మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పరీక్షా పే చర్చ 2025 మొదటి ధారావాహికలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
పరీక్షా పే చర్చ 2025 మొదటి ధారావాహికలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
13 FEB 2025 2:23PM by PIB Hyderabad
ఫిబ్రవరి 10, 2025న ప్రసారమైన పరీక్షా పే చర్చ (పీపీసీ) ఎనిమిదో సంచిక మొదటి ధారావాహికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్థులతో ముచ్చటించారు. ఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై దేశం నలుమూలలకు చెందిన విద్యార్థులతో ప్రధానమంత్రి లోతుగా చర్చించారు. పోషకాహారం-ఆరోగ్యం, ఒత్తిడిని అధిగమించడం, తమతో తామే పోటీపడటం, నాయకత్వం, పుస్తకాలకు అతీతంగా సంపూర్ణ వికాసం, సానుకూతలను తెలుసుకోవడం తదితర అంశాలపై 36 మంది విద్యార్థులు ప్రధానమంత్రి నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నారు. విద్యాపరమైన సవాళ్లను ఆత్మవిశ్వాసంతో, ఎదగాలనే మనస్తత్వంతో ఎదుర్కొనేందుకు విలువైన సూచనలు, ఆచరణాత్మక వ్యూహాలను ఈ పరస్పర చర్చా కార్యక్రమంలో విద్యార్థులు తెలుసుకున్నారు.
ఈ రోజు ప్రసారమైన మూడో ధారావాహికలో టెక్నికల్ గురూజీగా పేరు పొందిన గౌరవ్ చౌధరి, ఎడెల్ వైజ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో రాధికా గుప్త - కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్‌ను విద్యార్థులకు పరిచయం చేశారు. చాట్ జీపీటీ, ఏఐ ఇమేజ్-జనరేషన్ టూల్స్‌కి సంబంధించిన అప్లికేషన్లను ప్రయోగాత్మకంగా వివరించారు. సాంకేతికతను చదువు నుంచి దృష్టి మరల్చే సాధనంగా కాకుండా వారి సామర్ధ్యాన్ని పెంపొందించేదిగా సమర్థంగా ఎలా వినియోగించుకోవాలో విద్యార్థులకు తెలియజెప్పారు. సాంకేతికతను, విద్యను ఏకీకృతం చేస్తున్న స్మార్ట్ స్టడీ యాప్లు, డిజిటల్ నోట్స్, ఆన్లైన్ లెర్నింగ్ వేదికలు విద్యార్థులకు ఎలా సాయం చేస్తున్నాయో వివరించారు. ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా దాన్ని సాధనంగా ఉపయోగించుకోవాలని, టెక్నాలజీకి అతీతంగా వాస్తవిక అనుభవాలను స్వీకరించాలని సూచించారు.
ఏఐ, డేటా సైన్స్, కోడింగ్లకు పెరుగుతున్న ప్రాధాన్యతను రాధికా గుప్త వివరించారు. పెరుగుతున్న సాంకేతికత విస్తృతిని వివరిస్తూ విద్యార్థులు దాన్ని అర్థం చేసుకొని సరిగ్గా వినియోగించుకోవాలని సూచించారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేర్చుకొనే విధానాన్ని మరింత ఆకట్టుకొనేలా చేయడానికి తరగతి గదిలో ఏఐను ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని కూడా ఆమె ప్రముఖంగా వివరించారు. దాని నియంత్రణలోకి వెళ్లకుండా, తమకు ఉపయోగపడేలా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
దోహా, ఖతార్, కువైట్ దేశాలకు చెందిన విద్యార్థులు సైతం ఏఐ అప్లికేషన్లు, వాటి ప్రభావం గురించి ప్రశ్నలు అడిగారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చిట్కాలను ఏఐ ఆధారిత డంబ్ షరాడ్స్ ఆట ద్వారా అతిథులు... విద్యార్థులకు వివరించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటాన్ని కృత్రిమ మేధ సాయంతో రూపొందించారు.
పరీక్షా పే చర్చ లాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి, తమ వృద్ధికి సాంకేతితను ఉపయోగించుకొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకొనేందుకు విలువైన సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం గురించి కూడా వారు చర్చించారు.
‘మీ నిర్ణయాలు మీరే తీసుకోండి’, ‘సరిపడినంత నిద్ర’ వంటి పాఠాలతో సహా ఈ కార్యక్రమం నుంచి తాము నేర్చుకున్న విషయాలను విద్యార్థులు ధారావాహిక చివరిలో పంచుకున్నారు.
పీపీసీ ఎనిమిదో సంచిక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ ఏడాది 5 కోట్ల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం జన చైతన్యం కలిగించేదిగా తన హోదాను మరింత పెంచుకుంది. ప్రధానమంత్రితో రూపొందించిన మొదటి ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిని రాష్ట్ర/యూటీ బోర్డుల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయ, సైనిక్ పాఠశాల, ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల, సీబీఎస్ఈ, నవోదయ విద్యాలయల నుంచి ఎంపిక చేశారు. పరీక్షా పే చర్చ 2025లో మురో అయిదు ధారావాహికలు ప్రసారమవుతాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జీవితం, అభ్యాసన గురించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ప్రతి ఎపిసోడ్ ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తుంది.
ఫిబ్రవరి 12, 2025న ప్రసారమైన పరీక్షా పే చర్చ ఎనిమిదవ సంచిక రెండో ధారావాహికలో ప్రముఖ నటి దీపికి పదుకోణ్ 60 మంది విద్యార్థులతో సంభాషించారు. తన సొంత అనుభవాల ద్వారా తెలుసుకున్న మానసిక ఆరోగ్య సమస్యలను అధిగమించడం ద్వారా సాధికారత ఎలా పొందవచ్చనే విలువైన పాఠాలను తెలియజేశారు.
మొదటి ఎపిసోడ్ లింక్: https://www.youtube.com/watch?v=G5UhdwmEEls
రెండో ఎపిసోడ్ లింక్: https://www.youtube.com/watch?v=DrW4c_ttmew
మూడో ఎపిసోడ్ లింక్: https://www.youtube.com/watch?v=wgMzmDYShXw
***
(Release ID: 2102778)
Visitor Counter : 34
Read this release in:
Odia
,
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam