ప్రధాన మంత్రి కార్యాలయం
రెండోసారి అధికారంలోకి అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ వచ్చినందుకు ప్రధానమంత్రి అభినందనలు
పరస్పర లాభదాయక, విశ్వసనీయ భాగస్వామ్యానికి మనం కట్టుబడి ఉన్నాం
మన ప్రజల సంక్షేమానికీ, ప్రపంచ శాంతి, సమృద్ధి, అభ్యున్నతి కోసం కలసి పనిచేద్దాం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
27 JAN 2025 8:42PM by PIB Hyderabad
అమెరికా అధ్యక్షునిగా శ్రీ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికై, చరిత్ర సృష్టించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. మన రెండు దేశాలకూ లాభసాటిగా ఉండే, విశ్వసనీయ భాగస్వామ్యాన్ని బలపరచడం కోసం మనం కట్టుబడి ఉన్నాం. మన ప్రజల సంక్షేమానికి, అలాగే ప్రపంచంలో శాంతినీ, సమృద్ధినీ, భద్రతనూ పటిష్టపరచడానికి మనం కలసి పనిచేద్దామని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘నా ప్రియ మిత్రుడు అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ (@realDonaldTrump @POTUS)తో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. చరిత్రాత్మకమైన విధంగా ఆయన రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను అభినందించాను. రెండు దేశాలకూ లాభసాటిగా ఉండే, విశ్వసనీయ భాగస్వామ్యానికి మేం కట్టుబడి ఉన్నాం. మన రెండు దేశాల ప్రజల సంక్షేమంతోపాటు ప్రపంచంలో శాంతి, సమృద్ధి, భద్రత వర్ధిల్లడానికి మేం కలసి పనిచేస్తాం’’.
(रिलीज़ आईडी: 2097026)
आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada