ప్రధాన మంత్రి కార్యాలయం
సింగపూర్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
16 JAN 2025 10:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సింగపూర్ అధ్యక్షుడు శ్రీ థర్మన్ షణ్ముగరత్నంతో ఈ రోజు సమావేశమయ్యారు. ‘‘భారత్-సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పరిధిలోకి వచ్చే అన్ని అంశాలపైనా మేం చర్చించాం. సెమీకండక్టర్లు, డిజిటలీకరణ, నైపుణ్యాల సాధన, అనుసంధానం, తదితర అత్యాధునిక రంగాల గురించి మేం చర్చించుకున్నాం’’ అని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘సింగపూర్ అధ్యక్షుడు శ్రీ థర్మన్ షణ్ముగరత్నంతో ఈ రోజు సాయంత్రం సమావేశమయ్యాను. మేం భారత్-సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికున్న పూర్తి పరిధి గురించి చర్చించాం. సెమీకండక్టర్లు, డిజిటలీకరణ, నైపుణ్యాల సాధన, అనుసంధానం, తదితర అత్యాధునిక రంగాలపై మేం మాట్లాడుకున్నాం. పరిశ్రమ, మౌలిక సదుపాయాల కల్పన, సంస్కృతి రంగాల్లో సహకారాన్ని ఏయే పద్ధతుల్లో మెరుగుపర్చుకోవచ్చన్నది కూడా మేం చర్చించాం’’ అని తెలిపారు.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2093750)
आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam