సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025లో భాగంగా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్-1లో విద్యను గేమింగ్‌తో సమన్వయం చేసే కార్యక్రమాలు
మీ నగరం గురించి బాగా తెలుసా? రండి- సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్ గేమ్ లో పాల్గొని భారతీయ నగరాలు, వాటి విజయాలు సవాళ్ల గురించి మీ పరిజ్ఞానం ప్రదర్శించి వేవ్స్ 2025 లో గుర్తింపు పొందండి
‘సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్’ గేమ్‌లో నగరాల ప్రత్యేక కార్డులతో పోటీ పడుతూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంపొందించుకోండి. మీ ప్రాంతంపై గర్వాన్ని వ్యక్తం చేయండి. ఈ గేమ్‌లో, 56 భారతీయ నగరాల సామర్ధ్యాలు, సుస్థిరత పనితీరును ప్రపంచ స్థాయిలో అన్వేషించండి.
ఇన్నోవేటివ్ గేమింగ్ తో సుస్థిర అభివృద్ధి: ఐఐటీ బాంబే ఈ-సమ్మిట్ 2025 లో ఎస్డీజీ కార్యాచరణను ఆవిష్కరించి యువతను ఆకట్టుకున్న ‘సిటీ క్వెస్ట్-షేడ్స్ ఆఫ్ భారత్’
Posted On:
10 FEB 2025 3:17PM by PIB Hyderabad
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ( ఎస్డీజీ) పై మీ నగర పురోగతిపై మీకు లోతైన అవగాహన ఉంటే, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం సిద్దంగా ఉంది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)- 2025 నగర సుస్థిరత ప్రయత్నాలు, సవాళ్లు, విజయాలను అర్థం చేసుకున్న వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
‘సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్’ అనేది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ( ఎస్డీజీ) దృక్కోణంలో పట్టణ అభివృద్ధి ప్రమాణాలను గేమ్ రూపంలో అందించే వినూత్న విద్యా గేమ్. ఇది వేవ్స్ 2025లో భాగంగా జరుగుతున్న క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఈ గేమ్ ను 56 భారతీయ నగరాల సామర్ధ్యాలు, సవాళ్లను అన్వేషిస్తూ, చిన్ననాటి ట్రంప్ కార్డ్ గేమ్ ఆనందాన్ని పునరుద్ధరించడానికి రూపొందించారు.
స్థిరమైన భవిష్యత్తు వైపు గణనీయమైన అడుగులు వేస్తున్న నగరాల ఘనతను ప్రదర్శించడానికి ఈ వేదిక అవకాశాన్ని అందిస్తుంది. సుస్థిర నగర ఛాంపియన్ గా నిలబడండి. మీ నగరం ఎస్ డిజి ప్రయాణం గురించి మీ విజ్ఞానాన్ని ప్రదర్శించే అవకాశాన్ని పొందండి, విజేతలను మే 1 నుండి 4, 2025 వరకు ముంబైలోని వేవ్స్ 2025 లో సన్మానించనున్నారు.
గేమ్ గురించి
‘సిటీ క్వెస్ట్’ గేమ్‌లో ఆటగాళ్లు సింగిల్-ప్లేయర్ ఫార్మాట్‌లో కంప్యూటర్ ప్రత్యర్థితో పోటీ పడతారు, ఇందులో నగరాల కార్డుల డెక్ ను ఉపయోగిస్తారు. ప్రతి కార్డు ఆరు ప్రామాణికాలను కలిగి ఉంటుంది, ఇవి ఆకలి సూచిక, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, లింగ సమానత్వం వంటి వివిధ గణాంకాల ఆధారంగా నగరాల అభివృద్ధిని పోల్చడానికి సహాయపడతాయి. ఈ గేమ్ నీతి ఆయోగ్ అర్బన్ ఇండెక్స్ (2021) ను ఉపయోగించి 56 నగరాల్లో 15 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది ఇంకా టాప్ 6 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఉపయోగిస్తుంది.
