్తున్న టెక్నాలజీలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం, సుపరిపాలన.. రంగాల్లోనూ ద్వైపాక్షిక సహకారాన్ని ఇప్పటికన్నా విస్తృతపర్చుకోవడానికి ఉన్న అవకాశాలపైనా వారు చర్చించారు.
శ్రీ మస్క్ కుటుంబ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2103165)
आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam