ప్రధాన మంత్రి కార్యాలయం
అరేబియన్ గల్ఫ్ కప్: కువైట్ అమీరు గౌరవ అతిథి హోదాలో హాజరైన ప్రధానమంత్రి
Posted On:
21 DEC 2024 10:24PM by PIB Hyderabad
కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభ కార్యక్రమానికి అమీరు ‘గౌరవ అతిథి’ హోదాలో హాజరయ్యారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని కువైట్‌లో నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కువైట్ అమీరుతోనూ, యువరాజు, ప్రధానితోనూ కలిసి చూశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని కువైట్ నాయకత్వంతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
కువైట్ రెండు సంవత్సరాలకోసారి అరేబియన్ గల్ఫ్ కప్‌ను నిర్వహిస్తోంది. దీనిలో జీసీసీ దేశాలు, ఇరాక్, యెమన్ సహా 8 దేశాలు పాల్గొంటాయి. ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆ ప్రాంతంలో అత్యంత ప్రధాన క్రీడాకార్యక్రమాల్లో ఒకటిగా పేరుతెచ్చుకొంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న దేశాల్లో కువైట్ ఎక్కువ సార్లు టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. ప్రధానమంత్రి శ్రీ మోదీ ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న అన్ని దేశాలకూ తన శుభాకాంక్షలు తెలియజేశారు.
***
(Release ID: 2087108)
Visitor Counter : 6