ప్రధాన మంత్రి కార్యాలయం
టీబీ వ్యాప్తిని గణనీయంగా తగ్గించిన నిక్షయ మిత్ర వంటి కార్యక్రమాలు.. సత్వర, ప్రభావవంతమైన చికిత్సలు: కోలుకున్న వారి సంఖ్యలో మెరుగుదల.. టీబీ నివారణలో భారత్ అంతర్జాతీయ నేతృత్వం: ప్రధాని
Posted On:
07 DEC 2024 12:39PM by PIB Hyderabad
నిక్షయ మిత్ర వంటి కార్యక్రమాలు.. సత్వర, ప్రభావవంతమైన చికిత్సలు టీబీ వ్యాప్తిని గణనీయంగా తగ్గించాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. కోలుకున్న వారి సంఖ్యను అవి గణనీయంగా పెంచాయనీ, టీబీని అరికట్టడంలో భారత నేతృత్వాన్ని అవి మరింత బలోపేతం చేశాయన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేంద్ర మంత్రి శ్రీ జె.పి. నడ్డా చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ -
“నిక్షయ పోషణ్ యోజనతో పోషకాహారాన్ని అందించడం ద్వారా భారత టీబీ నిర్మూలన చర్యలు ఎలాంటి పరివర్తనాత్మక పురోగతిని సాధించాయో కేంద్ర మంత్రి శ్రీ @JPNadda వివరించారు. నిక్షయమిత్ర వంటి కార్యక్రమాలు.. సత్వర, ప్రభావవంతమైన చికిత్సలు టీబీ వ్యాప్తిని గణనీయంగా తగ్గించాయి. కోలుకున్నవారి సంఖ్య పెరిగింది. టీబీ నిర్మూలనలో భారత అంతర్జాతీయ నేతృత్వాన్ని ఇది బలోపేతం చేసింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2082041)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam