ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన అతి పిన్న వయస్కుడు గుకేష్ డీ ని అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 DEC 2024 7:35PM by PIB Hyderabad

అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ డీ ని నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ గెలుపు అసాధారణమైన చారిత్రక విజయమని పేర్కొన్నారు.  

అంతర్జాతీయ చదరంగ సమాఖ్య ‘ఎక్స్’ వేదికపై చేసిన పోస్టుకు స్పందిస్తూ:

“ఇది అపూర్వమైన చారిత్రక విజయం!

అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్నా గుకేష్ డీ కి అభినందనలు. తిరుగులేని సత్తా, మొక్కవోని కృషి, పట్టుదల వల్ల ఈ గెలుపు సాధ్యమయ్యింది.  

ఈ విజయం చదరంగ చరిత్ర పుటల్లో అతనికి శాశ్వత స్థానం కల్పించడమే కాక, కలలు కనేందుకు, వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని లక్షలాది మందికి స్ఫూర్తిని కలిగిస్తోంది.

భవిష్యత్తు పోటీలకు నా శుభాకాంక్షలు... @DGukesh” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  

*******

MJPS/SR/SKS


(రిలీజ్ ఐడి: 2083988) సందర్శకుల సూచీ సంఖ్య : : 144