ప్రధాన మంత్రి కార్యాలయం
పౌరసేవా ప్రధాన పాలనకు భారత్ ఎంతగా కట్టుబడి ఉందో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు, 2025 ముసాయిదా’ చాటుతోంది : ప్రధాన మంత్రి
Posted On:
07 JAN 2025 4:18PM by PIB Hyderabad
పౌరులకు సేవ చేయడానికే పాలన అనే సూత్రానికి భారత్ ఎంతగా కట్టుబడి ఉన్నదీ ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు, 2025 ముసాయిదా’ చాటి చెబుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘పౌరులకు సేవ చేయడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు, 2025 ముసాయిదా’ ఎంతగా చాటిచెబుతోందో కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ (@AshwiniVaishnaw) తన సందేశంలో వివరించారు. వృద్ధికీ, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోవడానికీ ఈ నియమావళి తోడ్పడుతూనే, అదే సమయంలో వ్యక్తుల డేటానను రక్షించాలని కూడా ధ్యేయంగా పెట్టుకొంది.’’
(Release ID: 2091056)
Visitor Counter : 16
Read this release in:
Bengali
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada