ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని జల్గావ్లో సంభవించిన దుర్ఘటనలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం
Posted On:
22 JAN 2025 11:35PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని జల్గావ్లో రైలు పట్టాలపై సంభవించిన విషాద సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వెలిబుచ్చారు.
ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా కిందివిధంగా సందేశం పోస్ట్చేసింది:
“మహారాష్ట్రలోని జల్గావ్లో రైలు పట్టాలపై సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం నన్నెంతో బాధించింది. ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధితులందరికీ అధికార యంత్రాంగం అన్ని విధాలుగా చేయూతనందిస్తోంది: ప్రధానమంత్రి @narendramodi.”
***
MJPS/SR
(Release ID: 2096012)
Visitor Counter : 46
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam