ప్రధాన మంత్రి కార్యాలయం
అధ్యక్షుడు శ్రీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి పరస్పర లాభదాయక, విశ్వసనీయ భాగస్వామ్యానికి కృషి చేద్దామంటూ నేతల పునరుద్ఘాటన టెక్నాలజీ, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనంలతోపాటు రక్షణ రంగాల్లో సహకారంపై చర్చ
పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్ల స్థితి సహా ప్రపంచ అంశాలపై ఆలోచనలను పంచుకున్న ప్రధాని, అధ్యక్షుడు శ్రీ ట్రంప్
ప్రపంచ శాంతి, సమృద్ధి, భద్రతల దిశగా నిబద్ధతను పునరుద్ఘాటించిన నేతలు
త్వరలో భేటీ కావడానికి నేతలిద్దరి అంగీకారం
Posted On:
27 JAN 2025 10:23PM by PIB Hyderabad
అమెరికా అధ్యక్షుడు శ్రీ ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. శ్రీ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షునిగా ఎన్నికకావడంతోపాటు అమెరికా అధ్యక్షునిగా రెండోసారి గెలిచినందుకు ప్రధాని అభినందనలు తెలిపారు.
తమ రెండు దేశాలకూ పరస్పరం లాభదాయకంగా ఉండే, విశ్వసనీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కట్టుబడి ఉన్నట్లు నేతలిద్దరూ పునరుద్ఘాటించారు. టెక్నాలజీ, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనంలతోపాటు రక్షణ రంగాలు సహా విస్తృత శ్రేణితో కూడిన ద్వైపాక్షిక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి చెందిన వివిధ పార్శ్వాలనూ, వాటిని మందుకు తీసుకుపోయే క్రమాన్నీ చర్చించారు.
పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్లలో స్థితి సహా ప్రపంచ అంశాలపై ఇద్దరు నేతలు ఆలోచనలను పంచుకున్నారు. ప్రపంచ శాంతినీ, సమృద్ధినీ, భద్రతనూ పెంపొందింపచేయడానికి కలసి పనిచేద్దామన్న తమ నిబద్ధతను కూడా వారు పునరుద్ఘాటించారు.
ఇద్దరు నేతలూ సంప్రదింపులు సాగిస్తూ ఉండాలనీ, ఉభయులకూ వీలైన తేదీన అతి త్వరలో భేటీ అవ్వాలనీ అంగీకరించారు.
***
(Release ID: 2097024)