ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
మహాకుంభ్ ప్రయాగరాజ్ 2025 కోసం ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక శాఖ రూపొందించిన భాషిణి 11 భాషల్లో అందుబాటులో ఉంది
భాషిణిలోని ‘డిజిటల్ లాస్ట్ & ఫౌండ్ సొల్యూషన్’ ద్వారా మహాకుంభ్‌లో మీరు పోగొట్టుకున్న/మీకు దొరికిన వస్తువుల గురించి మాతృ భాషలో నమోదు చేయండి & సులభ కమ్యూనికేషన్ కోసం రియల్-టైమ్ టెక్స్ట్/వాయిస్ అనువాదం పొందండి
సజావుగా, సరైన-సమయంలో సమాచారం, మార్గదర్శన సహాయం కోసం కుంభ్ Sah’AI’yak చాట్‌బాట్ ద్వారా భాషిణి అనువాద మద్దతు అందుబాటులో ఉంటుంది;
భాషావరోధాలను అధిగమించండి: మహాకుంభ్ వద్ద భక్తుల సహాయం కోసం యూపీ 112 హెల్ప్‌లైన్‌కు భాషిణి కన్వర్స్ (వార్తాలాప్) ఫీచర్ జోడించారు
Posted On:
14 JAN 2025 2:10PM by PIB Hyderabad
ఈనెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ వద్ద భక్తులకు బహుళ భాషల్లో సహాయాన్ని అందుబాటులో ఉంచేందుకు ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ భాషిణి ఏకీకరణ ద్వారా సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.
‘డిజిటల్ లాస్ట్ & ఫౌండ్ సొల్యూషన్’
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంలో పాల్గొనే భక్తులకు ‘డిజిటల్ లాస్ట్ & ఫౌండ్ సొల్యూషన్’ ద్వారా భాషణి భాషానువాద వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కింద చూడండి:
1. బహుళ భాషల సహాయం
a. మీ మాతృ భాషలో మాట్లాడుతూ పోగొట్టుకున్న/దొరికిన వస్తువుల వివరాలు నమోదు చేయడం
b. కమ్యూనికేషన్ సౌలభ్యం కోసం సకాలంలో టెక్స్ట్/వాయిస్ అనువాదం
2. చాట్‌బాట్ సహాయం: సందేహాల కోసం అలాగే కియోస్క్ మార్గదర్శనం కోసం బహుళ భాషల్లో చాట్‌బాట్
3. మొబైల్ యాప్/కియోస్క్ ఇంటిగ్రేషన్: మార్గదర్శకాలను మీ స్థానిక భాషల్లోకి అనువదించడం
4. పోలీసు సహకారం: అధికారులతో ఎలాంటి అవాంతరాలు లేకుండా మాట్లాడేందుకు వీలు కల్పించడం
కుంభ్ Sah’AI’yak చాట్‌బాట్
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన కుంభ్ Sah’AI’yak అనేది మహా కుంభ్ 2025 కోసం ఇక్కడకు వచ్చే లక్షలాది సందర్శకుల సహాయం కోసం రూపొందించిన ఏఐ-ఆధారిత, బహుళభాషలు, వాయిస్‌ను అనుమతించే చాట్‌బాట్. అత్యాధునిక ఏఐ సాంకేతికతలతో (ఎల్ఎల్ఎఎమ్ఎ ఎల్ఎల్ఎమ్ వంటివి) ఈ బాట్‌ను రూపొందించారు. కుంభ్ Sah’AI’yak యాత్రికులకు అవసరమైన సమాచారం అలాగే మార్గదర్శనం విషయంలో సహాయం అందించడం ద్వారా వారి మహాకుంభ్ 2025 అనుభవాన్ని మరుపురానిదిగా చేసే లక్ష్యంతో పనిచేస్తుంది.
అందరి కోసం సజావుగా, సకాలంలో సమాచారాన్ని, మార్గదర్శన సహాయాన్ని అందించడం ద్వారా సందర్శకుల అనుభవాలను మెరుగుపరిచేందుకు కుంభ్ Sah’AI’yak ను రూపొందించారు. భాషిణిలోని భాష అనువాదం హిందీ, ఇంగ్లీష్, 9 భారతీయ భాషలు సహా మొత్తం 11 భాషల్లో చాట్‌బాట్‌కు మద్దతునిస్తుంది.
యూపీ 112 అత్యవసర హెల్ప్‌లైన్
దేశం నలుమూలల నుంచి అలాగే విదేశాల నుంచి మహా కుంభ్‌కు తరలివచ్చే భక్తులకు ప్రయాగరాజ్, పరిసర ప్రాంతాల్లో మాట్లాడే భాషను అర్థం చేసుకునేందుకు సహాయం అవసరం. భాషిణి మొబైల్ అప్లికేషన్‌లోని ‘కన్వర్స్’ (వార్తాలాప్) ఫీచర్ ఈ మెగా ఈవెంట్ వద్ద ఏర్పాటు చేసిన యూపీ పోలీసుల 112 హెల్ప్‌లైన్ విభాగంతో భక్తులు సజావుగా సంభాషించడాన్ని సులభతరం చేస్తుంది. భాషా అవరోధం కారణంగా సహాయం కోరే బాధలో ఉన్న భక్తుల మనోవేదనలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు రాకుండా యాప్‌లోని సంభాషణ ఫీచర్‌ను ఉపయోగించుకునేలా క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ భాషిణి యాప్‌తో కలిసి పనిచేస్తోంది.
అందువల్ల భాషిణి బహుళ భాషల మద్దతుతో మహా కుంభ్ 2025 సందర్శకులకు వారి సందేహాలు, మార్గదర్శన సహాయం విషయంలో అద్భుతమైన అనుభవాన్ని అందించే లక్ష్యంతో పనిచేస్తుంది. మొత్తం మీద, భాషిణి భాషా అనువాద వ్యవస్థ ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరి కోసం ఒక చక్కని, సమీకృత అనుభవాన్ని అందిస్తూ, సాంకేతిక ఆవిష్కరణలు, యాక్సెసిబిలిటీ పట్ల ఎమ్ఇఐటివైకి గల నిబద్దతను ప్రతిబింబిస్తోంది.
*****
(Release ID: 2093198)
Visitor Counter : 29