ప్రధాన మంత్రి కార్యాలయం
మూడు ముఖ్యమైన నౌకాదళ యుద్ధ నౌకల ఆరంభం... రక్షణ రంగంలో ప్రపంచ నాయకత్వం, స్వావలంబన దిశగా సాగే మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JAN 2025 8:29PM by PIB Hyderabad
ఈ రోజు (2025 జనవరి 15) న మూడు ప్రధానమైన నావికాదళ యుద్ధ నౌకలను ప్రారంభిస్తుండడం రక్షణ రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదగడానికి చేస్తున్న మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని, స్వావలంబన దిశగా మన తపనను మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు.
నావికాదళం అధికార ప్రతినిధి ‘ఎక్స్ ‘ లో చేసిన పోస్టుపై స్పందిస్తూ “జనవరి 15, మన నౌకాదళ సామర్థ్యాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన రోజు కాబోతోంది. మూడు ప్రధాన నావికాదళ యుద్ధ నౌకలను ప్రారంభిస్తుండడం రక్షణ రంగంలో ప్రపంచ నాయకత్వం కోసం మనం చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది. అలాగే రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మన తపనను మరింత పెంచుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2093193)
आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam