ప్రధాన మంత్రి కార్యాలయం
కువైట్ పర్యటనకు ముందు ప్రధాని సందేశం
Posted On:
21 DEC 2024 9:21AM by PIB Hyderabad
’’గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సభా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేను ఈ రోజు కువైట్ బయల్దేరుతున్నాను.
కువైట్‌తో తరతరాలుగా పెంపొందించుకున్న చరిత్రాత్మక సంబంధానికి మేం ఎంతో విలువ ఇస్తున్నాం. మా మధ్య వాణిజ్య, ఇంధన పరంగా పటిష్టమైన భాగస్వామ్యం మాత్రమే కాదు.. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం, శ్రేయస్సు దిశగా కలిసి కృషి చేస్తున్నాం.
గౌరవనీయ కువైట్ అమీర్, యువరాజు, ప్రధానమంత్రులతో సమావేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. మన ప్రజలు, ప్రాంత ప్రయోజనాల కోసం భవిష్యత్ భాగస్వామ్యం దిశగా ప్రణాళికలను రూపొందించడానికి ఇది ఒక అవకాశం.
రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని బలోపేతం చేయడంలో ఎంతగానో దోహదపడిన కువైట్ భారతీయ ప్రవాసులను కలవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
గల్ఫ్ ప్రాంతంలో ప్రధాన క్రీడా కార్యక్రమయిన అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన కువైట్ నాయకత్వానికి నా కృతజ్ఞతలు. క్రీడాపరంగా అత్యున్నతమైన, ప్రాంతీయ ఏకతా వేడుకలో భాగమవ్వడం కోసం నేను ఎదురు చూస్తున్నాను.
ఈ పర్యటన భారత్, కువైట్ ప్రజల మధ్య సత్సంబంధాలు, స్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసం నాకుంది’’.
(Release ID: 2086970)
Visitor Counter : 28
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam