ప్రధాన మంత్రి కార్యాలయం
ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నివాళి
ఈ యేడు స్వామి దయానంద సరస్వతి ద్విశత జయంత్యుత్సవం జరుపుకొంటున్నాం.. ఈ రోజు విశేషమైనది: ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
22 NOV 2024 3:09AM by PIB Hyderabad
గయానా లోని జార్జ్ టౌన్ లో ఉన్న ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గయానాలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో వారి కృషి, పాత్ర ప్రశంసనీయమని శ్రీ మోదీ కొనియాడారు. స్వామి దయానంద సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.
“గయానాలోని జార్జ్ టౌన్ లో ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద నివాళులర్పించాను. గయానాలో మన సంస్కృతిని పరిరక్షించడంలో వారి పాత్ర నిజంగా ప్రశంసనీయం. స్వామి దయానంద్ సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనది” అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో చేసిన ఓ పోస్టులో ఆయన పేర్కొన్నారు.
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2075855)
సందర్శకుల సూచీ సంఖ్య : : 86
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam