ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి
Posted On:
25 NOV 2024 8:10PM by PIB Hyderabad
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు పరిపాలనా భవన సముదాయంలోని ఆడిటోరియంలో రేపు (నవంబర్ 26) సాయంత్రం 5 గంటలకు ఏర్పాటైన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2023-24 ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. అనంతరం ఆహూతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

(Release ID: 2077277)
Visitor Counter : 79
Read this release in:
Odia
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam