సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ యువ చిత్ర దర్శకుల పోటీ
Posted On:
12 FEB 2025 5:33PM by PIB Hyderabad
భవిష్యత్ తరంలో సృజనాత్మకతను రగిలించేలా పోటీలు
పరిచయం
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న వేవ్స్ యువ చిత్ర దర్శకుల పోటీ (వేవ్స్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్) 12 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న వర్ధమాన కథకులకు సినీనిర్మాణ ప్రపంచంలో అడుగు పెట్టడానికి ఉత్తేజకరమైన వేదికను అందిస్తోంది. సృజనాత్మకతను జ్వలింపజేసేలా, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించేలా, కథన నైపుణ్యాలను మెరుగుపరిచేలా రూపొందించిన ఈ పోటీ ద్వారా యువ సృజనకారులను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. 60 సెకన్ల నిడివితో వారు చిత్రాన్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ప్రపంచ దృశ్య శ్రవ్య వినోద సదస్సు (వేవ్స్)లో ముఖ్య భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీ.. లఘుచిత్రాల ద్వారా తమ భావుకతను ప్రదర్శించేలా, తమ దృక్పథాలను పంచుకునేలా పిల్లలు, యువతను ప్రోత్సహిస్తోంది.
ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్ లో ఈ ఏడాది మే 1 నుంచి 4 వరకు నిర్వహించనున్న వేవ్స్.. మీడియా, వినోద పరిశ్రమల్లో చర్చలు, సమన్వయం, ఆవిష్కరణల కోసం ప్రధాన వేదికగా నిలవనుంది. ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రముఖులు, భాగస్వాములు, ఆవిష్కర్తలందరినీ ఒక్కచోటికి చేర్చి కొత్త అవకాశాలను అన్వేషించడానికి, సవాళ్లను పరిష్కరించడానికి, భారత మీడియా- వినోద రంగంలో వృద్ధిని ప్రోత్సహించడానికి అవకాశాన్నిస్తోంది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజెస్’ వేవ్స్ కు కేంద్ర బిందువుగా నిలిచింది. 31 పోటీలు, 70,000కు పైగా పోటీదారులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ప్రపంచం నలుమూలల నుంచి సృజనకారుల దృష్టిని ఆకట్టుకుంది. ఆవిష్కరణ వ్యవస్థలో వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా మీడియా, వినోద రంగాలకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ను నిలపడం ఈ పోటీల లక్ష్యం.
ముఖ్య లక్ష్యాలు:
-
సృజనాత్మకతను ప్రేరేపించడం: సినిమా ద్వారా సృజనాత్మకతనూ, కల్పనాశక్తినీ వ్యక్తీకరించేలా యువ చిత్ర దర్శకులకు ఆహ్లాదకరమైన, భరోసా కల్పించే వేదికను అందించడం.
-
కథా కథనాలకు ప్రోత్సాహం: యువ ప్రేక్షకులను ఆకట్టుకునే ఆకర్షణీయమైన, భావుకతతో కూడిన కథనాలను రూపొందించేలా యువతను ప్రోత్సహించడం.
విజేతలను నిర్ణయించడానికి ప్రమాణాలు

నమోదుకు మార్గదర్శకాలు

పోటీకి సంబంధించి ముఖ్యమైన తేదీలు
పురస్కారాలు, గుర్తింపు
-
విజేతలకు గుర్తింపు, మార్గదర్శకత్వం, స్కాలర్షిప్ అవకాశాలు, ఆన్లైన్ చిత్ర నిర్మాణ కోర్సుల్లో ప్రవేశం, విజయాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు లభిస్తాయి.
ఆధారాలు:
(Release ID: 2102694)
Visitor Counter : 20