సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ వీఎఫ్ఎక్స్ పోటీలు
వీఎఫ్ఎక్స్ షోడౌన్లో పాల్గొనండి, సృష్టించండి, విజయం సాధించండి
Posted On:
06 FEB 2025 7:47PM by PIB Hyderabad
వీఎఫ్ఎక్స్ షోడౌన్లో పోటీపడండి, సృష్టించండి, విజయం సాధించండి
పరిచయం
మీడియా, వినోద (ఎం అండ్ ఈ) పరిశ్రమలో చర్చలు, సహకారాలు, ఆవిష్కరణలను పెంపొందించే అపూర్వమైన వేదికగా
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) పనిచేస్తుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వేవ్స్ కార్యక్రమం భారత్‌లో వాణిజ్య అవకాశాలను పెంపొందించడానికి పరిశ్రమలో దిగ్గజాలను, నిపుణులను, ప్రపంచ ప్రతినిధులను ఒక్క చోట చేరుస్తుంది.
వేవ్స్‌లో ప్రధాన ఆకర్షణ క్రియేట్ ఇన్ ఇండియా పోటీలు. ప్రతిభను, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభించిన 31 రకాల పోటీలకు 70,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 25 అంశాల్లో పోటీ పడేందుకు ఇంకా అవకాశం ఉంది. అందునా 22 అంతర్జాతీయంగా ఎంట్రీలను ఆకర్షిస్తున్నాయి.
వేవ్స్ వీఎఫ్ఎక్స్ ఛాలెంజ్ (డబ్ల్యూఏఎఫ్ఎక్స్ పోటీలు)
భారత్‌లో వీఎఫ్ఎక్స్‌లో అత్యుత్తమ ప్రతిభను వెలికితీయడానికి దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమమే వేవ్స్ వీఎఫ్ఎక్స్ ఛాలెంజ్ (డబ్ల్యూఎఫ్ఎక్స్). సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఏబీఏఐ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, క్రియేట్ ఇన్ ఇండియా సీజన్ 1 ద్వారా భారతీయ సృజనాత్మక రంగంలో కీలకమైన మైలురాయిని సూచిస్తుంది.
పోటీ వివరాలు

Competition Overview

అంశం: డైలీ లైఫ్ సూపర్ హీరో
‘డైలీ లైఫ్ సూపర్ హీరోస్’ అనే అంశంపై ఈ పోటీ జరుగుతుంది. హాస్యం, సృజనాత్మకత మేళవింపుగా సూపర్ హీరోలు చేసే రోజువారీ పనులను ప్రదర్శించేలా విజువల్ ఎఫెక్ట్స్ సీక్వెన్స్, లఘుచిత్రాలను పోటీదారులు రూపొందించాల్సి ఉంటుంది. ఇంటి పనులు, దైనందిన ప్రయాణాలు, రోజువారీ సమస్యలను హాస్యభరితంగా పరిష్కరించడంలో సహాయపడే సూపర్ హీరోల గురించి ఆలోచించి వీటిని రూపొందించాల్సి ఉంటుంది.
విభాగాలు
విద్యార్థి విభాగం: పాఠశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు దీంట్లో పాల్గొనవచ్చు (విద్యార్థి గుర్తింపు కార్డు తప్పనిసరి)
నిపుణుల విభాగం: వీఎఫ్ఎక్స్, యానిమేషన్, చిత్ర నిర్మాణ నిపుణులు (ఫ్రీలాన్సర్లు, స్టూడియో ఆర్టిస్టులతో సహా) ఈ విభాగంలో పాల్గొనవచ్చు.
పోటీ విధానం
1. క్వాలిఫయర్ రౌండ్
రిజిస్ట్రేషన్:
పోటీ దారులు తమ జోన్ ఎంచుకొని, ‘డైలీ లైఫ్ సూపర్‌హీరో’ అంశంపై రూపొందించిన 30 సెకన్ల వీఎఫ్ఎక్స్ వీడియోను సమర్పించాలి.
ఎంపిక: జోనల్ వారీగా నిర్వహించే పోటీల్లో 10 మంది విద్యార్థులు, 10 మంది నిపుణులను న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారు.
2. జోనల్ స్థాయి పోటీలు
జోనల్ పోటీలు జరిగే ప్రదేశాలు: చండీగఢ్ (నార్త్ జోన్), ముంబయి (వెస్ట్ జోన్), కోల్‌కతా (ఈస్ట్ జోన్), బెంగళూరు (సౌత్ జోన్) .
ఎంపిక చేసిన నగరాల్లో ప్రత్యక్ష పోటీలు (10 గంటల పాటు సాగే పోటీలు)
పోటీదారులు వారికి అందించిన స్టాక్ వీడియోలు, త్రీడీ పరికరాలు, ఎఫ్ఎక్స్ లైబ్రరీల నుంచి వీఎఫ్ఎక్స్ రీల్ తయారుచేయాల్సి ఉంటుంది.
ప్రతి విభాగంలోనూ విజేతలుగా నిలిచినవారు వేవ్స్ 2025లో జరిగే తుదిపోటీల్లో పాల్గొంటారు. తుదిపోటీల్లో పాల్గొనేందుకయ్యే మొత్తాన్ని సైతం పొందుతారు.
3. తుదిపోటీలు
జోనల్ స్థాయి విజేతలు వేవ్స్ 2025 లో 24 గంటల ఛాలెంజ్‌లో పాల్గొంటారు.
వీఎఫ్‌ఎక్స్ షాట్లు రూపొందించడానికి గ్రీన్ మ్యాట్ స్క్రీన్లు, త్రీడీ పరికరాలు, ఎఫ్ఎక్స్ లైబ్రరీలను పోటీదారులు ఉపయోగించుకోవచ్చు.
ప్రతి కేటగిరీలోనూ తుదిపోటీ విజేతలకు నగదు బహుమతి, ప్రత్యేక వస్తువులు అందజేస్తారు.
రిజిస్ట్రేషన్
వేవ్స్ 2025లో భారతదేశపు అతి పెద్ద వీఎఫ్ఎక్స్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు.
References:
- https://wavesindia.org/challenges-2025
- https://wafx.abai.avgc.in/
- https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2096792
Click here to see in PDF:
***
(Release ID: 2100561)
Visitor Counter : 27