ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మార్చి 2024 నాటికి వాడకంలో 7.75 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు: ఆర్థిక సర్వే 2024-25


సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద లక్ష కోట్లకు పైగా క్లెయిముల పరిష్కారం: 5.9 కోట్ల మంది రైతులకు ప్రయోజనం

2014-15 నుంచి 2023-24 నాటికి రూ.8.45 లక్షల కోట్ల నుంచి రూ.25.48 లక్షల కోట్లకు పెరిగిన క్షేత్ర స్థాయి రుణాలు

2014-15 నుంచి 2023-24 వరకు క్షేత్ర స్థాయి రుణాల్లో 41 శాతం నుంచి 57 శాతానికి పెరిగిన చిన్న, సన్నకారు రైతుల వాటా

2024 ఆర్థిక సంవత్సరంలో పీఎం ఫసల్ బీమా యోజన కింద నమోదైన రైతుల సంఖ్యలో 26 శాతం పెరుగుదల

పీఎం కిసాన్ కింద 11 కోట్లకు పైగా రైతులకు లబ్ధి; ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన (అక్టోబర్, 2024 నాటికి) కింద 23.61 లక్షల మంది రైతుల నమోదు

వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్లను పొందేందుకు 15000 మహిళా స్వయం సహాయక సంఘాల ఎంపికః

వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు: 48611 స్టోరేజ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మంజూరు; సబ్సిడీల రూపంలో రూ.4,795.47 కోట్లు

దేశ జనాభాలో మూడింట రెండొంతుల మందికి జాతీయ ఆహార భద్రత చట్టం వర్తింపు

స్మార్ట్ గోదాములను ప్రారంభించిన ప్రభుత్వం

Posted On: 31 JAN 2025 1:44PM by PIB Hyderabad

వ్యవసాయ ఉత్పాదకతఆదాయాన్ని మెరుగుపరచడానికి రైతులందరికీముఖ్యంగా చిన్నసన్నకారు రైతులకుసమాజంలోని బలహీన వర్గాలకు తగినంత రుణ మద్దతును అందించడం చాలా అవసరమని కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. 2024-25 ఆర్థిక సర్వేను ఆమె ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

మార్చి 2024 నాటికి దేశంలో 7.75 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసిఖాతాలు ఉన్నాయనివాటిమీద రూ .9.81 లక్షల కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2024 మార్చి 31 నాటికి మత్స్యపశుసంవర్ధక రంగాలకు వరుసగా 1.24 లక్షలు, 44.40 లక్షల కేసీసీలు జారీ అయ్యాయి.

సవరించిన వడ్డీ రాయితీ పథకం

2025 ఆర్థిక సంవత్సరం నుండిసవరించిన వడ్డీ రాయితీ పథకం (మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ -మిస్కింద క్లెయిము లను మరింత సమర్ధవంతంగా పరిష్కరించేందుకు మొత్తం ప్రక్రియను కిసాన్ రిన్ పోర్టల్ (కేఆర్పీద్వారా డిజిటలైజ్ చేశారు. 31 డిసెంబర్ 2024 నాటికి లక్ష కోట్లకు పైగా క్లెయిములను పరిష్కరించారుప్రస్తుతం మిస్-కేసీసీ పథకం కింద లబ్ధి పొందుతున్న 5.9 కోట్ల మంది రైతులను కేఆర్పీ ద్వారా గుర్తించారుచిన్నసన్నకారు రైతులకు మరింత మద్దతు ఇవ్వడానికిబ్యాంకులు తమ సర్దుబాటయిన నెట్ బ్యాంక్ క్రెడిట్ (ఎఎన్బిసి)లేదా రుణంతో సమానమైన అన్-బ్యాలెన్స్ షీట్ ఎక్స్‌పోజర్ (సిఇఒబి) 40 శాతంఎది ఎక్కువైతే దానిని ప్రాధాన్య రంగాలకువ్యవసాయాన్ని కూడా కలిపి కేటాయించాల్సి ఉంటుందిపై చర్యలన్నీ 1950 లో 90 శాతం నుండి 2022 ఆర్థిక సంవత్సరంలో 25.0 శాతానికి రుణాల కోసం సంస్థాగతేతర (నాన్-ఇనిస్టిట్యూష నల్వనరులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాయి.

క్షేత్రస్థాయి రుణాలు

2014-15 నుంచి 2024-25 వరకు వ్యవసాయ రంగానికి క్షేత్రస్థాయి పరపతి గ్రౌండ్ లెవల్ క్రెడిట్ -జీఎల్సీ) 12.98 శాతం సీఏజీఆర్ తో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. 2014-15లో రూ.8.45 లక్షల కోట్లుగా ఉన్న జీఎల్సీ 2023-24 నాటికి రూ.25.48 లక్షల కోట్లకు పెరిగిందిఇందులో చిన్నసన్నకారు రైతుల వాటా 2014-15 నుంచి 2023-24 వరకు రూ.3.46 లక్షల కోట్ల (41 శాతంనుంచి రూ.14.39 లక్షల కోట్లకు (57 శాతంగణనీయంగా పెరిగింది.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన


 

రాష్ట్ర ప్రభుత్వాలుభీమా సంస్థల భాగస్వామ్యం 2020-21 లో 20, 11 నుండి 2025 ఆర్థిక సంవత్సరంలో వరుసగా 24, 15 కు పెరిగిందిఇంకా భాగస్వామ్యాలు మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ప్రీమియం రేట్లలో 32 శాతం తగ్గింపునకు దోహదం చేశాయిఫలితంగా, 2024 ఆర్థిక సంవత్సరంలోనమోదు చేసుకున్న రైతుల సంఖ్య నాలుగు కోట్లకు చేరుకుందిఇది 2023 ఆర్థిక సంవత్సరంలో 3.17 కోట్ల నుండి 26 శాతం పెరిగిందిబీమా విస్తీర్ణం కూడా 2024 ఆర్థిక సంవత్సరంలో 600 లక్షల హెక్టార్లకు విస్తరించిందిఇది 2023 ఆర్థిక సంవత్సరంలో 500 లక్షల హెక్టార్ల నుండి 19 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

పిఎం కిసాన్ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన

రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతును అందించే పిఎం-కిసాన్రైతులకు పెన్షన్ పథకాలను అందించే ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన (పిఎంకెఎంవైవంటి ప్రభుత్వ కార్యక్రమాలు రైతుల ఆదాయాలను పెంచడానికివారి సామాజిక భద్రతా భరోసాను పెంచడానికి విజయవంతంగా దోహదం చేశాయిపిఎం-కిసాన్ కింద 11 కోట్ల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందారు. 2024 అక్టోబర్ 31 నాటికి 23.61 లక్షల మంది రైతులు పిఎంకెఎంవై కింద నమోదు చేసుకున్నారుఈ ప్రయత్నాలకు తోడుఒఎన్ఓఆర్సి చొరవ కింద ఇ-కెవైసి నిబంధనఎన్డబ్ల్యుఆర్ ఫైనాన్సింగ్ కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాలు వంటి సంస్కరణలు అనాదిగా వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న వ్యవస్థాగత లోపాలను పరిష్కరిస్తాయి.

ఆహార నిర్వహణ ఆహార భద్రత

ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్), లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టార్గెటెడ్ పిడిఎస్ టిపిడిఎస్), జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) 2013, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవైద్వారా ప్రభుత్వం చాలాకాలంగా కుటుంబ ఆహార భద్రతను పరిష్కరించిందని ఆర్థిక సర్వే పేర్కొందిఇది ఆహార భద్రతకు సంబంధించిన విధానంలో మౌలిక మార్పును సూచిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 81.35 కోట్ల మందికి టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద గ్రామీణ జనాభాలో 75 శాతంపట్టణ జనాభాలో 50 శాతం వరకు ఉచితంగా ఆహార ధాన్యాలను పొందడానికి ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం చట్టబద్ధంగా హక్కు కల్పిస్తుందిఅందువల్లజనాభాలో మూడింట రెండు వంతుల మంది అధిక సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందడానికి ఈ చట్టం పరిధిలోకి వస్తారుపిఎంజికెఎవై కింద ఉచిత ఆహార ధాన్యాల కేటాయింపు సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు సాధారణ కేటాయింపులకు అదనం. 2024 జనవరి నుంచి మరో ఐదేళ్ల పాటు పీఎంజీకేఏవై కింద ఉచిత ఆహార ధాన్యాలను అందించడం జాతీయ ఆహారపోషకాహార భద్రతను పరిష్కరించడానికి ప్రభుత్వ దీర్ఘకాలిక నిబద్ధతదార్శనికతలను ప్రతిబింబిస్తుంది.

వ్యవసాయ యాంత్రీకరణ:

వ్యవసాయ యాంత్రీకరణపై సబ్ మిషన్

వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన శిక్షణప్రదర్శనలతోకస్టమ్ హైరింగ్ సెంటర్ల (సీహెచ్ సీఏర్పాటులోనూవివిధ వ్యవసాయ పరికరాలను పొందడంలోనూ రైతులకు సహాయపడటంలో వ్యవసాయ యాంత్రీకరణపై ఉప-మిషన్ (ఎస్ఎంఎఎంరాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇస్తున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొందిడిసెంబర్ 31 నాటికిఈ కార్యక్రమం కింద 26,662 సీహెచ్ సీలు ఏర్పాటయ్యాయిఒక్క 2025 ఆర్థిక సంవత్సరంలోనే 138 సీహెచ్ సీలను ఏర్పాటు చేశారు.

మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లతో ప్రోత్సాహం

మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందించడానికి ప్రభుత్వం ఇటీవల ఒక పథకాన్ని ఆమోదించిందిఎంపిక చేసిన 15 వేల మహిళా స్వయం సహాయక బృందాలు వీటితో ఎరువులు పురుగుమందుల చల్లడం సహా వ్యవసాయ అవసరాల కోసం రైతులకు అద్దె ప్రాతిపదిక సేవలను అందించే లక్ష్యంతో పనిచేయనున్నాయిడ్రోన్ కొనుగోళ్ల కోసం మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ ఖర్చుసంబంధిత అనుబంధ ఛార్జీల్లో 80 శాతంగరిష్టంగా రూ.8 లక్షల వరకు కేంద్ర ఆర్థిక సహాయం మంజూరు చేస్తారుఈ పథకం స్వయం సహాయక సంఘాలకు స్థిరమైన వ్యాపారంజీవనోపాధి మద్దతును కూడా అందిస్తుందితద్వారా వారు అదనంగా ఏడాదికి కనీసం రూ.లక్ష ఆదాయం పొందగలుగుతారు.

వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు

వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల ఉప పథకం

వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల ఉప పథకం కింద 2024 అక్టోబర్ 31 నాటికి 48611 గోదాము మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరయ్యాయనిరూ.4,795.47 కోట్లు సబ్సిడీల రూపంలో పంపిణీ చేశామని ఆర్థిక సర్వే పేర్కొందివీటితో పాటు ఎఎంఐ పథకం కింద ఇతర రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించిన 21,004 ప్రాజెక్టులకు రూ.2,125.76 కోట్ల సబ్సిడీ మంజూరైంది.


 

ఇ-నామ్

ఆర్థిక సర్వే ప్రకారం, ఈ కార్యక్రమం ప్రతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఎపిఎంసిమండికి అవసరమైన హార్డ్‌వేర్ కోసం రూ. 75 లక్షల ఆర్థిక సహాయంఉచిత సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోందిఇందులో నాణ్యత పరీక్ష పరికరాలుఅలాగే శుభ్రపరచడంశ్రేణీకరణ (గ్రేడింగ్), క్రమబద్ధీకరణ (సార్టింగ్), ప్యాకేజింగ్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా అంతర్భాగంగా ఉన్నాయి. 2024 అక్టోబర్ 31 నాటికి 1.78 కోట్ల మంది రైతులు, 2.62 లక్షల మంది వ్యాపారులు ఈ-నామ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారుఅదే తేదీ నాటికి 9,204 ఎఫ్ పి ఒ లు నమోదు కాగావీటిలో 4,490 సంస్థలకు రూ.237 కోట్ల ఈక్విటీ గ్రాంట్లు లభించాయి.

ఆహార ధాన్యాల నిల్వ మౌలిక సదుపాయాలు

ఆహార ధాన్యాల నిల్వ కోసం మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి, అప్ గ్రేడ్ చేయడానికిదేశంలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికిపిపిపి కింద ఉక్కు గోదాములు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక సర్వే తెలియచేసింది.

హబ్స్పోక్ మోడల్ గోదాములు

హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద ప్రభుత్వం నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోందిఇక్కడ "హబ్ప్రత్యేక రైల్వే సైడింగ్కంటైనర్ డిపో సౌకర్యాన్ని కలిగి ఉందిస్పోక్ గోదాముల నుంచి హబ్ గోదాములకు రవాణా రోడ్డు మార్గం ద్వారా జరుగుతుండగాహబ్ నుండి హబ్ కు రవాణా రైలు ద్వారా జరుగుతుంది.

ఫ్లో స్పాన్: మొబైల్ స్టోరేజ్ యూనిట్

ఆహార ధాన్యాల నిల్వను మెరుగుపరచడానికిముఖ్యంగా కొండ ప్రాంతాలుమారుమూల ప్రాంతాలలోవరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యు ఎఫ్ పిసహకారంతో ఒక రకమైన మొబైల్ స్టోరేజ్ యూనిట్ (ఎం ఎస్ యుఫ్లో స్పాన్ వాడకాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోంది. 400 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన ఈ యూనిట్లను త్వరితగతిన ఏర్పాటు చేయవచ్చుపైలట్ ప్రాజెక్టుగా డబ్ల్యూఎఫ్ పి ఆరు రాష్ట్రాల్లోజమ్మూ కాశ్మీర్హిమాచల్ ప్రదేశ్రాజస్థాన్మిజోరాంఉత్తరాఖండ్ఛత్తీస్ ఘడ్ లలో ఫ్లో స్పాన్ ను ఏర్పాటు చేసింది.

ఆధునిక గోదాములు

ప్రభుత్వ గోదాములను ఆధునికంగా మార్చేందుకు ప్రభుత్వం డబ్ల్యూఎఫ్పీఐజీఎంఆర్ఐలతో ఒక పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిందిఆధునికంగా మార్చడం వల్ల గోదాముల్లో ఉష్ణోగ్రతనుతేమనూగాలి ప్రవాహాన్నీఎలుకల కదలికలనూ వాస్తవ సమయంలో సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుందిదీనివల్ల నిల్వ ప్రమాణాలు పెరగడమే కాకుండా నష్టాలను తగ్గించుకోవడం సాధ్యం అవుతుంది.

 

***


(Release ID: 2098059) Visitor Counter : 64