ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కువైట్ విదేశాంగ మంత్రితో ప్రధాని భేటీ

కువైట్ యువరాజుతో సెప్టెంబర్‌లో న్యూయార్క్ లో తాను భేటీ అయిన సంగతిని గుర్తు చేసుకొన్న ప్రధానమంత్రి
ద్వైపాక్షిక సంబంధాల పురోగమనంపై హర్షం
వ్యాపారం, పెట్టుబడి, ఇంధనం, టెక్నాలజీ, సంస్కృతి, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల్లో

సహకారాన్ని పెంపొందింప చేసుకోవడంపై ఇరువురు నేతల చర్చలు


కువైట్ లోని భారతీయుల పట్ల శ్రద్ధ వహిస్తున్నందుకు కువైట్ నాయకత్వానికి ప్రధానమంత్రి ధన్యవాదాలు


భారతదేశం, గల్ఫ్ సహకార సమాఖ్య మధ్య సన్నిహిత సహకారం ఉండాలని ప్రధానమంత్రి ఉద్ఘాటన


వీలైనంత త్వరలో కువైట్‌ సందర్శన...ఆహ్వానాన్ని అంగీకరించిన ప్రధానమంత్రి

Posted On: 04 DEC 2024 9:44PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కువైట్ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్లా అలీ అల్ - యాహ్యా ఈ రోజు సమావేశమయ్యారు.

 

ఈ సందర్భంగా కువైట్ యువరాజు శ్రీ షేఖ్ సబాహ్ ఖలీద్ అల్-హమద్ అల్-సబాహ్‌తో సెప్టెంబరులో న్యూయార్క్‌లో తాను భేటీ అయిన సంగతిని ప్రధాని గుర్తుకు తెచ్చుకొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి జోరందుకొంటున్నందుకు ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

 

వ్యాపారం, పెట్టుబడి, ఇంధనం, టెక్నాలజీ, సంస్కృతి, రెండు దేశాల ప్రజల మధ్య దృఢ సంబంధాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకొనేందుకు తీసుకోదగిన చర్యలపై ప్రధాని, కువైట్ విదేశాంగ మంత్రి చర్చించారు.

 

కువైట్‌లో నివసిస్తున్న పది లక్షల మంది భారతీయుల సంరక్షణ విషయంలో కువైట్ నాయకత్వం శ్రద్ధ వహిస్తున్నందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

జీసీసీకి ప్రస్తుతం కువైట్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న నేపథ్యంలో భారతదేశానికి, గల్ఫ్ సహకార సమాఖ్యకు మధ్య ఇప్పుడున్న సన్నిహిత సహకారం మరింత పటిష్టం కాగలదన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న స్థితిపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం సాధ్యమైనంత త్వరగా తిరిగి నెలకొనాలని కోరుకున్నారు.

సాధ్యమైనంత త్వరలో కువైట్ కు రావాలంటూ కువైట్ నాయకత్వం అందించిన ఆహ్వానాన్ని ప్రధానమంత్రి అంగీకరించారు.


(Release ID: 2081056) Visitor Counter : 23