ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్లు, గిరిజన ప్రతినిధులు, శకటాల కళాకారులతో ప్రధాని సంభాషణ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో గతానికి భిన్నంగా వ్యక్తిగతంగా, స్నేహపూర్వకంగా సంభాషించిన ప్రధాని

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అందరూ ఇతర రాష్ట్రాల వారితో మమేకమవ్వాలని ప్రధాని సూచన
జాతి నిర్మాణ దిశగా యువతను ప్రోత్సహిస్తూ.. వికసిత్ భారత్ సాధనలో ముఖ్యమైన విధులను నిర్వర్తించాల్సిన ప్రాధాన్యాన్ని వివరించిన పీఎం

Posted On: 24 JAN 2025 7:57PM by PIB Hyderabad

త్వరలో జరగబోతున్న గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ఎన్‌సీసీ క్యాడెట్లుఎన్‌ఎస్ఎస్ వాలంటీర్లుగిరిజన ప్రతినిధులుశకటాల కళాకారులతో లోకకల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సంభాషించారుఅనంతరం భారతదేశ సంస్కృతివైవిధ్యాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.

గతానికి భిన్నంగా వినూత్నమైన రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రధాని ముచ్చటించారుఒక్కొక్కరినీ వ్యక్తిగతంగా పలకరించి స్నేహపూర్వకంగా సంభాషించారు.

భిన్నత్వంలోనే ఏకత్వమనే జాతీయ భావన ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ఇతర  రాష్ట్రాల వారితో పరస్పరం సంభాషించడం ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రధాని సూచించారుఇలాంటి చర్చలు దేశప్రగతికి ముఖ్యమైన అవగాహనఐక్యతను ఎలా పెంపొందిస్తాయో వివరించారు.

వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బాధ్యత గల పౌరులుగా తమ విధులను నిర్వర్తించడం అత్యంత కీలకమైన అంశమని ప్రధానమంత్రి స్పష్టం చేశారుసమష్టి ప్రయత్నాల ద్వారా దేశాన్ని బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా కట్టుబడి ఉండాలని సూచించారుమై భారత్ పోర్టల్లో నమోదు చేసుకుని దేశ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని యువతను ప్రోత్సహించారుక్రమశిక్షణసమయపాలనపొద్దున్నే నిద్రలేవడండైరీ రాయడం లాంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు.

ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి చర్చించారుమూడు కోట్ల మంది ‘లఖ్‌పతి దీదీ’లను తయారు చేయడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతను సాధించడంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేశారుఈ పథకం ద్వారా తన తల్లి ఎలా లబ్ధి పొందినదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక వ్యక్తి వివరించారుఈ పథకం వల్ల ఆమె తయారు చేస్తున్న ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారుదేశంలోని సరసమైన డేటా ధరలు అనుసంధాన వ్యవస్థలను గణనీయంగా మార్చాయనిడిజిటల్ ఇండియాను శక్తిమంతం చేశాయని ప్రధాని వివరించారుఇవి ప్రజలు ఒకరితో ఒకరు పరస్పరం అనుసంధానమై ఉండేందుకుఅవకాశాలను విస్తరించుకొనేందుకు దోహదపడుతున్నాయని అన్నారు.

పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. 140 కోట్ల మంది భారతీయులు శుభ్రతను పాటించాలనే తీర్మానం చేసుకుంటే దేశం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుందని ప్రధానమంత్రి అన్నారుఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమ ప్రాముఖ్యం గురించి మాట్లాడుతూఅందరూ మొక్కలు నాటి తమ తల్లికి అంకితమివ్వాలని సూచించారుఫిట్ ఇండియా ఉద్యమం గురించి కూడా ప్రధాని చర్చించారుశారీరక ధారుడ్యంఆరోగ్యంపై దృష్టి సారించి యోగ సాధనకు సమయం కేటాయించాలనిఇది బలమైన ఆరోగ్యమైన దేశానికి అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయులతో సైతం ప్రధాని ముచ్చటించారుఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారు సంతోషం వ్యక్తం చేశారుభారతదేశ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూవారి సందర్శనల్లో ఎదురైన సానుకూల అనుభవాలను పంచుకొన్నారు.

 

***


(Release ID: 2096007) Visitor Counter : 15