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NbxyVesSeoM_04ibvqCM4GyIo1nZV8RU_vfmzd2pXIrLOEk3-9sarw5vdNttKHI_EtSm-8aE67fkroKizqGfF0KK1ftpOYtCVvCDxz90I63YuHTPdSXRUrVC-zXUU8=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ALF4.jpg)
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NYTK9kdiKMrI5LzROda1SwNFBOP20Mga5X4HYZfWNOpwSnVsMRnxGXggKUjS9ZbPRlt_bS5DVGg23yUS1xgPcbaGQAKXO9DYB_MdoFz0HUwsRWW-RvaZwiYfTcdGrQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EJ8R.jpg)
ఇంటరాక్టివ్ గేమ్ ప్లే ద్వారా, ఇది 56 భారతీయ నగరాల అభివృద్ధి సవాళ్లు, విజయాలపై సుస్థిర అభ్యాసాల ప్రభావాన్ని గుర్తించేలా ఆటగాళ్లకు అవగాహన కల్పిస్తుంది.
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NYa6Ef4mC1SZpQdjjVvB-8-nrnsGHhpO7IERlfnSOJPIzY3Yh0JnKvhSGs1HDTq_kkUoHOSFzwZJ8B6B3egdZgeyLAVfWtn44ltzMaVLvJ0a4csyfNZy8y23Pyg-y4=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003P5SN.jpg)
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NZWtrjxuOXlgpcHKd2oxLQWdNxfNhbOIFH1VDv32Lhi--WUqhrBvzwddDFIaaNHtoljD4NbZY4yr0sbAlD1QmEvd-VS_5aOyTzOFHBpbR5KEcgUiSlkTfuX1hwu-o8=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004BRGD.jpg)
‘సిటీ క్వెస్ట్’ గేమ్‌లో ప్రతి నగరానికి సంబంధించిన సమాచారాన్ని అన్వేషించేటప్పుడు, ఆటగాళ్లు వ్యక్తిగత, సమూహ చర్యలు భారతదేశ సుస్థిరత పనితీరు గ్లోబల్ స్థాయిలో ఎంత ప్రభావితం చేస్తుందనే దానిపై అవగాహన పొందుతారు.
‘సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్’ గేమ్‌లో అన్ని వయస్సుల వ్యక్తులు పాల్గొనవచ్చు. ఈ గేమ్ చిన్ననాటి కార్డ్ గేమ్‌ల సంతోషాన్ని గుర్తుకుతెస్తూ, , భారతదేశంలోని 56 నగరాల గురించి కొత్త కోణంలో తెలుసుకునే అవకాశం ఇస్తుంది. గేమ్‌లో పాల్గొనడం ద్వారా, ఆటగాళ్లు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో చేసిన తమ నగరాల ప్రగతిని తెలుసుకోవచ్చు. గేమ్‌లో జాతీయ,నగర-నిర్దిష్ట లీడర్‌బోర్డులు ఉన్నాయి, ఇవి ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తాయి. అంతేకాక, ఆటగాళ్లు తాము ఉండే నగరం నుంచి సైన్ అప్ చేయవచ్చు, ఇది సామాజిక భావనను, తన ప్రాంతం పట్ల గర్వభావాన్ని పెంపొందిస్తుంది.
సిటీ క్వెస్ట్: ఐఐటీ బాంబే ఇ-సమ్మిట్ 2025 లో యువతేజాలు
‘సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్’ అనే విద్యా గేమ్‌ను ఇటీవల ఐఐటీ బాంబేలో జరిగిన ఇ-సమ్మిట్ 2025లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు 30,000 మందికి పైగా విద్యార్థులతో నిండి, అపూర్వ ఉత్సాహం, ఉత్సుకత, అంతులేని ఆనందాన్ని నింపింది.
ఐఐటి బాంబేలో జరిగిన ఇ-సమ్మిట్ 2025 లో, సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి ‘సిటీ క్వెస్ట్’ను అభివృద్ధి చేస్తున్న ఇ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్) గేమింగ్, స్టార్టప్‌లు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ముఖ్యమైన చర్చలను నిర్వహించింది. ఈ చర్చలు ఆధునిక పారిశ్రామిక వేత్తల్లో గేమింగ్ పరిశ్రమ వినూత్న సాంకేతికతల పాత్రను స్పష్టంగా చూపించాయి.
నందన్ నీలేకని, అనుపమ్ మిట్టల్, సోనమ్ వాంగ్ చుక్ లు ఈ సమ్మిట్ లో కీలక పాత్ర పోషించారు. సిటీ క్వెస్ట్ ఐఐటిబి విద్యార్థులు సందర్శకుల దృష్టిని ఎంతో ఆకర్షించింది. రాబోయే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025, అలాగే క్రియేట్ ఇన్ ఇండియా సీజన్ 1 ఛాలెంజెస్ పై ఆసక్తి రేకెత్తించింది.
ఐఐటీ బాంబేలో ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ ద్వారా ఎస్డీజీ కి ప్రాధాన్యం
సిటీ క్వెస్ట్ భారతీయ నగరాల గురించి ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ ద్వారా విద్యార్థులకు అందులో లీన మయ్యే విధంగా అనుభవాన్ని అందించింది. ఎస్డీజీ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం పనితీరును గణనీయంగా పెంచడంలో రోజువారీ చర్యల ద్వారా భారతీయ పౌరుల చురుకైన భాగస్వామ్యం అవసరాన్ని ప్రముఖంగా తెలిపింది.
సిటీ క్వెస్ట్ ట్రంప్ కార్డుల ద్వారా ఒకరితో ఒకరు పోటీ పడుతూ తమ స్వస్థలాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా విద్యార్థుల మధ్య ఉత్తేజకరమైన పోటీలు నిర్వహించారు. ప్రతి గంటకు ఎంపికైన విజేతకు సిటీ క్వెస్ట్ డెక్స్ ప్రత్యేక ఎడిషన్ ను బహుమతిగా అందజేశారు.
సిటీ క్వెస్ట్ ముఖ్యాంశాలు: షేడ్స్ ఆఫ్ భారత్:
*సృజనాత్మక గేమ్ ప్లే: ఆటగాళ్లు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో నగరాల పాత్రను అంచనా వేసేందుకు వ్యూహాత్మక ఆలోచనను ఉపయోగించి స్నేహపూర్వక పోటీలలో పాల్గొంటారు. ఈ విధానం సమాజ భావనను, పౌర గర్వాన్ని పెంపొందిస్తుంది.
*అంతరాలను పూడ్చడం: గేమిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం లో అంతరాన్ని సమర్థవంతంగా ఎలా పూడ్చగలదో సిటీ క్వెస్ట్ ఉదాహరణగా నిలుస్తుంది, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారతదేశ యువతను విద్యావంతులను చేయడానికి, ప్రేరేపించడానికి ఒక ప్రోత్సాహకర పద్ధతిని అందిస్తుంది.
వేవ్స్ 2025
రాబోయే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) తేదీలు, వేదికను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. సృజనాత్మక రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ హోదాలో నిలబెట్టడానికి ఉద్దేశించిన ఈ మైలురాయి కార్యక్రమం 2025 మే 1 నుండి 2025 మే 4 వరకు ముంబైలో జరుగుతుంది.
ప్రపంచంలో సృజనాత్మక శక్తికి కేంద్రంగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షను ప్రతిబింబిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీతో వేవ్స్ సలహా మండలి ఫలప్రదమైన సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. మునుపెన్నడూ లేని విధంగా వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ఏకం చేసే ప్రపంచంలోని అగ్రగామి మీడియా సీఈఓలు, అతిపెద్ద వినోద రంగ సంస్థల ప్రముఖులు, సృజనాత్మక మేధావులను ఈ సదస్సు ఏకతాటి పైకి తెస్తుంది.
ఈ గేమ్ ప్రస్తుతం గూగుల్ ప్లే ద్వారా ఆండ్రాయిడ్ పరికరాలపై ఉచితంగా అందుబాటులో ఉంది. దీని ద్వారా, భారతీయ పౌరులు తమ రోజువారీ చర్యల ద్వారా ఎస్డీజీ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారతదేశ పనితీరును మెరుగుపరచడంలో క్రియాశీలకంగా పాల్గొన వలసిన అవసరాన్ని ప్రముఖంగా తెలియచేస్తుంది.
![](https://ci3.googleusercontent.com/meips/ADKq_NYPw7CgQzmYqpn8joZXYYqUK55Vg_ELW0Zm7NB-OBY906RtMWVAACs7PzwIO_NjmM0bkBUdQIxYaEzDwI2icCujgeMrFsWVdNDquiIslIpPD6Z7BCMKew=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/5FJL1.jpg)
*****
(Release ID: 2101493)
Visitor Counter : 16
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam