ప్రధాన మంత్రి కార్యాలయం
దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని భాగంగా చేసుకోవాలని ప్రధాన మంత్రి పిలుపు
प्रविष्टि तिथि:
21 DEC 2024 12:28PM by PIB Hyderabad
ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం పిలుపునిచ్చారు. మనిషి జీవితంలో, అలాగే సమాజంలోనూ, ప్రపంచంలోనూ శాంతి సామరస్యాలను పెంపొందించడానికి ధ్యానం శక్తిమంతమైన సాధనమని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘నేడు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని భాగంగా చేసుకోవాలని, అది అందించే సానుకూలతను ఆస్వాదించాలని కోరుతున్నాను. మనిషి జీవితంలో.. అలాగే సమాజంలో, ప్రపంచంలోనూ శాంతి, సామరస్యాలను పెంపొందించడానికి ధ్యానం శక్తిమంతమైన సాధనం. నేటి సాంకేతిక యుగంలో ధ్యానాన్ని నిత్యకృత్యంగా మార్చుకోవడానికి యాప్ లు, వివరణాత్మకంగా ఉన్న వీడియోలు విలువైన సాధనాలుగా ఉపయోగపడతాయి”.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2086968)
आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam