ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జిమ్మీ కార్టర్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 30 DEC 2024 2:13PM by PIB Hyderabad

అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జిమ్మీ కార్టర్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:

“అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జిమ్మీ కార్టర్ మృతి అత్యంత బాధాకరం. ఆయన గొప్ప దార్శనికత కలిగిన రాజనీతిజ్ఞుడు. ప్రపంచ శాంతి, సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. భారత్ - అమెరికా సంబంధాలను బలోపేతం చేయడం కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అమెరికా ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను”.  

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2088849) సందర్శకుల సూచీ సంఖ్య : : 80